కబడ్డీ కబడ్డీ

కబడ్డీ కబడ్డీ 2003 లో వెంకీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం.[1] ఇందులో జగపతి బాబు, కల్యాణి ముఖ్య పాత్రలు పోషించగా ఇతర ముఖ్య పాత్రల్లో తనికెళ్ళ భరణి, సూర్య, ఎం. ఎస్. నారాయణ, కొండవలస, జీవా, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కబడ్డీ ఆట నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రాన్ని నిర్మాత వల్లూరుపల్లి రమేష్ బాబు, మహర్షి సినిమా అనే బ్యానరుపై నిర్మించాడు. చక్రి సంగీతాన్నందించాడు.

కబడ్డీ కబడ్డీ
దర్శకత్వంవెంకీ
నిర్మాతవల్లూరుపల్లి రమేష్ బాబు
రచనసతీష్ వేగేశ్న (సంభాషణలు)
కథశంకరమంచి పార్థసారథి
నటులుజగపతి బాబు
కల్యాణి
సంగీతంచక్రి
ఛాయాగ్రహణంఎస్. కె. ఎ. భూపతి
కూర్పుబస్వా పైడిరెడ్డి
నిర్మాణ సంస్థ
విడుదల
16 ఫిబ్రవరి 2003 (2003-02-16)
నిడివి
131 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

వెంకన్నపాళెం అనే ఊర్లో రాంబాబు (జగపతి బాబు) 30 ఏళ్ళ వయసు పైబడినా ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కాలక్షేపం చేస్తుంటాడు. అతను జీవితంలో స్థిరపడటం లేదని తండ్రి (తనికెళ్ళ భరణి) ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటాడు. వెంకన్నపాళెం పక్క ఊరైన సఖినేటిపల్లికి గ్రామపెద్ద (సూర్య) కు కావేరి అనే చెల్లెలు ఉంటుంది. రాంబాబు కావేరి (కల్యాణి)తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అన్న మాత్రం రాంబాబు పనీపాట లేకుండా తిరుగుతుంటాడని అతనికి తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. పైగా తమ ఊరి కబడ్డీ జట్టును రాంబాబు ఓడిస్తేనే పిల్లనిస్తానని సవాలు చేస్తాడు. రాంబాబు తన ప్రేమను నెగ్గించుకోవడానికి అప్పటి దాకా పలురకాలుగా కాలక్షేపం చేస్తున్న తన ఊరి వాళ్ళను కూడగట్టి కబడ్డీకి సిద్ధం చేసి పోటీలో గెలిచి తన ప్రేమని నెగ్గించుకోవడం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.

తారాగణంసవరించు

పాటలుసవరించు

కబడ్డీ కబడ్డీ
చక్రి స్వరపరచిన సినిమా
విడుదల2003
సంగీత ప్రక్రియSoundtrack
నిడివి27:35
రికార్డింగ్ లేబుల్ఆదిత్య మ్యూజిక్
నిర్మాతచక్రి
చక్రి యొక్క ఆల్బమ్‌ల కాలక్రమణిక
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
(2002)
కబడ్డీ కబడ్డీ
(2003)
దొంగరాముడు అండ్ పార్టీ
(2003)

చక్ర సంగీతాన్నందించిన పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[4]

సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "గోరువంక గోదారి వంక"  భాస్కరభట్లరవివర్మ, కౌసల్య 4:48
2. "జాబిల్లి బుగ్గను గిల్లి చూడాలి"  భాస్కరభట్లహరిహరన్, కౌసల్య 5:04
3. "కోకిల కోకిల"  భాస్కరభట్లచక్రి, కౌసల్య 3:57
4. "ప్రేమ ప్రేమ"  సాయి శ్రీహర్షసాందీప్, కౌసల్య 5:06
5. "కబడీ కబడీ"  కలువ కృష్ణ సాయిరవివర్మ, చక్రి 4:31
6. "కోకిల కోకిల -II"  భాస్కరభట్లచక్రి, కౌసల్య 3:55
మొత్తం నిడివి:
27:35

మూలాలుసవరించు

  1. "కబడ్డీ కబడ్డీ చిత్ర సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 10 July 2017. Retrieved 1 December 2016. CS1 maint: discouraged parameter (link)
  2. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (13 November 2014). "నా జీవితమే ఓ పుస్తకం". Sakshi. Retrieved 18 May 2020. Check |archiveurl= value (help)CS1 maint: discouraged parameter (link)
  3. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (17 November 2015). "విలన్‌గా భయపెడుతున్నా". andhrajyothy.com. Archived from the original on 18 మే 2020. Retrieved 18 May 2020. CS1 maint: discouraged parameter (link)
  4. "కబడ్డీ కబడ్డీ పాటలు". Raaga.[permanent dead link]