ఎలుకా మజాకా 2016, ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పావని, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా, బల్లెపల్లి మోహన్ సంగీతం అందించాడు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం రేలంగి నరసింహరావుకు 75వ చిత్రం.[1]

ఎలుకా మజాకా
దర్శకత్వంరేలంగి నరసింహారావు
స్క్రీన్ ప్లేదివాకర్ బాబు
గంగోత్రి విశ్వనాథ్
కథరేలంగి నరసింహారావు
నిర్మాతమారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు
తారాగణంవెన్నెల కిషోర్
బ్రహ్మానందం
పావని
రఘుబాబు
ఛాయాగ్రహణంనాగేంద్ర కుమార్ మోతుకూరి
కూర్పునందమూరి హరి
సంగీతంబల్లెపల్లి మోహన్
విడుదల తేదీ
ఫిబ్రవరి 26, 2016
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాశం

మార్చు

హైదరాబాద్‌లో జరిగే అనేక కార్యక్రమాలకు పూలు సరఫరా చేసే వ్యాపారం చేస్తున్న బాలు (వెన్నెల కిషోర్), చెప్పిన టైమ్‌కి రాకపోయినా, చెప్పిన పని చేయకపోయినా విచిత్రమైన కండిషన్లతో ఇబ్బంది పెట్టే రఘుబాబు కూతురిని ప్రేమిస్తాడు. ఈ క్రమంలోనే రఘుబాబు కండిషన్‌కు కట్టుబడి ఉండేందుకు వెన్నెల కిషోర్, వినాయకుడిని కూడా లెక్కచేయకూడని పరిస్థితి వస్తుంది. దీంతో వినాయకుడి వాహనమైన ఎలుక అతడిని ఎలాగైనా శిక్షించాలని ఓ ఎలుక (బ్రహ్మానందం)ను అతడుండే ప్రదేశానికి పంపిస్తుంది.

కండిషన్స్ పెట్టే మామతోనే తట్టుకోవడం కష్టమనే పరిస్థితుల్లో వెన్నెల కిషోర్, ఈ ఎలుక పెట్టే ఇబ్బందులను కూడా ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పరిస్థితులన్నీ అతడి కాపురంలో ఎలాంటి మార్పులు తెచ్చాయి? చివరకు వీటన్నింటినీ వెన్నెల కిషోర్ ఎలా ఎదుర్కొని బయటపడ్డాడు? అన్నది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ, దర్శకత్వం: రేలంగి నరసింహారావు
  • నిర్మాత: మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు
  • చిత్రానువాదం: దివాకర్ బాబు, గంగోత్రి విశ్వనాథ్
  • ఆధారం: ఇలాపావులూరి మురళీమోహన్ రావు రాసిన ఎలుకా వచ్చే ఇల్లు భధ్రం
  • సంగీతం: బల్లెపల్లి మోహన్
  • ఛాయాగ్రహణం: నాగేంద్ర కుమార్

నిర్మాణం

మార్చు

ఇలాపావులూరి మురళీమోహన్ రావు రాసిన ఎలుకా వచ్చే ఇల్లు భధ్రం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[2] దీనికి సంబంధించిన చిత్రానువాదంను దివాకర్ బాబు రాశాడు.

నిర్మాతలు మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, నటి పావనికి ఇది తొలి చిత్రం. ఈ చిత్రంలో దాదాపు నలభై నిమిషాలపాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. దర్శకుడు నరసింహారావు కంప్యూటర్ గ్రాఫిక్స్ తో పనిచేసిన మొదటి చిత్రం కావడంతో అమ్మోరు, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి వంటి సినిమాల్లోని గ్రాఫిక్స్ సృష్టించిన దర్శకుడు కోడి రామకృష్ణ సలహా తీసుకున్నారు.[3]

నాగేంద్ర కుమార్ గతంలో రేలంగి దర్శకత్వం వహించిన 16 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.[4] తొలిసారిగా ఈ చిత్రానికి సంగీతం అందించిన బల్లెపల్లి మోహన్, గతంలో వందేమాతరం శ్రీనివాస్ కు సహాయకుడిగా పనిచేశాడు.[1] సగిలి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అందించాడు.[1]

పాటలు

మార్చు

2015, నవంబరు 7న పాటల అవిష్కరణ జరిగింది. సినీ దర్శకుడు దాసరి నారాయణరావు పాటలను ఆవిష్కరించి, తొలి సీడీని రాజేంద్రప్రసాద్‌కు అందించాడు. ఈ కార్యక్రమంలో నటులు గిరిబాబు, విజయ నరేష్, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[5]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "శ్లోకం"  హని  
2. "ఎలుకా మజాకా"  సింహ  
3. "గల్ గల నువ్వే"  అంజనా సౌమ్య, సాయి చరణ్  
4. "మస్తున్నది"  శ్రావణ భార్గవి  

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Yeluka Majaka Audio Released Archived 2019-12-27 at the Wayback Machine, Ragalahari
  2. Eluka Majaka in Re-recording Archived 2016-03-04 at the Wayback Machine, Myfirstshow.com
  3. The Hindu, Metro Plus (31 August 2015). "The mouse game". The Hindu (in Indian English). Y. Sunita Chowdhary. Retrieved 27 December 2019.
  4. Camera Angles, Twitter
  5. సాక్షి, సినిమా (8 November 2015). "ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ రేలంగి". Sakshi. Archived from the original on 26 డిసెంబరు 2019. Retrieved 26 December 2019.

ఇతర లంకెలు

మార్చు