ఎఫ్.జి.నటేశ అయ్యర్

భారతీయ స్వాతంత్ర ఉద్యమకారుడు

FG నటేశ అయ్యర్ (1880 నవంబరు 11 - 1963 జనవరి 23) భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేసిన కార్యకర్త. అతను ఆధునిక తమిళ నాటకం, తమిళ సినిమా ల మార్గదర్శకులలో ఒకరు. అతను, యువతలో యోగ్యతను గుర్తించి అనేక మందిని ప్రోత్సహించాడు. అనంతర కాలంలో వారు కర్ణాటక సంగీతంలో గొప్ప ప్రదర్శకులుగా మారారు.

ఎఫ్.జి.నటేశ అయ్యర్
జననం(1880-11-11)1880 నవంబరు 11
పుదుక్కొట్టై (నేటి తమిళనాడు)
మరణం1963 జనవరి 23(1963-01-23) (వయసు 82)
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రసిక రంజన సభ వ్యవస్థాపకుడు

ప్రారంభ జీవితం

మార్చు

నటేశ అయ్యర్ 1880 నవంబరు 11న జానకి అమ్మయ్యర్ (పుదుక్కోటమ్మ) గంగాధర శాస్త్రి దంపతులకు జన్మించాడు. బ్రిటీష్ వలస పాలనలో అప్పటి పుదుక్కోట్టై సంస్థానానికి న్యాయ సలహాదారుగా ఉన్నారు. అయ్యర్ అన్నయ్య రావు సాహెబ్ జి. గణపతి శాస్త్రియార్, పుదుకోట్టై రాష్ట్రానికి దివాన్ పదవి పొందాడు. ఆ కుటుంబం అప్పయ్య దీక్షితులు వంశానికి చెందినవారు. [1] అయ్యర్‌కు సంగీతం, నాటక రంగంపై ఉన్న ప్రేమతో పదేళ్ల వయసులో ఇంటి నుండి పారిపోయి, మధుర తిన్నెవెల్లీ - క్విలాన్ రైల్వే నిర్మాణ విభాగంలో క్లర్కుగా చేరాడు. [2]

అతని మనవడు వ్రాసిన ఒక వ్యాసం ప్రకారం, చిన్నతనంలో, "అతను ఆంగ్లేయుల ఆశ్రయం పొందినపుడు వారు అతన్ని క్రైస్తవ మతంలోకి మార్చారు. ఇరవై సంవత్సరాల తరువాత, క్రైస్తవ పూజారులు తన సందేహాలను నివృత్తి చేయలేకపోవడంతో, అసంతృప్తితో అతను కంచి శంకరాచార్యను కలుసుకున్నాడు. అతని నుండి సంతృప్తికరమైన సమాధానాలు లభించడంతో, తిరిగి హిందూమతంలోకి మారాడు." [3] ఆ పుస్తకంలో అతను ఉదహరించిన శంకరాచార్యులు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేర్కొన్నారు. [4] 1923 జూన్‌లో ఆయన జరిపిన సంభాషణలో, క్రైస్తవ మతంపై ఇరవై సంవత్సరాల అనుభవం, జ్ఞానం ఆధారంగా, "హిందూ మతమే మన తల్లి. తల్లిని విడిచిపెట్టడం సరికాదు" అని చెప్పాడు. అయ్యర్ కూడా అలాంటి పాపం చేయడం దురదృష్టకరమని, అయితే తన మూర్ఖత్వాన్ని సమయానికి గ్రహించానని, మరెవరూ అదే తప్పు చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నట్లు సమాచారం. [5]

వృత్తి జీవితం

మార్చు

అయ్యర్ తన వృత్తిలో ఎక్కువ భాగం రైల్వే అధికారిగా దక్షిణ భారత రైల్వే కంపెనీ (SI R)లోనే గడిచింది. అతను 1935లో జిల్లా ట్రాఫిక్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసాడు. ఈ స్థానాన్ని ఆక్రమించిన మొదటి భారతీయుడతడు.  లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కోట్ చేయబడిన స్టాక్‌లు షేర్లతో ఈ కంపెనీ ఇంగ్లాండ్‌లో స్థాపించారు. దక్షిణ భారత రైల్వే పరిపాలనా ప్రధాన కార్యాలయం తిరుచిరాపల్లిలో ఉంది. అయ్యర్ తిరుచిరాపల్లిలో తన ఇంటిని నిర్మించుకున్నాడు. తన జీవితంలో ఎక్కువ భాగం ఈ నగరంలోనే గడిపాడు. [6]

