ఎవరిని నమ్మాలి
ఎవరిని నమ్మాలి 1970, అక్టోబర్ 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ లక్ష్మణ్ గోరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హరనాధ్, రాజశ్రీ నటించారు.
ఎవరిని నమ్మాలి (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | లక్ష్మణ్ గోరే |
---|---|
తారాగణం | హరనాధ్, రాజశ్రీ |
నిర్మాణ సంస్థ | నటరాజన్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చులక్షాధికారి, వ్యాపారస్థుడు అయిన వెంకటపతి ఇంట్లో జయశ్రీ అనే అందాలభరిణ దిక్కులేని స్థితిలో రాత్రివేళ తలదాచుకుంటుంది. మరునాడు ఆయన ఆఫీసులోనే ఉద్యోగం కూడా సంపాదించుకుంటుంది. వెంకటపతికి జయశ్రీపై నమ్మకం కుదిరి బాధ్యతగల పనులు అప్పజెప్పుతుంటాడు. హైదరాబాదులో వున్న వాటాదారులలో ఒకరికి 25 వేలు, మరొకరికి 25వేలు బ్లాక్ మనీ భద్రంగా ఇమ్మని ఆమెను బస్సు ఎక్కిస్తాడు. బస్సుబయలుదేరుతుంది. దారిలో ఒక వూరి వద్ద ఆగినప్పుడు ఆమె చేతిలో వున్న బ్యాగ్ మారిపోయింది. అదే మోస్తరు బ్యాగు ఆ స్థానంలో చేరింది. దొంగ పట్టుబడ్డాడు. ఆ రెండు కట్టలలో ఒకటి దొంగనోట్ల కట్ట. పోలీసు అధికారులు ఆ సంగతిని గుర్తించారు. ఆమె బ్యాగును ఆమెకు భద్రంగా అప్పగిస్తారు. దారి పొడవునా శాస్త్రులు, అతని సహచరుడు అందరికీ వినోదకాలక్షేపం గావిస్తారు. హైదరాబాదులో జయశ్రీ దిగుతుంది. వెళ్లాల్సిన చోటుకు చేరుతుంది. కాని అక్కడ తన యజమానిచే బంధించబడుతుంది. ఆమెను అడుగడుగునా కాపాడుతూ వస్తారు శాస్త్రులు, అతని మిత్రుడు. వెంకటపతి కుమారుడు గిరి కూడా వచ్చి ఆమెకు సహాయపడతాడు. చివరకు నేరస్థులు పట్టుబడక తప్పలేదు. శాస్త్రులు, అతని స్నేహితుడు ఎవరు? అసలు జయశ్రీ ఎవరు? ఈ సస్పెన్స్ కథ చివరిదాకా కొనసాగుతుంది.[1]
నటవర్గం
మార్చు- హరనాధ్ - శాస్త్రులు
- రాజశ్రీ - జయశ్రీ
- పద్మనాభం - శాస్త్రులు స్నేహితుడు
- అల్లు రామలింగయ్య
- చంద్రబాబు - బస్సు డ్రైవర్
- రామకృష్ణ
- ముక్కామల - వెంకటపతి
- వల్లం నరసింహారావు - మేనేజరు
- పుష్పకుమారి - వెంకటపతి భార్య
- అర్జా జనార్ధనరావు - పోలీసు అధికారి
- ప్రభాకర్‌రెడ్డి - బ్యాగ్ దొంగ
- ఆనందమోహన్ - బలరాంరెడ్డి, వెంకటపతి వ్యాపార భాగస్వామి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: లక్ష్మణ్ గోరే
- సంగీతం: కె.వి.మహదేవన్
- నిర్మాణ సంస్థ: నటరాజన్ పిక్చర్స్
- నిర్మాత: ఎన్.ముత్తయ్య చెట్టియార్
మూలాలు
మార్చు- ↑ డి.కె.ఎం (10 October 1970). "చలనచిత్రసమీక్షలు ఎవరిని నమ్మాలి?". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 57, సంచిక 192. Retrieved 22 December 2017.[permanent dead link]