ఏలకుల నూనె ఒక ఆవశ్యక నూనె.ఒక సుగంధ తైలం. ఏలకులనూనె ఔషధ గుణాలు కల్గి ఉంది.ఏలకులను ఆహారంలో మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. ఏలకులను ఆంగ్లంలో కార్డమమ్ అంటారు.ఏలకుల మొక్క వృక్షశాస్త్రంలో జింజీబెరేసియా కుంటుంబానికి చెందిన మొక్క.[1]

ఏలకులు
Elettaria cardamomum.jpg
True Cardamom (Elettaria cardamomum)
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
ప్రజాతులు

Amomum
Elettaria

ఏలకులు
ఏలకుల పూవు

ఏలకుల మొక్కసవరించు

ఏలకుల మొక్క బహువార్ధిక చెట్టు.ఇండియా శ్రీలంక ఎక్కువ సాగు చేస్తారు.చెట్టు నాలుగు మీటర్ల (13 అడుగులు) ఎత్తువరకు పెరుగును.ఆకులు వెడల్పుగా పొడవుగా వుండి, ఆకు చివర కోసుగా ఈటె వలె వుండును, ఏలకుల మొక్క వృక్షశాస్త్రంలో జింజీబెరేసియా కుంటుంబానికి చెందిన మొక్క. మొక్క వృక్షశాస్త్ర పేరు ఎలెట్తరియా కార్డోమొమమ్ (Elettaria cardomomum ).చిన్న పసుపు రంగు పూలను కల్గి వుండును. సాగిన ఆండాకారపు పండు/కాయ లోపల విత్తనాలు వుండును.కాయ పసుపు ఆకుపచ్చని వెలుపలలి తొక్కను కల్గి ముడు ముఖాలు/పార్శాలు కల్గి వుండును.[1]

ఏలకులు పురాతన కాలం నుండివినియోగంలో ఉన్నాయి.ఈజిప్టులు ఎలక్కులను సుగంధ ద్రవ్యాలలోవాడేవారు, అలాగే పళ్లను తెల్లగా వుడుటకై, ఏలక్కులను నమిలేవారు.అలాగే ధూపముగా వాడేవారు. అరబ్భులు ఎలక్కులపొడిని కాపీ తేనీరులో వాడుతారు.ఆసియాలో వంటల్లో ఎలక్కులు ముఖ్యమైన మాసాల దినుసు.ఇండియాల్లో మాంసాహార వంటల్లో, తీపి వంటకాల్లో ఎలక్కులను ఉపయోగిస్తారు.వేలేరియస్ కోర్డస్ అనే అతను మొదటగా 1544లో ఏలకుల ఆవశ్యకంనూనెను ఉత్పత్తి చేసాడు.[1][2]

పళ్ళు చేదుగా వున్న ఆహార యోగ్యం. ఏలకులను ప్రపంచంలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే సాగు చేస్తున్నారు.శ్రీలంక, లావోస్, నేపాల్, గౌటమాల,, ఇండియా.ఏలకుల విత్తనాలలో సల్ఫర్, కాల్సియమ్, ఫాస్పర్ ఖనిజాలు ఉన్నాయి. విత్తనాలలో 5% వరకు వోలటైల్ నూనెలు/ఆవశ్యక నూనెలు ఉన్నాయి. నూనె లేత లేదా పాలిపోయిన పసుపు రంగులోవుండును.[2].

నూనె సంగ్రహణంసవరించు

ఏలకుల గింజల నుండి అవశ్యక నూనెను ఆవిరి స్వేదన క్రియ/స్టీము డిస్టిలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు, పక్వానికి వచ్చి, దోరగా పండక ముందే కాయలను సేకరిస్తారు.విత్తనాల నుండి నూనె దిగుబడి శాతం 5% వరకు వుండును.[1]

నీటి ఆవిరి సంగ్రహణ పద్ధతి ప్రధాన వ్యాసం: ఆవశ్యక నూనెల ఉత్పత్తి- నీటి ఆవిరి ద్వారా స్వేదనక్రియ చదవండి.

