ఓరుగంటి ధర్మతేజ

ఓరుగంటి ధర్మతేజ ఒక సినీ గేయ రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు.

ఓరుగంటి ధర్మతేజ

జీవిత విశేషాలు మార్చు

అతను కుటుంబం న్యాయవాదులకు సంబంధించినది. అతని తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతని మాతామహులు జడ్జిగా ఉండేవారు. అతని మేనమామలు కూడా హైకోర్టులో ఉద్యోగాలు చేసేవారు. అతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. అందరిలోకి అతనే పెద్దవాడు. అతను నెల్లూరులో విద్యాభ్యాసం చేసాడు. అతని ఇంటికి దగ్గరలో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఉండేది. అతనికి బాల్యం నుండి పాటలు అంటే యిష్టం. అతను బాలసుబ్రహ్మణ్యం పాటలకు ప్రేరణ పొందాడు. అతని తండ్రి పబ్లిక్ ప్రాసిక్యూటరుగా గుంటూరు బదిలీ జరిగిన సందర్భంలో అతను గుంటూరులో డిగ్రీ చేసాడు. అక్కడే బి.ఎల్ పూర్తి చేసాడు. తరువాత నాలుగు సంవత్సరాల పాటు అడ్వకేటుగా ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అతను మెజిస్ట్రేట్ పరీక్ష ఉత్తీర్ణుడైనందున తరువాత అతనికి న్యాయమూర్తిగా కూడా అవకాశాలు వచ్చాయి. ఆ కాలంలో గుంటూరులో తేజ ఆర్కెస్ట్రా ఉండేది. అతను, అతని చెల్లెలు కూడా ఆ ఆర్కెస్ట్రాలో పాడేవారు. వారు 2000 ప్రోగ్రాములకు పైగా చేసారు. ఈ సందర్భంలో గాయకులు రామకృష్ణ, ఎల్.రాజేశ్వరి, జి.ఆనంద్ లతో కూడా సంగీత కార్యక్రమాలలో పాల్గొనేవాడు. అతని కుటుంబానికి సంగీత దర్శకుడు మణిశర్మతో సంబంధాలుండేవి. ఒక పెళ్ళి సందర్భంలో మణిశర్మ అతనిని కలసి సినీరంగంలోకి ఆహ్వానించాడు. అతను 1998-99 లలో మణిశర్మ వద్ద చేరాడు. మణిశర్మ ప్రారంభంలోనే మంచి చిత్రాలైన బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ధర్మతేజ తరువాత చెన్నైలో స్థిరపడ్డాడు. మణిశర్మ వద్ద పనిచేస్తున్నప్పుడు అనేక మంది దర్శకులు, గాయకులు, హీరోలతో పరిచయాలు ఏర్పడ్డాయి. మణిశర్మ వద్ద సంగీతంలో మెళకువలను నేర్చుకున్నాడు.

తరువాత సినిమా పాటలను రాయడంపై దృష్టి పెట్టాడు. సంగీత దర్శకునిగా మణిశర్మ ఏదైనా పాటకు ట్యూన్ కట్టేటప్పుడు, ఆ పాటలో ట్యూన్ కు అనుగుణంగా ఏవైనా పదాలను ఉపయోగించి పాటను తయారుచేసేవాడు. తరువాత సినీ గేయ రచయితలు ఆ ట్యూన్ కు వాస్తవ పాటను రచించి అందించేవారు. తరువాత కొన్ని సినిమాలకు పాటలు కూడా రాసాడు. అతను మొట్టమొదట ఉషాకిరణ్ మూవీస్ వారికి పాడుతా తీయగా సినిమాలో "సరిగమ పదనిస రాగాలే" అనే పాటను రాసాడు.

కొన్ని పాటలు మార్చు

ఇతడు వ్రాసిన కొన్ని పాటల వివరాలు:

క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 పాడుతా తీయగా సరిగమ పదనిస రాగాలే మన వేదాలే మనో
పార్థసారథి
మహేష్ 1998
2 అనగనగా ఓ అమ్మాయి కాకినాడ కాలేజి నీకు గుర్తుందా కత్తిలాంటి పిల్ల సుజాత
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
మణి శర్మ 1999
3 నేనే నువ్వే నేనేనా నేనే నీలో నేనేనా నవ్వుతూ చిత్ర
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
4 ఆజాద్ మణి శర్మ 2000
5 రూపాయి "ట్యాంక్ బండదిగో జేమ్స్ బాండ్ ఇడిగో ఫ్యాషనంటూ కల్చరంటూ మారే ట్రెండిదిగో" శివరామ్, పార్థసారథి, దేవిశ్రీ ప్రసాద్ మణి శర్మ 2001
6 "కంప్యూటర్ కంప్యూటర్ " ఎస్.పి.చరణ్
7 శుభాశీస్సులు "నీ చూపే శృంగారమాయె" చిత్ర, మనో రమణ ఓగేటి 2001
8 "అందం ఆరబోసుకున్న" మనో, స్వర్ణలత
9 "తాతలనాటి కాలం" మనో బృందం
10 "జన్మభూమి ఇది కర్మభూమి" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
11 "స్వాతిచినుకులు" రమణ ఓగేటి, నిత్య సంతోషిణి
12 మేడ్ ఇన్ వైజాగ్ రామ చిలకమ్మ లేత హృదయాన కొత్త ఆలాపన శ్రీకృష్ణ
మాళవిక
అవినాష్
విశ్వజిత్
2012

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు