దేవి శ్రీ ప్రసాద్
దేవీశ్రీ ప్రసాద్ దక్షిణ భారతీయ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. టీనేజ్ లోనే దేవి సినిమాకు సంగీత దర్శకుడిగా మారాడు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో సైమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు.
దేవిశ్రీ ప్రసాద్ | |
---|---|
![]() | |
జననం | ప్రసాద్ 1979 ఆగస్టు 2 |
ఇతర పేర్లు | దేవి |
వృత్తి | సంగీత దర్శకత్వం, గాయకుడు |
తల్లిదండ్రులు |
|
బాల్యంసవరించు
ఆయన తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు రామచంద్రాపురం దగ్గర వెదురుపాక. ఆయన తండ్రి అత్తగారి పేరులోని దేవి, మామ గారైన ప్రసాదరావు పేరులోని ప్రసాద్ తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ అని పేరు పెట్టాడు.[1] దేవిశ్రీ మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. మద్రాసులో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు ముగ్గురు సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.[2]
సంగీతం అందించిన చిత్రాలుసవరించు
పురస్కారాలుసవరించు
- ఫిల్మ్‌ఫేర్ పురస్కారం - వర్షం (2004), నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005), బొమ్మరిల్లు (2006),
- సంతోషం పురస్కారం - జల్సా (2008)
- సినీ-మా పురస్కారం - ఆర్య 2 (2010)
- మా సంగీత పురస్కారం - గబ్బర్ సింగ్ (2012)
- నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు - అత్తారింటికి దారేది (2013)[3][4][5][6]
- సైమా పురస్కారం - పుష్ప: ది రైజ్, మహర్షి, రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్
బయటి లింకులుసవరించు
మూలాలు సవరించు
- ↑ సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి
- ↑ Sakshi (2 August 2021). "దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?". Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.