కంఠమనేనివారిగూడెం

కంఠమనేనివారిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1] ఈ గ్రామంలో మెరక పంటలు (తోటలు) వ్యవసాయం ప్రధానమైన జీవనోపాధి. కొబ్బరి, బత్తాయి, పామాయిల్, మామిడి, జీడిమామిడి, టేకు వంటి తోటల పెంపకం అధికంగా జరుగుతుంది.

కంఠమనేనివారిగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
కంఠమనేనివారిగూడెం is located in Andhra Pradesh
కంఠమనేనివారిగూడెం
కంఠమనేనివారిగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°48′20″N 81°10′42″E / 16.805617°N 81.178447°E / 16.805617; 81.178447
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం కామవరపుకోట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534449
ఎస్.టి.డి కోడ్

కంఠమనేనివారిగూడెం, గుంటుపల్లె, జీలకర్రగూడెం ఈ మూడు గ్రామాలు దగ్గర దగ్గరలో ఉన్నాయి. ఈ మూడు గ్రామాలలోని బౌద్ధమతం ప్రాంభకాలంనాటి కట్టడాలు బయటపడినాయి. వీటిలో గుంటుపల్లి కొండపైని గుహాలయాలు, స్తూపాలు ప్రసిద్ధి చెందినవి. ఇవి క్రీ.పూ. 3వ శతాబ్ది నుండి సా.శ.2వ శతాబ్దికి చెందినవని భావిస్తున్నారు.కంఠమనేనివారి గూడెంలో ఎదురు బదురుగా ఉన్న రెండు చైత్య గృహాలు బయటపడినాయి. (2007 జూలైలో) ఇవి. సా.శ. రెండవ శతాబ్దిలో మహాయాన బౌద్ధమతాచారాలు వ్రేళ్ళూనుకొంటున్న సమయానికి చెందినవని భావిస్తున్నారు. వీటితోబాటు 1.5 మీటర్లు వ్యాసం గల చిన్న స్తూపం, కొన్ని కొండపెంకులూ కూడా కనుగొనబడ్డాయి. సంవత్సరం క్రితం ఒక ధ్యాన బుద్ధుని విగ్రహంలోని భాగాలు, ఒక చెక్కబడిన స్తంభము కనుగొనబడ్డాయి.ఒకో చైత్య గృహమూ 10.4 మీటర్ల పొడవూ, 5.57 మీటర్ల వెడల్పూ ఉన్నాయి. బహుశా ఒకో ్ృహమూ 12మీటర్ల ఎత్తు కలిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ గృహాలలో ధ్యాన బుద్ధుని ప్రతిమ ఉంచబడింది.[2] కట్టడాలలోని ఇటుకలు సున్నపురాతి 'సిమెంట్'తో అతికించబడినాయి. ఇవి శాతవాహనుల కాలంలో నిర్మించబడి ఉండవచ్చును.

మూలాలు

మార్చు
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
  2. గుంటుపల్లి లోని కట్టడాలలో ఎక్కడా బుద్ధుని ప్రతిమ లేనందున అవి హీనయాన కాలానికి చెందినవనీ, బుద్ధుని ప్రతిమ కలిగిన కంఠమనేనివారి గూడెంలోని కట్టడాలు మహాయాన కాలానికి చెందినవనీ విశ్లేషణ.

వనరులు

మార్చు