ఔటర్ రింగు రోడ్డు, వరంగల్
వరంగల్ ఔటర్ రింగు రోడ్డు, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణం చుట్టూ ఉన్న రింగు రోడ్డు. 69-కిలోమీటరు (43 మై.)ల పొడవులో ఈ రింగురోడ్డు ఉంది. ఈ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతీ 20 కి.మీలకు ఒక విశ్రాంతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఔటర్ రింగు రోడ్డు రెండు జాతీయ, 4 రాష్ట్ర రహదారులతోపాటు అనేక దారులను కలుపుతోంది. ఈ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కేంద్రాలు అభివృద్ధి చేయనున్నారు.[1]
ఔటర్ రింగు రోడ్డు, వరంగల్ | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 69 కి.మీ. (43 మై.) |
Existed | 2017 నుండి ప్రస్తుతం–present |
ప్రదేశము | |
States | తెలంగాణ |
చరిత్ర
మార్చుహైదరాబాద్–వరంగల్ దారిలో రాంపూర్ గ్రామంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ధర్మసాగర్, ఉనికిచర్ల, దేవన్నపేట, కోమటిపల్లి, భీమారం, చింతగట్టు, పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి, వంగపహాడ్, ఆరేపల్లి దాకా ఈ రింగురోడ్డు ఉంటుంది. 2017 అక్టోబరు నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి శంకుస్థాపన చేశాడు. 69-కిలోమీటరు (43 మై.) పొడవున్న ఈ రోడ్డును భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ, తెలంగాణ ప్రభుత్వ రోడ్డు భవనాల శాఖలు సంయుక్తంగా నిర్మించాయి. 163వ జాతీయ రహదారి వరకు 29-కిలోమీటరు (18 మై.) నిర్మాణాన్ని ఎన్.హెచ్.ఏ.ఐ. చేపట్టగా, మిగిలిన 40-కిలోమీటరు (25 మై.) తెలంగాణ ప్రభుత్వ శాఖచే నిర్మించబడుతుంది. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం ₹ 7 బిలియన్లు.[2][3][4]
పురోగతి
మార్చు2020 మార్చి నెల నాటికి ఎక్స్‌ప్రెస్‌వే జాతీమ రహదారి బైపాస్ స్ట్రెచ్ నిర్మాణం పూర్తయింది. [5]
ఇతర వివరాలు
మార్చువరంగల్ పట్టణ మాస్టర్ ప్లాన్ 1971లో రూపొందించబడింది కావున నగరం అభివృద్ధి ప్రకారం రేడియల్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, స్ప్లిట్ రోడ్లు, పారిశ్రామిక కాలనీలు, ఉద్యానవనాల కోసం సరికొత్తగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.[6]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ సాక్షి, తెలంగాణ, వరంగల్ (23 October 2017). "వరంగల్‌కు మణిహారం". Sakshi. Archived from the original on 23 October 2017. Retrieved 25 August 2021.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Outer Ring Road, Warangal: Telangana State". The Hindu. Retrieved 25 August 2021.
- ↑ "ORR Warangal Foundation: Telangana State". Deccan Chronicle. Retrieved 25 August 2021.
- ↑ CM KCR to break ground for Warangal ORR, Khazipet RoB on Sunday Telangana Today. Retrieved 25 August 2021.
- ↑ AuthorTelanganaToday. "Telangana govt approves KUDA Master Plan". Telangana Today. Retrieved 25 August 2021.
- ↑ "Construction of outer ring road around Warangal to complete by 2018". Deccan Chronicle. 2017-02-02. Retrieved 25 August 2021.