జక్కంపూడి, కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జక్కంపూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —
జక్కంపూడి is located in Andhra Pradesh
జక్కంపూడి
జక్కంపూడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°35′00″N 80°36′51″E / 16.583251°N 80.614059°E / 16.583251; 80.614059
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విజయవాడ గ్రామీణ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ కొమ్ము రవి
జనాభా (2011)
 - మొత్తం 1,309
 - పురుషుల సంఖ్య 698
 - స్త్రీల సంఖ్య 611
 - గృహాల సంఖ్య 346
పిన్ కోడ్ : 520012
ఎస్.టి.డి కోడ్ 0866

గ్రామ చరిత్ర

మార్చు

ఈ గ్రామానికి ఆగ్నేయంగా ఉన్న షాహరీ గురుమూర్తి పొలంలో, ఇటీవల క్రీస్తు శకం 15వ శతాబ్దినాటి శాసనం, రెండు శిల్పాలు బయల్పడినవి. రెడ్డిరాజుల పరిపాలన తరువాత కొండపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన ఓడ్ర గజపతి వంశానికి చెందిన కపిళేశ్వర గజపతి కుమారుడైన హంవీరుడు, క్రీస్తు శకం 1464లో ఈ శాసనం చేయించాడు. ఒకప్పుడు జక్కిరెడ్డిపల్లిగా ఉన్న ప్రాంతం కాలక్రమేణా జక్కంపూడిగా మారినది.

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

మార్చు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా ఉంది. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం అనేవి ఉన్నాయి.

విజయవాడ రూరల్ మండలం

మార్చు

విజయవాడ రూరల్ మండలంలోని ఎనికెపాడు, కుందావారి ఖండ్రిక, కొత్తూరు, గూడవల్లి, గొల్లపూడి, జక్కంపూడి, తాడేపల్లి, దోనె ఆత్కూరు, నిడమానూరు, నున్న, పాతపాడు, పైదూరుపాడు, ప్రసాదంపాడు, ఫిర్యాది నైనవరం, బోడపాడు, రామవరప్పాడు, రాయనపాడు, వేమవరం, షహబాదు, సూరాయ పాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం

మార్చు

సముద్రమట్టం నుండి 21 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు

మార్చు

ఫ్రసేర్ పేట 2 కి.మీ, రామరాజునగర్ 2 కి.మీ, జోజినగర్ 2 కి.మీ, పి & టి కాలని 3 కి.మీ, మహంతిపురం 3 కి.మీ

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

చిట్టీనగర్, ఎపిఎస్ ఆర్టీసి బస్ స్టేషన్ విజయవాడ. రైల్వేస్టేషన్: మేజర్ రైల్వేజంక్షన్, విజయవాడ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ఎ,ఎస్,ఎం.జూనియర్ కాలేజి, నున్న, నారాయణ జూనియర్ కాలేజి, గొల్లపూడి, ఎన్.ఆర్.ఐ. ఇంస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోతవరప్పాడు, హార్వెస్ట్ ఇండియా పబ్లిక్ స్కూల్,

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ కొమ్ము రవి సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రామాలయం.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామంలోని రామాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.

వెలుపలి లింకులు.

మార్చు