కడియాల గోపాలరావు

కడియాల గోపాలరావు కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గుడివాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]

ఇతడు 1912 డిసెంబరు 1 తేదీన కాటూరు గ్రామంలో జన్మించాడు. మచిలీపట్నంలోని హిందు ఉన్నత పాఠశాల లోను తర్వాత అలహాబాద్ లోని టాండన్ విద్యాపీఠంలో విద్యాభ్యాసం చేసాడు. ఇతడు 1943 నుండి ఆంధ్ర ప్రావిన్షియల్ కిసాన్ సభకు అధ్యక్షత వహించాడు. తర్వాత కేంద్ర కిసాన్ కౌన్సిల్ సభ్యునిగా 1944-45 మధ్య తన సేవల్ని అందించాడు. జిల్లా యువజన లీగ్ కు రెండు సంవత్సరాలు అధ్యక్షత వహించి మహిళకు ప్రత్యేక సాంఘిక సేవా విభాగాన్ని ఏర్పాటుచేయడానికి కృషిచేశాడు.

1958లో ఖమ్మం పట్టణంలో జరిగిన ఉమ్మడి కమ్యూనిస్టు రాష్ట్ర మహాసభలో చండ్ర రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగాను సంబంధిత కార్యవర్గంలో కడియాల గోపాలరావును సభ్యునిగా నియమించారు.[2]

మూలాలు మార్చు