ఎస్. నిజలింగప్ప
సిద్దవనహళ్లి నిజలింగప్ప (1902 డిసెంబరు 10- 2000 ఆగష్టు 8) ఒక భారతీయ స్వాతంత్ర్యకార్యకర్త, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు, న్యాయవాది.1956,1958 మధ్య కర్ణాటక (అప్పటి మైసూర్ రాష్ట్రం) ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పనిచేశాడు.1968లో అతను కర్ణాటక రాష్ట్ర 4 వ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. అతను భారత స్వాతంత్ర్యోద్యమంలోనే కాకుండా కర్ణాటక ఏకీకరణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర వహించాడు.
ఎస్. నిజలింగప్ప | |
---|---|
4 వ మైసూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |
In office 1962 జూన్ 21 – 1968 మే 29 | |
గవర్నర్ | జయచామరాజేంద్ర వడియార్ ఎస్. ఎమ్. శ్రీనాగేష్ వి. వి. గిరి గోపాల్ స్వరూప్ పాఠక్ |
అంతకు ముందు వారు | ఎస్. అర్. కాంతి |
తరువాత వారు | వీరేంధ్ర పాటిల్ |
In office 1956 నవంబరు 1 – 1958 మే 16 | |
గవర్నర్ | జయచామరాజేంద్ర వడియార్ |
అంతకు ముందు వారు | కడిదాల్ మంజప్ప |
తరువాత వారు | బి.డి. జెట్టి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | హాలువగలు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | 1902 డిసెంబరు 10
మరణం | 2000 ఆగస్టు 8 చిత్రదుర్గ, కర్ణాటక, భారతదేశం | (వయసు 97)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
కళాశాల | సెంట్రల్ కాలేజ్ ఆఫ్ బెంగళూరు, ఐఎల్ఎస్ లా కళాశాల |
ప్రారంభ జీవితం, విద్య
మార్చునిజలింగప్ప1902 డిసెంబరు10 న కర్ణాటక రాష్ట్రం, బళ్లారిలోని హలవగలులో అనే చిన్నగ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు.[1] అది అప్పుడు బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది. అతని తండ్రి ఒక చిన్నవ్యాపారవేత్త. నిజలింగప్ప ఐదుసంవత్సరాల వయస్సులో అతని తండ్రి మరణించాడు. అతని తల్లి గృహిణి.వారిది లింగాయత్ హిందువులు చెందిన కుటుంబం. నిజలింగప్ప తల్లి శివ భక్తురాలిగా గుర్తించబడింది.[1] పూర్వం "తండ్రి పూర్వీకులందరూ గొప్ప ధనవంతులు" అని నిజలింగప్ప తర్వాత తెలిసింది. వారందరూ "జూదం, మద్యపానం, స్త్రీలపై తమ సంపదను వెదజల్లారు. అతని తల్లి తండ్రి తన తల్లిదండ్రులకు సహాయం చేసాడు.కానీ అతని కుటుంబం ఇంకా చాలా పేదరికంగా ఉన్నారని గమనించాడు.
అతను దావణగెరెలో పెరిగాడు. చిన్నతనంలో పెద్ద ఉపాధ్యాయుడుగా పేరొందిన వీరప్ప అనే మాష్టరు అతనికి సంప్రదాయ విద్యను అందించాడు. అతను దావణగెరెలో ఒక అధికారిక పశ్చిమ ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత1919లో చిత్రదుర్గలోని మాధ్యమిక పాఠశాలలో చేరాడు. అనీ బీసెంట్ రాజకీయ రచనలను చదివిన తర్వాత, అతను రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు.[2] 1924లో బెంగళూరులోని సెంట్రల్ కాలేజీ నుండి ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు.1926లో పూణే లా కళాశాల నుండి న్యాయవాది పట్టా అందుకున్నాడు.[1]అందువలన, భారతీయ స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక ఇతర నాయకులవలె, అతను భారతీయ సాంప్రదాయ-శైలి, పాశ్చాత్య-శైలి విద్య రెండింటి మిశ్రమాన్ని ఆకలింపు చేసుకున్నాడు.మహాత్మా గాంధీ, రాజేంద్ర ప్రసాద్ సిద్ధాంతాల ద్వారా ప్రభావితమయ్యాడు. తన స్వస్థలమైన కర్ణాటకలో స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించాడు.
