పాతపాడు (విజయవాడ గ్రామీణ)

పాతపాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 212., ఎస్.టి.డి.కోడ్ = 0866.

పాతపాడు (విజయవాడ గ్రామీణ)
—  రెవిన్యూ గ్రామం  —
పాతపాడు (విజయవాడ గ్రామీణ) is located in Andhra Pradesh
పాతపాడు (విజయవాడ గ్రామీణ)
పాతపాడు (విజయవాడ గ్రామీణ)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°34′51″N 80°39′53″E / 16.580802°N 80.664710°E / 16.580802; 80.664710
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ దారావతు హరి
జనాభా (2011)
 - మొత్తం 3,371
 - పురుషుల సంఖ్య 1,754
 - స్త్రీల సంఖ్య 1,617
 - గృహాల సంఖ్య 957
పిన్ కోడ్ 521 212
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలంసవరించు

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో అంబాపురం, కె.తాడేపల్లి, పాయకపురం, సూరంపల్లి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

విజయవాడ, తాడేపల్లి, గన్నవరం, జి.కొండూరు

గ్రామనికి రవాణా సౌకర్యాలుసవరించు

రామవరప్పాడు, గుణదల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుణదల, రామవరప్పాడు, విజయవాడ 10 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, పాతపాడు,వెంకటాపురం, పాతపాడు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

సుబ్బమ్మ చెరువు:- నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2017,మే-29న ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. ఈ విధంగా చెరువులో త్రవ్విన మట్టిని, రైతులు తమ పొలాలకు తరలించుకొనడమేగాక, పేదల ఇళ్ళు మెరక చేసుకొనడానికీ, పంచాయతీ పనులకూ ఉపయోగించుకొనడం విశేషం. [5]

గ్రామ పంచాయతీసవరించు

  1. ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని 1964 ప్రాంతాలలో నిర్మించారు. ఈ భవనంలోనే తపాలా కేంద్రం, డ్వాక్రా, రైతుల సదస్సులు, సర్పంచి, కార్యదర్శులకు సంబంధించిన కార్యక్రమాలు నడుపుచున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరినది. [3]
  2. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ దారావతు హరినాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ రామాలయంసవరించు

ఈ గ్రామంలోని రామాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [2]

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో స్వామివారు చైత్రపౌర్ణమినాడు వెలిసినట్లు గ్రామస్థుల కథనం. అందువలన, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రపౌర్ణమి రాత్రికి శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవస్వామివారి శాంతికళ్యాణం వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. మరుసటిరోజున అనగా పాడ్యమినాడు, భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2980.[3] ఇందులో పురుషుల సంఖ్య 1532, స్త్రీల సంఖ్య 1448, గ్రామంలో నివాస గృహాలు 738 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1349 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,371 - పురుషుల సంఖ్య 1,754 - స్త్రీల సంఖ్య 1,617 - గృహాల సంఖ్య 957

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Vijayawada-Rural/Pathapadu". Archived from the original on 20 జనవరి 2015. Retrieved 18 June 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-02.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు విజయవాడ; 2013,ఆగస్టు-11; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-10; 4వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2017,ఏప్రిల్-9; 6వపేజీ.  [5] ఈనాడు అమరావతి; 2017,మే-30; 7వపేజీ.