అయ్యర్ భారత జాతీయ కాంగ్రెసు పార్టీ సభ్యుడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సంవత్సరాలలో వార్షిక భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు నగరానికి ప్రతినిధిగా హాజరయ్యాడు. 1914లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. బొంబాయి (1915), లక్నో (1916), మద్రాసు (1917) సమావేశాలలో పాల్గొన్నాడు. లక్నో సమావేశాల్లో సబ్జెక్ట్స్ కమిటీ సభ్యుడు. కాంగ్రెస్ - ఇండియన్ ముస్లిం లీగ్ సంస్కరణల పథకంపై చర్చలో పాల్గొన్నాడు. 1917లో మద్రాసు సెషన్‌లో, అతను తిరుచినాపల్లి నుండి ప్రతినిధిగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎన్నికైన సభ్యుడు, సబ్జెక్ట్స్ కమిటీ సభ్యుడు. బహిరంగ సమావేశాలలో ఒప్పంద కార్మికులపై తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.  అతను ఆ సంవత్సరాల్లో ఇండియన్ హోమ్ రూల్ ఉద్యమానికి మద్దతుదారుడు.


అయ్యర్ "తిరుచ్చి మునిసిపాలిటీకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ ఛైర్మన్"గా ఘనత పొందాడు. [7] అతను కొన్ని సంవత్సరాలు ట్రిచ్నోపాలి మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. [8] [9] 1930లలో తమిళ పునరుజ్జీవనంపై ప్రచురించిన ఒక పరిశోధనా పత్రంలో అయ్యర్‌ను ప్రాముఖ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించారు. ఇతను "1920లలో ట్రిచ్‌నోపోలీ మునిసిపాలిటీకి ఛైర్మన్‌గా నిరంకుశంగా వ్యవహరించినప్పటికీ సమర్థవంతంగా పనిచేసాడు." [10]

నాటక రంగం

మార్చు

అయ్యర్ 1914లో తిరుచిరాపల్లిలో రసిక రంజన సభ అనే ఔత్సాహిక నాటక బృందాన్ని స్థాపించాడు. [11] బ్రిటీష్ రాజ్ పరిపాలించిన కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో స్థానిక "ప్రతిభను" ప్రోత్సహించడంలో రసిక రంజన సభను మద్రాసుకు చెందిన సుగుణ విలాస సభ, కుంభకోణంలోని వాణీ విలాస సభ, తంజావూరుకు చెందిన సుదర్శన్ సభలతో సమానంగా పరిగణించారు. [12] రసిక రంజన సభ ప్రదర్శించిన ఆంగ్ల నాటకాలకు సంబంధించిన కొన్ని రికార్డులు ఉన్నాయి. 1915లో ట్రిచినోపాలి కలెక్టర్ బంగ్లాలో, షెరిడాన్ నాటకం 'పిజారో'ను లేడీస్ వార్ ఫండ్‌కు సహాయంగా ప్రదర్శించారు. ప్రధానంగా బ్రిటీష్ ప్రేక్షకులు, అందరూ తమిళులే ఐన తారాగణం అద్భుతంగా డైలాగులు పలకడం చూసి ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. 1918లో కర్ణాటక పదాతిదళం నిర్వహించిన శాంతి ఉత్సవాల్లో భాగంగా రెండు నాటకాలు ప్రదర్శించారు. 1918లో, "ఎట్ హోమ్" మిస్టర్ బ్లాక్‌స్టోన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి ఇవ్వబడింది. అదే నాటక బృందం కొన్ని నాటకాలను ప్రదర్శించింది. [1] అయ్యరుకు హామ్లెట్, ఒథెల్లో వంటి షేక్స్పియర్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. [13] అతను తమిళ సాంఘిక, పౌరాణిక నాటకాల నిర్మాణానికి, నటనకు కూడా ప్రసిద్ధి చెందాడు. RR సభ యొక్క ఇటీవలి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో, అతను "ఆధునిక తమిళ నాటకాల పితామహుడు" అని ప్రశంసించారు. [14] తిరుచిరాపల్లిలోని రాక్‌ఫోర్ట్ టెంపుల్‌లోని 100 స్తంభాల హాలులో MS సుబ్బులక్ష్మికి పదకొండేళ్ల వయసులో మొట్టమొదటిసారిగా మైసూర్ చౌడయ్య వయోలిన్‌లో దక్షిణామూర్తి పిళ్లై మృదంగంతో పబ్లిక్ కచేరీని నిర్వహించినట్లు ఒక కథనం ఉంది. [15] TKS బ్రదర్స్, MG రామచంద్రన్, MR రాధ, MK రాధ వంటి నటీనటులు వారి కెరీర్ ప్రారంభ రోజులలో అయ్యర్‌ను ఆదర్శంగా భావించారు. వారి ప్రతిభను, అవకాశాలను మరింతగా పెంచుకోవడంలో ఆయన సహాయం కోరారు. TKS బ్రదర్స్ రసిక రంజన సభ నిర్మించిన, ప్రదర్శించిన లవకుశ నాటకంలో లవ, కుశుల పాత్రలలో నటించి నాటక ప్రపంచంలో మొదటి పెద్ద గుర్తింపు పొందారు. [16] [17]