నూనెసవరించు

నూనె లేత పసుపు రంగులో వుండు పారదర్శక నూనె. నీటి వలె స్నిగ్థత కల్గి వుండును. సువాసన కలిగిన నూనె.

నూనెలోని రసాయన పదార్థాలు/సమ్మేళనాలుసవరించు

ఏలకుల ఆవశ్యక నూనెల్లోని కొన్ని ముఖ్య రసాయన సమ్మేళనాలు:ఆల్ఫా పైనేన్, బీటా పైనేన్, సబినెన్, మైర్సేన్, ఆల్ఫా పేలాన్డ్రెన్, లిమోనేన్, 1,8-సినేయోల్, y-టెర్పేనైన్, p- సైమెన్, టెర్పినోలేన్, లినలూల్, లినలైల్ ఆసిటేట్, టెర్పినేన్-4- ఆయిల్, ఆల్ఫా టేర్పీనియోల్ ఆసిటేట్, సిట్రోనెల్లోల్, నేరోల్, జెరానియోల్, మిథైల్ యూజెనోల్, ట్రాన్స్-నేరోలిడోల్.[1]

నూనెలోని రసాయన పదార్థాలు/సమ్మేళనాల పట్టిక[3]

వరుస సంఖ్య రసాయన సమ్మేలనం శాతం
1 1,8-సినేల్ 36.3
2 సిట్రోనెల్లోల్ 0.3
3 జెరానియోల్ 0.5
4 లిమోనెన్ 11.6
5 లినలూల్ 3.0
6 లినలైల్ అసిటేట్ 2.5
7 మిథైల్ యోజెనోల్ 0.25
8 మైర్సేన్ 1.6
9 నేరోల్ 0.5
10 సబినేన్ 2.8
11 టెర్పినేన్-4-ఒల్ 0.9
12 ట్రాన్స్- నేరోలిడోన్ 2.7
13 ఆల్ఫా-పెల్లాన్ డ్రోన్ 0.2
14 ఆల్ఫా-పైనేన్ 1.5
15 ఆల్ఫా-టెర్పి నియోల్ 2.7
16 ఆల్ఫా-తెర్పినైల్ ఆసిటెట్ 31.6
17 బీటా పైనేన్ 0.2
18 γ-టేర్పినోలేన్ 0.5

నూనె ఔషధ గుణాలుసవరించు

ఏలకుల నూనె యాంటి సెప్టిక్ (కుళ్లిపోకుండ నిలువరించు), శూలరోగమును పోగొట్టే, వాతహరము, జీర్ణకారి, శిరోరోగములకు మందుగా, మూత్రవర్ధకమైన మందుగా, కఫాన్ని హరించే మందు,, ఉద్దీపకంగా, ఔషధ గుణాలను క్లగి ఉంది.[1].వర్తమాన కాలంలో ఏలకుల నూనెను కండరాల, శ్వాసకోశ నొప్పులను రుగ్మతలను తగ్గించుటకు వాడుతున్నారు.కోరింత దగ్గు, ఆస్త్మా వంటి వాటికి కూడా ఏలకులనూనె బాగా పనిచేయును.[2]

నూనె ఉపయోగాలుసవరించు

బయటి వీడియోల లింకులుసవరించు

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Cardamom essential oil". essentialoils.co.za. Archived from the original on 2018-02-27. Retrieved 09-09-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 2.2 "how cardamom oil work for you". articles.mercola.com. Archived from the original on 2018-09-07. Retrieved 09-09-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)CS1 maint: bot: original URL status unknown (link)
  3. "THE BENEFITS AND PROPERTIES OF CARDAMOM ESSENTIAL OIL". theresaneoforthat.com. Archived from the original on 2018-09-09. Retrieved 09-09-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)CS1 maint: bot: original URL status unknown (link)