కథానాయకురాలు
కథానాయకురాలు 1971లో విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ సరస్వతి చిత్ర పతాకంపై గిడుతూరి సూర్యం, నల్లా వెంకటరావు లు నిర్మించిన ఈ సినిమాకు గిడుతూరి సూర్యం దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎ.ఎ. రాజ్ సంగీతాన్నందించాడు.[1]
కథానాయకురాలు (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | గిడుతూరి సూర్యం |
తారాగణం | శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం, రాజబాబు, పుష్పకుమారి |
సంగీతం | ఏ.ఏ. రాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సరస్వతీ చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- వాణిశ్రీ
- నాగభూషణం
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- పెరుమాళ్ళు
- కాకరాల
- సి.హెచ్. కృష్ణ మూర్తి
- రావు గోపాలరావు
- మోదుకురి సత్యం
- రామ్ మోహన్ (నటుడు)
- ఎస్.ఎస్.లాల్ పి.
- బేబీ బ్రహ్మజీ
- బేబీ గౌరీ
- బేబీ మున్నీ
- మాస్టర్ సురేంద్ర కుమార్
- ఏడిద నాగేశ్వర రావు
- పిజె శర్మ
- రాళ్లబండి కామేశ్వరరావు
- మాస్టర్ రమేష్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: గిడుతూరి సూర్యం
- స్టూడియో: శ్రీ సరస్వతి చిత్ర
- నిర్మాత: గిడుతూరి సూర్యం, నల్లా వెంకట రావు;
- ఛాయాగ్రాహకుడు: ఎస్.ఎస్.లాల్;
- కూర్పు: బి. కందస్వామి;
- స్వరకర్త: ఎ.ఎ. రాజ్;
- గీత రచయిత: శ్రీశ్రీ, ఆరుద్ర, సుంకర సత్యనారాయణ, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, సికరాజు, విజయ రత్నం గోన
- విడుదల తేదీ: మార్చి 25, 1971
- IMDb ID: 7409692
- కథ: గిడుతూరి సూర్యం
- చిత్రానువాదం: గిడుతూరి సూర్యం;
- సంభాషణ: రెంటాల గోపాలకృష్ణ
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, బసవేశ్వర్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్;
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, రాజు-శేషు
- అమ్మ కష్టజీవి గుండెలోన మండువాడే దేవుడు - ఘంటసాల బృందం . రచన: ఏల్చూరి సుబ్రహ్మణ్యం.
- తనువా ఊహూ: హరిచందనమే పలుకా ఊహూ: అది - పి.సుశీల, ఎస్.పి. బాలు
కథ
మార్చుజమిందారుకి ఆరోగ్యం బాగా లేనందువల్ల సత్యారావు(నాగభూషణం)కి పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇస్తాడు. తనకు ఆస్థి ఇవ్వనందుకు జమిందారు తమ్ముడు భుజంగం(రావుగోపాలరావు)పగబట్టి జమిందారును హత్య చేసి అతడి కొడుకు రమేష్ను(రామ్మోహన్) కూడా చంపాలని ప్రయత్నిస్తాడు. నమ్మకస్తుడైన నౌకరు రమేష్ ను రక్షించి దూరంగా తీసికెళతాడు. జానకి(వాణిశ్రీ) తల్లి చనిపోవడం వల్ల, మేనమామ నిరాదరించడం వల్ల ఒక పేద కుటుంబంలో పెరుగుతుంది. ఫాక్టరీ వర్కర్లందరికీ నాయకురాలుగా ఎదుగుతుంది. ఆక్రమంలో సత్యారావు దుర్మార్గాలను ఎదురిస్తుంది. సత్యారావుకు శివయ్య(అల్లూ), ఛాయాదేవి మద్దతు ఇస్తుంటారు. సత్యారావు కొడుకు రఘు(శోభన్ బాబు) జానకిని ఫ్రేమిస్తుంటాడు. జమిందారు అసలు హంతకుడు ఎవరనేది, రమేష్ కు ఆస్తి అప్పచెప్పటం కథ క్లైమాక్సు.
మూలాలు
మార్చు- ↑ "Kathanayakuralu (1971)". Indiancine.ma. Retrieved 2020-08-22.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)