కత్తెరశాల మల్లన్న జాతర

కత్తెరశాల మల్లన్న జాతర తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరశాల గ్రామంలో మల్లికార్జునస్వామి జాతర జరుగుతుంది.యాదవుల ఇలవేల్పు కత్తెర శాల మల్లన్న స్వామి.ఈ స్వామి కత్తెర శాల మల్లన్న గా ప్రసిద్ధ చెందాడు.ప్రతి ఏటా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది[1][2][3].

శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి జాతర
శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి స్వామి ఆలయం
శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి స్వామి ఆలయం
శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి జాతర is located in Telangana
శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి జాతర
శ్రీ కత్తెరశాల మల్లన్న స్వామి జాతర
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు :18°30′53″N 78°51′43″E / 18.514772°N 78.861809°E / 18.514772; 78.861809
పేరు
ఇతర పేర్లు:కత్తెరశాల క్షేత్రం
మల్లన్న స్వామి
హరిహర క్షేత్రంగా
ప్రధాన పేరు :కత్తెర శాల మల్లికార్జునస్వామి ఆలయం
దేవనాగరి :कत्तेरसाला मल्लना स्वामी
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మంచిర్యాల జిల్లా, చెన్నూర్ మండలంలోని
ప్రదేశం:కత్తెరశాల
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:కత్తెర శాల మల్లన్న స్వామి
ఉత్సవ దైవం:మల్లన్న స్వామి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :పురాతన హిందూ దేవాల శైలి

చెన్నూర్ మండలంలోని కత్తెరశాల గ్రామంలో వెలసిన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది.ఇచట మల్లికార్జున స్వామి పేరుతో జాతర జరుగుతుంది. మహాశివరాత్రి పండుగ సందర్భంగా మల్లికార్జున స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామికి పూజలు నిర్వహించారు.డిసెంబర్ , జనవరి నెలలో ఇచ్చట మూడు రోజులు పాటు జాతర జరుగుతుంది. జాతర మొదటి రోజు తీయటి పరమాన్నం మల్లన్న దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామి వారి చరిత్ర మహాత్మ్యం గురించి వినిపిస్తారు.భక్తులు స్వామి వారిని దర్శించుకొని పరమాన్నం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

విశేషాలు

మార్చు

ఇది పురాతన హిందూ దేవాలయం.యాదవులు ఇలవేల్పు కత్తెర శాల మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆరాధిస్తారు.ఒగ్గు పూజారులు స్వామి వారి చరిత్ర ను వినిపిస్తారు.

భక్తుల తాకిడి

మార్చు

ఈ కత్తెర శాల మల్లికార్జునస్వామి దర్శించుకోవడానికి భక్తులు కోటిపల్లి,వేమనపల్లి, జైపూర్, మంచిర్యాల, గోదావరిఖని, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కత్తెర శాల మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కలు చెల్లించి జాతరలో పాల్గొంటారు.

మూలాలు

మార్చు
  1. Sanagala, Naveen (2007-11-02). "Sri Mallanna Swamy Temple, Katherasala". HinduPad (in ఇంగ్లీష్). Retrieved 2024-11-01.
  2. "Katterasala Mallanna Temple". templesofindia.org (in ఇంగ్లీష్). Retrieved 2024-11-01.
  3. "Kathersala Village , Chennur Mandal , Adilabad District". www.onefivenine.com. Retrieved 2024-11-01.