రామవరప్పాడు
రామవరప్పాడు, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ప్రస్తుతం విజయవాడ నగరంలో కలిసిపోయింది.
రామవరప్పాడు | |
— జనగణన పట్టణం — | |
|
|
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°31′22″N 80°40′54″E / 16.522875°N 80.681710°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | విజయవాడ గ్రామీణ |
ప్రభుత్వం | |
- సర్పంచి | పీకా లక్ష్మీకుమారి |
జనాభా (2011) | |
- మొత్తం | 22,222 |
- పురుషుల సంఖ్య | 11,092 |
- స్త్రీల సంఖ్య | 11,130 |
- గృహాల సంఖ్య | 6,130 |
పిన్ కోడ్ | 521 108 |
ఎస్.టి.డి కోడ్ | 0866 |
జనాభా గణాంకాలు సవరించు
రామవరప్పాడు ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లాలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 భారత జనాభా లెక్కలు నివేదిక ప్రకారం రామవరప్పాడు పట్టణ జనాభా 22,222, అందులో 11,092 మంది పురుషులు కాగా 11,130 మంది స్త్రీలు.
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2316, ఇది రామవరప్పాడు (సి.టి) మొత్తం జనాభాలో 10.42%. పట్టణ పరిధిలో స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1003గా ఉంది. అంతేకాకుండా రామవరప్పాడులో బాలల లింగ నిష్పత్తి 978 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటుతో పోలిస్తే 939. రామవరప్పాడు నగరం అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02 కంటే 81.02% ఎక్కువ. . రామవరప్పాడులో పురుషుల అక్షరాస్యత దాదాపు 84.48% కాగా స్త్రీ అక్షరాస్యత 77.58%.
రామవరప్పాడు పట్టణ పరిధిలో మొత్తం 6,130 గృహాలకు స్థానిక స్వపరిపాలనా సంస్థ పరిపాలనను కలిగి ఉంది.[1]
గ్రామ భౌగోళికం సవరించు
ఇది సముద్ర మట్టంనుండి 21 మీ.ఎత్తులో ఉంది.
సమీప గ్రామాలు సవరించు
నాగార్జున నగర్ 1 కి.మీ, శ్రీ రామచంద్రనగర్ 1 కి.మీ, ప్రసాఅదంపాదు 1 కి.మీ గుణదల 1 కి.మీ, శ్రీనివాస నగర్ 1 కి.మీ
విద్యా సౌకర్యాలు సవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
రైలు వసతి సవరించు
- విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206 (ఆదివారం తప్ప)
- గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
- విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
విమానాశ్రయం సవరించు
రామవరప్పాడు 16 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గర్లో విజయవాడ విమానాశ్రయము గన్నవరం లో ఉంది.
బస్సు సవరించు
ఈ గ్రామానికి సిటి బస్సుల సౌకర్యం ఉంది.
గ్రామ పంచాయతీ సవరించు
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో పీకా లక్ష్మీకుమారి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా కొల్లా ఆనందకుమార్ ఎం.బి.య్యే. ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు సవరించు
శ్రీ వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయం సవరించు
- ఇక్కడ దసరాకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు. పలు సాంస్కృతిక కార్యక్రమ్మాలు గూడా నిర్వహించెదరు.
- కార్తీకమాసం సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలో కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం సవరించు
ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉంది. 2016,ఏప్రిల్-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు.
శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం సవరించు
అమ్మవారికి సంవత్సరం విడిచి సంవత్సరం వేమినేని వారిచే పసుపుకుంకుమలు ఇచ్చే సంప్రదాయం కలదు రామవరప్పాడు లో రాజుల బజార్ నందు గల పుట్టింటికి అమ్మవారు పుట్టింటి వారు అయిన రాజులు సంవత్సరం విడిచి సంవత్సరం పుట్టింటికి తీసుకు వెళతారు అమ్మవారికి ప్రతి సంవత్సరం భోగి సంక్రాంతి కనుమ జనవరి 13, 14, 15 తేదీలలో క్యాలెండర్ తో సంబంధం లేకుండా వైభవంగా జరుపుకుంటారు.
గ్రామ విశేషాలు సవరించు
చాగంటిపాడు ట్రస్ట్:- ఈ ట్రస్ట్ ద్వారా గత కొంత కాలంగా పేద, బడుగు, బలహీనవర్గాలవారికి సేవలందించుచున్నారు. ఈ ట్రస్ట్ కార్యాలయాన్ని, ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో, 2015, అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
మూలాలు సవరించు
- ↑ "Ramavarappadu Census Town City Population Census 2011-2022 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-05-27.