ఈ గ్రామం మండల కేంద్రమైన పెదకూరపాడుకు 6 కి.మీ. దూరంలో ఉంది.

కన్నెగండ్ల
—  గ్రామం  —
కన్నెగండ్ల is located in Andhra Pradesh
కన్నెగండ్ల
కన్నెగండ్ల
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°29′00″N 80°16′00″E / 16.4833°N 80.2667°E / 16.4833; 80.2667
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం పెదకూరపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం
పిన్ కోడ్ 522402
ఎస్.టి.డి కోడ్

2001 జనాభా లెక్కల ప్రకారము ఇక్కడి జనాభా 1012.

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

పెదకూరపాడు మండలంసవరించు

పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్‌పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం, రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల, హుసేన్‌నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.

గామానికి సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామానికి దగ్గరలోనే నాగార్ఖున సాగరు కుడి కాలువ ప్రవహిస్తున్నది. కనుక నీటి వసతికి ఇబ్బంది లేదు. పంటలు చాలా బాగా పండుతున్నాయి.

గామంలో ప్రధాన వృత్తులుసవరించు

ఇక్కడ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే.

గ్రామంలో ప్రధానమైన పంటలుసవరించు

మిరప పంట బాగా పండిస్తున్నారు.

గ్రామ విశేషాలుసవరించు

  1. ఈ గ్రామాన్ని, పెదకూరపాడు ఎం.ఎల్.ఎ. శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్, ఆదర్శగ్రామం (స్మాట్ విలేజి) గా తీర్చిదిద్దటానికి దత్తత తీసుకున్నారు.

మూలాలుసవరించు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.