నటనా వృత్తి

మార్చు

అయ్యర్ సేవా సదనం అనే తమిళ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి 1938లో విడుదలైన కె. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. సేవా సదనం అనేది ప్రేమ్‌చంద్ రాసిన నవల బజార్-ఎ-హుస్న్ కు అనుసరణ. అయ్యరు ప్రధాన పాత్ర "ఈశ్వర అయ్యర్" గా నటించాడు. MS సుబ్బులక్ష్మి అతని సరసన "సుమతి" గా నటించింది. ఎం.ఎస్ సుబ్బులక్ష్మికి ఇదే తొలిచిత్రం. ఈ చిత్రం సామాజిక సంస్కరణల ఎజెండాకు ప్రసిద్ధి చెందింది. ప్రముఖ మార్క్సిస్ట్ నాయకుడు ఎన్. శంకరయ్య యువతులకు వృద్ధులతో మధ్య వివాహాల అంశాన్ని ఎంచుకున్నందుకు "సేవా సదనం"ను ఒక "అసాధారణ చిత్రం"గా అభివర్ణించాడు. ఈ చిత్రం "అమ్మాయి బాధలను", "వయస్సు మీరిన భర్త మానసిక వేదన" నూ విజయవంతంగా బయటకు తీసుకువచ్చిందని అతను చెప్పాడు. వృద్ధుడి పాత్రలో అయ్యర్ నటనను శంకరయ్య ప్రత్యేకంగా అభినందించాడు. ఇది "ఆకట్టుకుంది" అని అన్నారు. [18]