రాజకీయ జీవితం
మార్చునిజలింగప్ప కాంగ్రెస్ సభలకు ప్రేక్షకుడిగా హాజరయ్యేవాడు.1936లో అతను ఎన్.ఎస్. హార్దికర్‌తో పరిచయం ఏర్పడింది.అప్పటినుండి అతను సంస్థపై చురుకైన ఆసక్తి చూపడం ప్రారంభించాడు. నిజలింగప్ప మొదట చురుకైన స్వచ్చంద సేవకుడుగా పనిచేశాడు. ఆ తరువాత మొదట మైసూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.1968లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎదిగాడు.1946 నుండి 1950 వరకు చారిత్రాత్మక భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడుగా ఉన్నాడు.1952లోఅతను చిత్రదుర్గ నియోజకవర్గం, మైసూర్ రాష్ట్రం) నుండి మొదటి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
కర్ణాటక ఏకీకరణకు నిజలింగప్ప చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఏకీకృత రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యాడు. తర్వాత మళ్లీ రెండోసారి అతను అదేపదవికి ఎన్నికయ్యాడు. అతను 1968 ఏప్రిల్ వరకు ఆపదవిలో కొనసాగాడు.అతన్ని "మేకర్ ఆఫ్ మోడరన్ కర్ణాటక" అని అంటారు. వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక, రవాణా వంటి ప్రాజెక్టుల అభివృద్ధికి రాష్ట్రం అతనికిచాలా రుణపడి ఉంది.[3]
1967 ఎన్నికల్లో దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేసినసమయంలో, అతను కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.1968,1969లలో వరుసగా హైదరాబాద్, ఫరీదాబాద్‌లో జరిగిన రెండు కాంగ్రెస్ సెషన్‌లు సమర్థవంతంగా నిర్వహించాడు. అతని అలుపెరగని ప్రయత్నాల కారణంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఉత్తేజితమైంది. అయితే పార్టీలోని వివిధ వర్గాల మధ్య కక్షలకారణంగా వైరం పెరిగి చివరకు 1969లో పార్టీ చారిత్రాత్మక చీలికకు దారితీసింది.[4] [5] అతను అవిభక్త భారత జాతీయ కాంగ్రెస్‌కు చివరి అధ్యక్షుడు. ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చే కాంగ్రెస్ (ఆర్), కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) నిజలింగప్ప, నీలం సంజీవ రెడ్డి, కామరాజ్, మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్ నాయకులతో కూడిన సిండికేట్ కాంగ్రెస్‌గా విడిపోవడాన్ని చూడవలసి వచ్చింది.[6]
కాంగ్రెస్ చీలిన తర్వాత, నిజలింగప్ప క్రమంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. క్రియాశీల రాజకీయాలను విడిచిపెట్టిన తరువాత, అతను సర్దార్ వల్లభాయ్ పటేల్ సొసైటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. అతని పదవీ విరమణ తర్వాత కూడా విస్తృతంగా గౌరవించబడ్డాడు.సరళత, చిత్తశుద్ధికి ప్రసిద్ధి చెందాడు.[7] అతను 97 సంవత్సరాల వయసులో 2000 ఆగస్టు 9న చిత్రదుర్గలోని తననివాసంలో మరణించాడు.[8]
భారతదేశంలోని టిబెటన్ సమాజం అతడిని ప్రేమగా గుర్తుంచుకుంటుంది.కర్ణాటక ముఖ్యమంత్రిగా అతను టిబెటన్ శరణార్థులకు పునరావాసం కోసం భూమిని ఇచ్చాడు. కర్ణాటక నేడు అతిపెద్ద టిబెట్ స్థావరాల ప్రవాసంలో అత్యధిక జనాభా కలిగి ఉంది. బైలకుప్పే, ముండ్‌గోడ్, కొల్లెగల్,గురుపుర (బైలకుప్పే సమీపంలో) కర్ణాటకలోని నాలుగు టిబెటన్ స్థావరాలు కలిగి ఉన్నాయి.[9]
స్మారక విగ్రహం
మార్చుసిబారా సమీపంలోని చిత్రదుర్గ శివార్లలో జాతీయ రహదారి పక్కన నిర్మించిన నిజలింగప్ప స్మారక చిహ్నాన్ని టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా 2011 జనవరి 29న న ప్రారంభించాడు.[10] అదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప బెల్గాంలోని చక్కెర పరిశోధన సంస్థకు నిజలింగప్ప పేరు పెడతానని ప్రకటించారు [11]
