కపటధారి

ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా

కపటధారి, 2021 ఫిబ్రవరి 19న విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా.[1] క్రియేటీవ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానరులో జి. ధనంజయన్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు.[2] ఇందులో సుమంత్, నందిత, నాజర్, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించగా, సైమన్ కె. కింగ్ సంగీతం సమకూర్చాడు.[3] 2019లో కన్నడంలో వచ్చిన కవలుధారి సినిమాకి రీమేక్ ఇది. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ సినిమాకి తమిళంలో కబడధారి అని పేరు పెట్టారు. తెలుగులో సుమంత్ పోషించిన పాత్రను తమిళంలో సిబి సత్యరాజ్ పోషించాడు.( 2020-12-25 )

కపటధారి
కపటధారి సినిమా పోస్టర్
దర్శకత్వంప్రదీప్ కృష్ణమూర్తి
స్క్రీన్ ప్లేహేమంత్ రావు
జి. ధనుంజయన్ (అనుకరణ)
కథహేమంత్ రావు
నిర్మాతజి. ధనుంజయన్
లలిత ధనుంజయన్
తారాగణంసుమంత్
నందిత
నాజర్
జయప్రకాష్
ఛాయాగ్రహణంరసమతి
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంసైమన్ కె. కింగ్
నిర్మాణ
సంస్థ
క్రియేటీవ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీs
19 ఫిబ్రవరి, 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

పాటల జాబితా మార్చు

  • కపటదారి , రచన:: భాష్యశ్రీ , గానం.నిరంజ్ సురేష
  • కలలో కనుపాప, రచన: వనమాలి, గానం. ప్రదీప్ కుమార్
  • హాయకి బేబీ , రచన: వనమాలి, గానం.సానా మోయిడుట్టీ
  • థీమ్ ఆఫ్ కపటదారి , రచన: సిమోన్ కె కింగ్, గానం. సిమోన్ కె కింగ్
  • శబదమే ,

నిర్మాణం మార్చు

తమిళ, తెలుగు భాషల్లో రిమేక్ చేయడం కోసం నిర్మాత జి. ధనంజయన్, 2019 ఏప్రిల్ ప్రారంభంలో కవలుదారి సినిమా రీమేక్ హక్కులను పొందాడు.[4] సినిమాలోని ప్రధాన పాత్రలో నటించడానికి సుమంత్ అంగీకరించాడు. 2019, నవంబరు 1న షూటింగ్ ప్రారంభమైంది. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కూడా ఇందులో నటించాడు.[5] 2019, నవంబరు 18న అక్కినేని నాగార్జున కపటధారి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు.[6][7] 2020, ఫిబ్రవరిలో పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైంది.[8] 2020, మార్చిలో సుమంత్ తన డబ్బింగ్‌ను పూర్తిచేశాడు.[9]

విడుదల మార్చు

2020, మే నెలలో సినిమా విడుదలకావాల్సి ఉండగా,[10][11] కరోనా-19 మహమ్మారి కారణంగా వాయిదా వేయబడింది. 50% ఆక్యుపెన్సీ పరిమితులతో ఆంధ్రప్రదేశ్ అంతటా థియేటర్లు తిరిగి తెరిచిన తరువాత, 2020 డిసెంబరు 25న తమిళ వెర్షన్‌తో పాటు విడుదల చేయాలనుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల వాయిదా పడింది.[12] 2021, ఫిబ్రవరి 19న విడుదలయింది.[1]

స్పందన మార్చు

టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు చెందిన తదగత్ పాతి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చాడు. "ఇది ఒక ఆకర్షణీయమైన థ్రిల్లర్. సూపర్ హీరోకి బదులుగా నేరాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సాధారణ పోలీసుగా గౌతమ్ పాత్ర ఉంది. నాజర్ నటన, సైమన్ కింగ్ సంగీతం బాగున్నాయి. ఇందులో అనవసరమైన అంశాలు లేవు, దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దీనిని మంచి సినిమాగా తీర్చిదిద్దాడు" అని పేర్కొన్నాడు.[13]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "'కపటధారి' విడుదల తేదీ మార్పు.. అల్లరి నరేష్‌పై సుమంత్ సై". Samayam Telugu. Retrieved 2021-02-19.
  2. Vyas (2019-11-18). "Sumanth's New Film's title announced as 'KAPATADHAARI'". www.thehansindia.com. Retrieved 2021-02-19.
  3. "Sumanth-Pradeep Krishnamoorthy's film titled Kapatadhaari - Cinema express". The Times of India. Retrieved 2021-02-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Kavaludaari remake rights see high demand in south and Bollywood". The New Indian Express. Retrieved 2021-02-19.
  5. "Director Pradeep Krishnamoorthy to make acting debut with Kabadadaari". The New Indian Express. Retrieved 2021-02-19.
  6. "'క‌ప‌ట‌ధారి'నే నమ్ముకున్నాడు.. కాపాడతాడా?". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-02-19.
  7. "Sumanth-Pradeep Krishnamoorthy's film titled Kapatadhaari". The New Indian Express. Retrieved 2021-02-19.
  8. "Kapatadhaari: Sumanth finishes dubbing for his next with Pradeep Krishnamoorthy - Times of India". The Times of India. Retrieved 2021-02-19.
  9. "Kapatadhaari: Sumanth finishes dubbing for his next with Pradeep Krishnamoorthy - Times of India". The Times of India. Retrieved 2021-02-19.
  10. "Kabadadaari to be made in Tamil, Telugu". The New Indian Express. Retrieved 2021-02-19.
  11. "Sibiraj's 'Kabadadaari' to release in May - Times of India". The Times of India. Retrieved 2021-02-19.
  12. "Sibi Sathyaraj and Nandita Sweta starrer Kabadadhaari has a release date - Times of India". The Times of India. Retrieved 2021-02-19.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. Pathi, Thadhagath (February 19, 2021). "Kapatadhaari Movie Review: An engaging thriller that unfolds well". Times of India.

బయటి లింకులు మార్చు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కపటధారి

"https://te.wikipedia.org/w/index.php?title=కపటధారి&oldid=4157427" నుండి వెలికితీశారు