పాడుతా తీయగా (సినిమా)
పాడుతా తీయగా క్రాంతి కుమార్ దర్శకత్వంలో 1998లో విడుదలైన చిత్రం. ఇందులో వినీత్, హీరా ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు.[1] ఈ చిత్రానికి మహేష్ సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, కె. ఎస్. చిత్ర, పార్థసారధి పాటలు పాడారు.
పాడుతా తీయగా | |
---|---|
దర్శకత్వం | క్రాంతి కుమార్ |
నిర్మాత | రామోజీ రావు |
తారాగణం | వినీత్ , హీరా |
సంగీతం | మహేష్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 28, 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంగీతాన్నే ప్రాణంగా భావించే నలుగురు యువకులు తమను తాము నిరూపించుకోవడం పడే తపన, వాళ్ళ నలుగురికీ ఒక అమ్మాయి ఎలా సహాయం చేసింది అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
తారాగణం
మార్చుసంగీతం
మార్చుఈ చిత్రానికి మహేష్ సంగీత దర్శకత్వం వహించాడు.[2] ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. సంగీతం మయూరి ఆడియో ద్వారా విడుదలైంది. నవతరానికీ అనే పాట మొదట్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆలాపన వినిపిస్తుంది.
- మంగళవాద్యం మదిలో మ్రోగింది (గానం: కె. ఎస్. చిత్ర, పార్ధసారథి)
- నవతరానికి నమస్తే యువత జోరుకి
- పాడుతా తీయగా చలాకి పాట (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
- పాట నాకు నేస్తం (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
- ప్రేమ పుట్టిందో
- సరిగమ పదనిస రాగాలే మన వేదాలే (గానం: మనో, పార్ధసారథి)
- తెల్లవారే వేళ నింగి రంగుల్లో (గానం: మనో)
మూలాలు
మార్చు- ↑ "Padutha Theeyaga (1998)". Indiancine.ma. Retrieved 2020-09-08.
- ↑ "Padutha Theeyaga(1998), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved 2020-09-08.