ఔనన్నా కాదన్నా
ఔనన్నా కాదన్నా 2005 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం.[1] ఇందులో ఉదయ్ కిరణ్, సదా ముఖ్యపాత్రలు పోషించారు.
ఔనన్నా కాదన్నా | |
---|---|
రచన | తేజ (కథ/స్క్రీన్ ప్లే/మాటలు) |
నిర్మాత | అట్లూరి పూర్ణచంద్రరావు |
తారాగణం | ఉదయ్ కిరణ్, సదా |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | ఏప్రిల్ 6, 2005 |
సినిమా నిడివి | 157 నిమిషాలు |
భాష | తెలుగు |
కథ
మార్చులంక గ్రామంలో మంగరాజు ఒక కరుడు గట్టిన జమీందారు. అక్కడి రైతులనుంచి భూములకు బలవంతంగా లాక్కుంటూ ఉంటాడు. రవి అనే యువకుడి తండ్రి దగ్గర నుంచి కూడా అదే విధంగా లాక్కుంటాడు. రవి పక్కనే ఉన్న మరో గ్రామంలో పెరుగుతాడు. పెద్దయ్యాక తమ పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి మళ్ళీ లంక గ్రామానికి వస్తాడు. మంగరాజు పుట్టినరోజు నాడు రవి డప్పు బాగా వాయించి అతన్ని మెప్పిస్తాడు. మంగరాజు అతనికి ఏం బహుమతి కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రవి 20 ఏళ్ళ క్రితం తన తండ్రి నుంచి స్వాధీనం చేసుకున్న పొలాన్ని తిరిగివ్వమంటాడు. అందరిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఐదెకరాల పొలాన్ని రవికిస్తాడు. రవి ఆ పొలాన్ని సాగుచేయడం మొదలుపెడతాడు.
రవి అదే ఊర్లో ఉన్న అరవింద అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తర్వాత ఆమె మంగరాజు మనవరాలని తెలుస్తుంది. అది తెలుసుకున్న మంగరాజు ఆ జంటను ఎలాగైనా విడదీయాలని ప్రయత్నిస్తాడు. చివరకి రవి తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకున్నాడన్నది మిగతా కథ.
తారాగణం
మార్చు- రవి గా ఉదయ్ కిరణ్
- అరవింద గా సదా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సుమన్ శెట్టి
- మంగరాజు గా పిల్ల ప్రసాద్
- సంగీత
- రాళ్ళపల్లి
- దువ్వాసి మోహన్
- రమాప్రభ
- వేణు
- శ్రావ్య
పాటలు
మార్చుఈ చిత్రానికి ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నందించగా కులశేఖర్ పాటలు రాశాడు.[2]
మూలాలు
మార్చు- ↑ జి. వి, రమణ. "ఔనన్నా కాదన్నా చిత్ర సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 24 October 2017.
- ↑ "Aunanna Kadanna Review". nowrunning.com. Archived from the original on 2020-11-29.