అయ్యర్ జనవరి 1963లో భోపాల్‌లోని తన కుమార్తె తిరుపురసుందరి ఇంట్లో మరణించాడు. సైనిక లాంఛనాలతో భోపాల్ సరస్సులోని రామ్ ఘాట్ వద్ద ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 SUGANTHY KRISHNAMACHARI (30 January 2014). "A century of service". The Hindu. Retrieved 8 April 2014. Tiruchi's R. R. Sabha, which turns 100 this year, has been fostering the cause of charity and culture. In 1915 at the Trichinopoly Collector's bungalow, Sheridan's play 'Pizzaro' was enacted in aid of the Ladies' War Fund. The predominantly British audience was amazed at the excellent diction of the all Tamil cast. In 1918, two plays were staged as part of the peace celebrations organised by the Carnatic Infantry. In 1918, "At Home" was given to Mr. Blackstone, Deputy Superintendent of Police and the same drama troupe presented a few plays. The troupe staged benefit shows to raise funds for the Manicka Vinayakar temple. The theatre enthusiasts, munificent in their contributions to charitable causes, were all members of the Rasika Ranjana Sabha (RRS), Tiruchi. RRS was inaugurated at a meeting held in the Tiruchi Fort Railway Museum, on November 9, 1914, with Kodiyalam Rangaswamy Iyengar as the first president. The membership fee was eight annas per month. To start with, the sabha had 25 members. Within a year, the number increased to 153. Zamindar of Andipatti, Mc.T. Pethachi Chettiar, Dewan Bahadur T. Desikachariar, Advocate, and G.K. Rengil Doss were among the generous donors to the sabha in the early years. The founder members were men of varied talents. S.S. Subramania Iyer, for instance, wrote two songs for the sabha, 'Gandhi vakyam' to be sung before the commencement of any programme, and mangalam to mark the conclusion. The first secretary of the sabha, F.G. Natesa Iyer, popularly known as FGN, belonged to the lineage of Appayya Dikshitar, and his grandfather and father were accomplished veena players. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "KRISHNAMACHARI" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. F.G. Natesa Iyer [330] - $.5.00 : Sruti, A Monthly Magazine on Indian Performing Arts Archived 3 ఫిబ్రవరి 2013 at Archive.today
  3. T.S. Mani (1–15 April 2012). "FGN – actor and patron of the arts". Madras Musings. No. Volume XXI, number 24. {{cite news}}: |issue= has extra text (help)
  4. Sastri, S. Sambamurthy (1991). Paramacharya: Life of Sri Chandrasekharendra Saraswathi of Sri Kanchi Kamakoti Peetam : Originally Written in Tamil Under the Title Sri Jagadguru Divya Charitram (1991 ed.). Kanchipuram: Jana Kalyan. p. 31.
  5. "Converter convinced not to convert". Sri Ayyappa Bhajanai Sangham. Archived from the original on 14 July 2013. Retrieved 2013-04-24.
  6. Nahla Nainar (23 November 2014). "Once upon a life". The Hindu. It was the now-demolished Manohara Vilas (in Woraiyur), that gave the clan their first proper home in Tiruchi. "It was a palatial house – and there'd be groups of people hanging around waiting to meet my father – poor students looking for admissions, graduates looking for work, and musicians working on the Sabha's productions," she says.
  7. S. P. SARAVANAN (2 November 2015). "Salem, more like a vast urban village". The Hindu. Retrieved 26 December 2015. F.G. Natesa Iyer, who was a senior official of the South Indian Railway Company, was the first elected Indian chairman of Tiruchi Municipality.
  8. Menon, Kumara Padmanabha Sivasankara (1965). Many worlds: an autobiography. Oxford University Press.
  9. Eugene F, Irschick (1986). Tamil revivalism in the 1930s. Cre-A.
  10. Irschick, Eugene F (1986). Tamil revivalism in the 1930s (1986 ed.). Cre-A. p. 194. ISBN 9780836419184.
  11. "Tributes to R. R. Sabha founder". The Hindu. India. 12 November 2010. Archived from the original on 17 November 2010. Retrieved 2011-05-29.
  12. "Sangeet Nataka". Sangeet Natak. 38. Sangeet Natak Akademi. 2004. Retrieved 3 July 2013.
  13. F.G. Natesa Iyer - Soliloquies from Shakespeare's Plays mp3 download forum music-db.org Archived 15 ఏప్రిల్ 2013 at Archive.today
  14. Special correspondent (19 November 2011). "Tribute paid to Natesa Iyer". The Hindu. Chennai, India. M. George, Executive Committee member of the Sabha, recalled late Iyer's contribution to the art of drama and how he himself acted in many of them. He added that Mr. Iyer could be rightly called the 'Father of Dramas'.
  15. Sruti magazine cover story on Iyer, page 20, issue number 330, March 2012
  16. Sruti magazine cover story on Iyer, page 25, issue number 330, March 2012
  17. http://columbuscarnatic.org/wp-content/uploads/2012/04/fgn.pdf[permanent dead link]
  18. Vishwanathan S. "A progressive film maker; Tribute to K. Subramanian", Volume 21 - Issue 14, 3-16 July 2004 of Frontline magazine, (brought out by Hindu publications), Chennai, Tamilnadu. Archived 17 అక్టోబరు 2006 at the Wayback Machine