అర్జా జనార్ధనరావు

హనుమంతుని పాత్రకు పేరొందిన నటుడు

అర్జా జనార్ధనరావు (డిసెంబర్ 21, 1926 - నవంబర్ 4, 2007) ప్రసిద్ధ తెలుగు నాటక, సినిమా నటుడు. ఇతడు ఎక్కువగా పౌరాణిక చిత్రాలలో హనుమంతుడు వేషంతో మంచిపేరు సంపాదించుకున్నాడు. హనుమ అనగానే గుర్తువచ్చే విదంగా ఆయన నటన ఉండేది.

అర్జా జనార్ధన రావు
జననం(1926-12-21)1926 డిసెంబరు 21
కాకినాడ
మరణం2007 నవంబరు 4(2007-11-04) (వయసు 80)
విద్యబి. ఎ, బి. ఎస్. సి
వృత్తినటుడు, ఆడియో ఇంజనీరు

జీవిత విశేషాలు సవరించు

ఇతని స్వస్థలం కాకినాడ. అక్కడే బి.ఎ., బి.ఎస్.సి చదువుకున్నాడు. చదువుకొనే సమయంలోనే ఇతనికి నాటకరంగంలో కొంత అనుభవం కలిగింది. ఇతనికి చిన్నతనం నుండి ఆటలమీద, కసరత్తులు చేయడం మీద ఉత్సాహం ఉండేది. ఆ ఉత్సాహమే ఇతడిని మిస్టర్ ఆసియా, మిస్టర్ హెర్క్యులస్ (1954), మిస్టర్ ఇండియా (1955)గా ఎన్నిక చేసింది. ఇతడు శబ్దగ్రహణ శాఖలో డిప్లొమా చదివి కొన్నాళ్ళు శ్యామలా స్టుడియోలో రికార్డిస్ట్‌గా పనిచేశాడు.

నటించిన సినిమాలు సవరించు

బయటి లింకులు సవరించు