కనుమూరు (పామర్రు)

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, పామర్రు మండలం లోని గ్రామం

కనుమూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్. కోడ్ నం. 521 256., ఎస్టీడీ కోడ్ = 08676.

కనుమూరు
—  రెవిన్యూ గ్రామం  —
కనుమూరు is located in Andhra Pradesh
కనుమూరు
కనుమూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′24″N 80°54′07″E / 16.339888°N 80.902057°E / 16.339888; 80.902057
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,590
 - పురుషులు 1,259
 - స్త్రీలు 1,331
 - గృహాల సంఖ్య 761
పిన్ కోడ్ 521256
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు

దస్త్రం:Yalamanchili Venkatappaya - Copy.jpg
యలమంచిలి వెంకటప్పయ్య :స్వాతంత్ర్య సమర యోధుడు. రచయిత, హింది బాషాప్రచారోద్యమ నాయకుడు హేతువాది.
  • యలమంచిలి వెంకటప్పయ్య :కనుమూరు గ్రామంలో యలమంచిలి అంకప్ప, ఆదెమ్మ దంపతులకు 1898 డిశెంబరు, 30నలో జన్మించాడు. స్వాతంత్ర్య సమర యోధుడు. రచయిత, హింది బాషాప్రచారోద్యమ నాయకుడు హేతువాది.

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపత్నం, తెనాలి

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, పెదపారుపూడి, తోట్లవల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, వుయ్యూరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 40 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలుసవరించు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల 24వ వార్షికోత్సవం, 2016,జనవరి-24న నిర్వహించారు. [2]
  2. సి.బి.ఎస్.సి.పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం 2016,మార్చ్-5న నిర్వహించెదరు. [3]

గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బొప్పూడి మేరీకమల సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:.

శ్రీ అలివేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

  1. శ్రీ యలమంచిలి శివాజీ.
  2. శ్రీ యలమంచిలి శ్రీధర్, చైతన్య విద్యాసంస్థల అధినేత.

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామమునందు యలమంచిలి వంశస్థులు ఎక్కువుగ ఉందురు.

ఈ గ్రామానికి చెందిన శ్రీ కాకర్ల రాజేంద్రప్రసాదు, గతంలో విదేశాలలో ఉండేవారు. తాను జన్మించిన గడ్డను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో, ఆయన తన భార్య శ్రీమతి భూలక్ష్మితో కలిసి గ్రామానికి తరలి వచ్చి, 1999,సెప్టెంబరు-16న కనుమూరు వెల్ఫేర్ కమిటీ (కె.డబ్లు.సి-1) ని స్థాపించి, గ్రామస్థుల సహకారంతో సభ్యులను ఎంచుకొని, పిల్ల ఉచిత వైద్య శిబిరంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారు. వీరు తలపెట్టిన మహత్తర కార్యక్రమాలు సవ్యంగా సాగేందుకు, కొందరు గ్రామస్థులను వాలంటీర్లుగా నియమించుకొని, దాతలు, గ్రామస్థులు, అధికారుల సహకారంతో, నాటినుండి నేటివరకు వెనుదిరిగి చూడకుండా సేవాకార్యక్రమాలు కొనసాగించుచున్నారు. 200 మంది దాతల సహకారంతో, సుమారు 2 కోట్ల రూపాయలతో గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చారు. తన గ్రామంలోనేగాక, సమీపంలోని జమీగొల్వేపల్లి. పమిడిముక్కల మండలానికి చెందిన వేల్పూరు, ముదురాజుపాలెం, హనుమంతపురం గ్రామాలకు గూడా తన సేవలందించుచూ పలువురి మెప్పు పొందుచున్నారు. [2]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,590 - పురుషుల సంఖ్య 1,259 - స్త్రీల సంఖ్య 1,331 - గృహాల సంఖ్య 761

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2716.[3] ఇందులో పురుషుల సంఖ్య 1323, స్త్రీల సంఖ్య 1393, గ్రామంలో నివాసగృహాలు 722 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Kanumuru". Archived from the original on 13 ఫిబ్రవరి 2014. Retrieved 29 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-8; 9వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-3; 2వపేజీ.