నిర్వహంచిన పదవులు
మార్చురాజకీయ కార్యకలాపాల కారణంగా 1940 వరకు అతను న్యాయవాదిగా ఉన్నాడు. అతను ముప్పై సంవత్సరాల పాటు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు.1936 నుండి 1940 వరకు చిటల్‌డ్రూగ్ డిసిసి అధ్యక్షుడుగా చేసాడు. అతను 1937-38 మైసూర్ శాసన మండలి సభ్యుడుగా, 1938 నుండి 1950 వరకు మైసూర్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా పనిచేసాడు.1942 నుండి 45 వరకు మైసూర్ పిసిసి ప్రధాన కార్యదర్శిగా,1945-46లో మైసూర్ పిసిసి, ప్రెసిడెంట్ గా పనిచేసాడు.1946 కర్ణాటక పిసిసి అధ్యక్షుడుగా, 1948-50 భారత రాజ్యాంగ సభ, తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడు, మైసూర్ రాజ్యాంగ పరిషత్, అధ్యక్షుడుగా చేసాడు. 1949 నుండి గోపాల్ రావు విచారణ కమిటీ సభ్యుడుగా, మైసూర్ ప్రభుత్వ పరిశ్రమ వికేంద్రీకరణ, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఉత్పత్తి, ఏర్పాటు కోసం న్యాయవాదిగా వ్యవహరించాడు.సహకార సంఘాల పనిని పరిశీలించడానికి ప్రణాళికా సంఘం నియమించినసంఘంలో నిజలింగప్ప కమిటీ సభ్యుడు. ఫౌండేషన్ ఫలితంగా సహకార సంఘాలను ఒకే కుటుంబ సభ్యుడు వేరు వేరు పేర్లతో ఏర్పాటు చేయటం, చట్టాలను నుండి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా నిరోధించబడింది.
అసక్తులు, మరణం
మార్చుఅతనికి గ్రామాభివృద్ధి, హరిజన ఉద్ధరణ, స్పిన్నింగ్, సాహిత్యంపై ప్రత్యేక ఆసక్తి.అతను తన నివాసంలో 97 సంవత్సరాల వయసులో 2000 ఆగస్టు 9 న మరణించాడు.[12]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "FACTIONS AND POLITICAL LEADERS" (PDF). p. 193. Retrieved 11 March 2018.
- ↑ Riti, M. D. "A politician who rose above politics". Rediff.com. Retrieved 11 March 2018.
- ↑ "NIJALINGAPPA – ARCHITECT OF KARNATAKA" (PDF). presidentvenkatraman.in. Archived from the original (PDF) on 2016-03-03. Retrieved 2021-09-23.
- ↑ Singh, Mahendra Prasad (1981). Split in a Predominant Party: The Indian National Congress in 1969. ISBN 9788170171409.
- ↑ "From the Archives (November 13, 1969): Prime Minister expelled from Congress". The Hindu. 2019-11-13. ISSN 0971-751X. Retrieved 2020-07-04.
- ↑ "Split in the Congress". Indiansaga.
- ↑ "Wearing simplicity on the sleeve". Deccan Herald. 6 November 2012.
- ↑ "Nijalingappa dead". The Hindu. 9 August 2000. Archived from the original on 25 January 2013.
- ↑ "His Holiness the Dalai Lama Remembers Former Chief Minister Nijalingappa". Central Tibetan Administration. January 31, 2011. Archived from the original on 2013-03-21.
- ↑ "S. Nijalingappa memorial to be dedicated to the nation today". The Hindu. 29 January 2011. Archived from the original on 4 February 2011.
- ↑ "Sugar institute named after Nijalingappa". The Hindu. 28 August 2010.
- ↑ "S. Nijalingappa - Karnataka's Architect". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-05-06. Retrieved 2021-09-23.