ఐ.వి.యస్. అచ్యుతవల్లి
ఇరంగంటి వెంకట శేష అచ్యుతవల్లి 1943 మే 1 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, దొంతవరంలో జన్మించింది. తల్లి అంజమ్మ, తండ్రి వెంకటగోవిందాచార్యులు. పుట్టిన ఊరిలో పాఠశాల లేని కారణంగా ఈమె విద్యాభ్యాసం కాకినాడలో మాతామహుల ఇంట్లో కొనసాగింది. పిఠాపురం రాజా హైస్కూల్లోను, కాకినాడ కళాశాలలోను విద్యనభ్యసించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి.ఎ. పట్టాపొందింది. దక్షిణభారత హిందీ ప్రచారసభ నిర్వహించే పరీక్షలలో విశారద ఉత్తీర్ణత పొందింది. సంస్కృతంలో దక్షిణ భాషా ప్రచారం వారి సమర్థ విశారద పాస్ (బి.ఎ.) అయ్యింది. కర్ణాటక గాత్ర సంగీతంలో డిప్లమో చేసింది. ఆకాశవాణిలో 1960-62 ప్రాంతాలలో బి.గ్రేడు కళాకారిణిగా లలితగీతాలు పాడింది. ఈమెకు 1964లో తన 21 యేట వివాహం జరిగింది. భర్త ఉద్యోగరీత్యా కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో నివసించి చివరకు పెంటపాడులో స్థిరపడింది. 2010లో మరణించింది.
ఐ.వి.యస్.అచ్యుతవల్లి | |
---|---|
జననం | ఐ.వి.యస్.అచ్యుతవల్లి 1949 మే 1 దొంతవరం గ్రామం,ఉంగుటూరు మండలం, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం |
ప్రసిద్ధి | కథా రచయిత్రి, నవలా రచయిత్రి, కాలమిస్ట్ |
మతం | హిందూ (శ్రీ వైష్ణవ) |
భార్య / భర్త | రాఘవాచారి |
తండ్రి | వెంకట గోవిందాచార్యులు |
తల్లి | అంజమ్మ |
రచనలు
మార్చుఈమె 8 కథాసంకలనాలు, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది. మొదటి రచన ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రమదావనం శీర్షికలో ప్రచురింపబడిన ఇంటి శుభ్రత అనే వ్యాసం. 1958లో జగతి పత్రికలో తొలికథ వంచిత ప్రచురింపబడింది. 1961లో మొట్టమొదటి నవల పుట్టిల్లు ప్రచురితమైనది. వివాహం కాకముందు కె.వి.ఎస్.ఆచ్యుతవల్లి పేరుతోను, రాఘవేంద్ర కలంపేరుతోను రచనలు చేసింది. ఈమె రచనలు పలు భాషలలో తర్జుమా అయ్యాయి. ఇదెక్కడి న్యాయం నవల తెలుగుతో కలిపి 4 భాషలలో సినిమాగా తీయబడింది. జయశ్రీ మాసపత్రికలో ఆజ్ ఔర్ కల్ అనే శీర్షికను, రచన మాసపత్రికలో బాతోఁ మే ఖూనీ అనే శీర్షికను నిర్వహించింది. ఇవి కాకుండా ఎన్నో వ్యాసాలను వ్రాసింది. రేడియో ప్రసంగాలు చేసింది.
నవలలు
మార్చు- ఇదెక్కడిన్యాయం -1977
- ప్రేమగండం -1981
- కొడిగట్టినదీపాలు - 1970
- సీతకలలు - 1978
- పుట్టిల్లు -1961
- ప్రేమించని మనసులు - 1963
- ఎగిరే పిట్టలు - 1964
- మూడు ముళ్ళు -1967
- కోరిక - 1975
- తాకట్టు - 1976
- కానుక - 1976
- ఒడ్డుకు చేరిన ఒంటరి కెరటం - 1979
- తీరం చేరిన కెరటం - 1979
- పూలూ ముళ్ళు - 1979
- నేను దేవిని కాను - 1982
- ఇది మల్లెల వేళ - 1984
- భ్రమరగీతం -1987
- ఏకాంత -1989
- షణ్ముఖప్రియ (గొలుసు నవల - 5గురు రచయితలతో కలసి) -1962
కథాసంపుటాలు
మార్చు- నాగావళి నవ్వింది
- మనస్తత్వాలు
- మూగపోయిన ప్రకృతి
- బాత్ ఏక్ రాత్ కీ
- అచ్యుతవల్లి కథలు
- అవ్యక్తాలు
కథలు
మార్చు- అందని లోతులు
- అక్రూరుడు
- అగ్ని
- అబ్ తరీ
- అభిశంస
- అమ్మంటే అమ్మ
- అయ్యొచ్చేడు!
- అరిటాకు
- అవ్యక్తాలు
- ఆండాళ్ళూ వుల్లిపాయలు
- ఆజ్ ఔర్ కల్
- ఆశ ఖరీదు
- ఇంటిదీపం
- ఇజ్జత్
- ఈతరం అమ్మాయి
- ఉద్యోగస్తుడి భార్య
- ఊసరవెళ్ళి
- ఎందుకోసం
- ఒక్క రోజు
- కథలాంటి జీవితం
- కదలని బాట
- కాలుకదపని అదృష్టం
- కృష్ణసుందరి
- క్రీనీడ
- క్షంతవ్యం
- గట్టునపడ్డ చేప
- చర్విత చరణం
- చిలక- జాంపండు
- జీవితానికోతోడు
- జు ఆ
- తల్లి మనసు
- తస్మాత్ జాగ్రత్త
- దీపకరాగం
- నాగావళి నవ్వింది
- నాతిచరామి
- నిదురలేని దేవుడు
- నిర్ణయం
- నిర్మల
- నీడబారిన మొక్క
- నీలి
- నేరంనాది మాత్రంకాదు
- పగిలిన పలక
- పరిణీత (నాటిక/నాటకం)
- పాపం! ఆడవాళ్లు
- పారిపోని చిలుక
- ప్రయాణం
- ప్రియ
- బాత్ ఏక్ రాత్ కీ
- బెటర్ హాఫ్
- మబ్బువేట
- ముత్యాల చెరువు
- మూగబోయిన ప్రకృతి
- మోతీ
- రాగబంధితు
- వంచిత
- వర్షం వచ్చిన రాత్రి
- వర్షించని మబ్బులు
- విరిసినపువ్వు
- వెన్నెలనీడ
- వెయిట్ ఫర్ ది టైం
- శాంత
- షామియానా
- షోడశ
- సంకల్ప వికల్పాలు
- సందుకాపెట్టె
- సంస్కారి
- సన్నాటా
- సిద్ధి
- సులక్షణ
- స్వయంబద్ధ
పురస్కారాలు
మార్చు- గృహలక్ష్మి స్వర్ణకంకణం - 1970
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అవార్డు (ఉత్తమ కథారచయిత్రి) -1977
- సుశీలా నారాయణరెడ్డి అవార్డు - 1995
- తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం -1994,2000
- వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు
మూలాలు
మార్చు- భూమిక పత్రికలో పి.సత్యవతిగారి వ్యాసం
- కథానిలయంలో అచ్యుతవల్లి కథల జాబితా
- Who's who of Indian Writers Pages 12–13
- ఐ.వి.యస్.అచ్యుతవల్లి నవలసాహిత్యం - సిద్ధాంతగ్రంథం - కె.బి.లక్ష్మి