కులశేఖర్
కులశేఖర్ ఒక సినీ పాటల రచయిత.[1] సుమారు 100 సినిమాలకు పైగా గీత రచన చేశాడు.[2] ముఖ్యంగా దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ దగ్గర అనేక విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశాడు. చిత్రం, 10 క్లాస్, ఘర్షణ మొదలైనవి అతను పాటలు రాసిన కొన్ని సినిమాలు.
కులశేఖర్ | |
---|---|
జననం | విశాఖపట్నం |
వృత్తి | సినీ గీత రచయిత |
వ్యక్తిగత జీవితం
మార్చుకులశేఖర్ స్వస్థలం సింహాచలం. తండ్రి మహామహోపాధ్యాయ టి.పి. శ్రీరామచంద్రాచార్యులు, తల్లి శ్రీమతి రంగనాయకమ్మ. చిన్నప్పటి నుంచి కులశేఖర్ కు సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉండేది. చదువుకుంటున్న రోజుల్లో పాటలు రాసి బహుమతులు పొందాడు. చదువు తర్వాత ఈటీవీ గ్రూపులో విలేకరిగా పనిచేసాడు.
సినిమా రంగం
మార్చుసిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర శిష్యరికం చేస్తూ సినీ గీతాల రచనలో మెలకువలు తెలుసుకున్నాడు. తర్వాత తేజ దర్శకత్వంలో రామోజీరావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం సినిమాతో గేయ రచయితగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశాడు. తర్వాత ఆర్. పి. పట్నాయక్, తేజ లతో కలిసి అనేక సినిమాలకు పనిచేశాడు.
వివాదాలు
మార్చు2013 అక్టోబరు 24 న కాకినాడలో ఒక శ్రీబాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించినందుకుగాను పోలీసులు అతన్ని అరెస్టుచేసి ఆరునెలలు జైలు శిక్ష విధించారు.[3][4] తర్వాత అతని కేసును విచారించిన పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని తెలియజేశారు. తర్వాత వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు.[1]
హైదరాబాదులో ఉన్న అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం ప్రకారం సుమారు 2008 లో అతను మెదడుకు సంబంధించిన వ్యాధి బారిన పడి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ఆర్. పి. పట్నాయక్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఓమూడు నాలుగు రోజులు వెళ్ళి వస్తాననీ చెప్పాడనీ, అతను ఎక్కడికి వెళుతున్నాడో అతనికే తెలీదని చెప్పాడు. ఇంకా అతని ఎరిగున్న వారు అతని తండ్రి మరణం గురించి అతనికి జ్ఞాపకం ఉండకపోవచ్చని తెలిపారు. హైదరాబాదులో ఉన్న కులశేఖర్ కుటుంబ సభ్యులు కూడా అతని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని ఆప్తమిత్రుడొకరు దక్కన్ క్రానికల్ విలేకరికి తెలియజేశాడు. కులశేఖర్ భార్య ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది.
వైజాగ్ లో అతని సోదరులు ఉన్నా వారు ఇతని గురించి పట్టించుకోలేదు. హైదరాబాదులో కూడా అతనికి అప్పులు ఉన్నాయని అందుకనే అతన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని స్నేహితులు తెలియజేశారు. గీత రచయితగా బిజీగా ఉన్నప్పుడే ప్రేమలేఖ రాశా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా విడుదలకు చాలా ఆలస్యం కావడం వల్ల కూడా అతని మానసికంగా కుంగిపోయాడు.[3]
సినిమాలు
మార్చు- చిత్రం
- జయం
- రామ్మా! చిలకమ్మా (2001)
- ఘర్షణ
- వసంతం
- నువ్వు నేను
- ఔనన్నా కాదన్నా
- మృగరాజు
- సుబ్బు
- దాదాగిరి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "The curious case of Kulasekhar". deccanchronicle.com. దక్కన్ క్రానికల్. Retrieved 24 October 2017.
- ↑ "Telugu Lyricist Kulasekhar Sentenced To 6-Month Jail …". filmibeat.com. ఫిల్మీబీట్. Archived from the original on 29 October 2016. Retrieved 24 October 2017.
- ↑ 3.0 3.1 తెలుగు వెబ్ దునియా. "ఒకప్పుడు సినీగేయ రచయిత ఇప్పుడు మానసిక రోగి". telugu.webdunia.com. Retrieved 24 October 2017.[permanent dead link]
- ↑ "Tollywood Lyric writer Kulasekhar arrested". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 24 October 2017.