కర్ణన్ (2021 సినిమా)

కర్ణన్, 2021లో విడుదలైన తమిళ సినిమా.[2] వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ధాను నిర్మించిన ఈ చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021 ఏప్రిల్ 9న విడుదలైంది.[3] ఈ చిత్రం 2021, మే 14న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలైంది.[4]

కర్ణన్
Karnan 2021 poster.jpg
దర్శకత్వంమారి సెల్వరాజ్
కథా రచయితమారి సెల్వరాజ్
నిర్మాతకలైపులి ధాను
తారాగణం
 • ధనుష్
 • లాల్
 • నటరాజన్ సుబ్రమణియమ్
 • యోగి బాబు
 • రాజిషా విజయాన్
 • గౌరీ జి. కిషన్
 • జీఎం. కుమార్
 • లక్ష్మి ప్రియా చంద్రమౌళి
ఛాయాగ్రహణంతేని ఈశ్వర్
కూర్పుసెల్వ ఆర్కే
సంగీతంసంతోష్ నారాయణన్
నిర్మాణ
సంస్థ
వి క్రియేషన్స్
విడుదల తేదీ
9 ఏప్రిల్ 2021
సినిమా నిడివి
159 నిముషాలు
దేశం భారతదేశం
భాషతమిళం
బాక్స్ ఆఫీసు63 కోట్లు (3 రోజుల)[1]

కథసవరించు

తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం. ఆ ఊరికి బస్టాప్‌ ఉండదు. ఊరి పొలిమేరల్లో నుంచే రోజూ బస్సు వెళ్తుంది. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న బస్సు ఎవరూ ఆపరు. ఆ ఊళ్లో ఉండేదంతా అణగారిన వర్గాలకు చెందిన వారు కావడంతో రాజకీయ నాయకులు పెద్దగా పట్టించుకోరు. పక్క ఊరి జనాలకు, బస్సు కండక్ట్రర్‌కి కూడా ఈ ఊరి వాళ్లంటే చులకన. ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఖాళీగా ఉండే యువకుడు కర్ణన్‌(ధనుష్‌). ఓ రోజు అతడు పట్నం నుంచి తిరిగి వస్తుండగా బస్సు ఆపమన్నందుకు గొడవ జరుగుతుంది. మీ ఊరొక శవాల దిబ్బ అని ఎగతాళి చేస్తాడు కండక్టర్‌. పక్క ఊరి బస్టాప్‌కు వెళ్లి కళాశాలకు వెళ్దామని ఓ యువతి ప్రయత్నిస్తే అక్కడి యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఇదేంటని ప్రశ్నించినందుకు ఆ యువతి తండ్రిని రోడ్డు మీద పడేసి కొడతారు. ఇలాంటి అవమానాలు, చావులు, ఛిద్రమైన కలలు ఇవన్నీ చూస్తూ పెరుగుతాడు కర్ణన్‌. బస్సులేని కారణంగా తమ ముందు తరం అవకాశాలు పోగొట్టుకోకూడదని బలంగా వాదిస్తాడు. ఊరు దాటి తమ జాతి ప్రజలు ఎదగాలని ఆశపడతాడు. ఓ రోజు నిండు గర్భిణి రోడ్డు మీద నొప్పులతో వేదన పడుతుంటే బస్సు ఆగకుండా వెళ్లిపోతుంది. దీంతో ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. అప్పుడు కర్ణన్‌ ఏం చేశాడు? తన ఊరి ప్రజల కోసం అతను చేసిన పోరాటం ఏంటి? అందుకు కర్ణన్‌ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనేదే మిగతా సినిమా కథ. [5]

నటించిన సినిమాలుసవరించు

 • ధనుష్ - కర్ణన్
 • లాల్ - ఎమ్మ రాజా (తాత)
 • యోగి బాబు - వాదమాలియాన్
 • నటరాజన్ సుబ్రమణియమ్ - ఎస్పీ కన్నబీరన్
 • రాజీషా విజయన్ - ద్రవపతి
 • గౌరీ జి. కిషన్ - పోయిలాల్
 • లక్ష్మి ప్రియా చంద్రమౌళి - పద్మిని
 • జీఎం. కుమార్ - దుర్యోధనాన్
 • షణ్ముగరాజం - అభిమన్యు

సాంకేతిక నిపుణులుసవరించు

 • రచన, దర్శకత్వం: మారి సెల్వరాజ్ [6]
 • నిర్మాత: కలైపులి ధాను
 • నిర్మాణ సంస్థ: వి క్రియేషన్స్
 • సంగీతం: సంతోష్ నారాయణన్ [7]
 • ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్
 • కూర్పు: సెల్వ ఆర్కే

మూలాలుసవరించు

 1. "Karnan Box Office Day 3: Dhanush Starrer Rocks With Rs 63 Crore Opening Weekend Collection Worldwide". India.com. 2021-04-12. Retrieved 8 May 2021.
 2. 10TV (14 February 2021). "ధనుష్ కర్ణన్ ఫస్ట్ లుక్ | Karnan FirstLook Poster". 10TV (in telugu). Retrieved 8 May 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 3. The Indian Express (8 April 2021). "Dhanush's Karnan will release in theatres on April 9, says producer after TN govt withdraws 100 per cent occupancy in theatres". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 4. Andhrajyothy (8 May 2021). "'కర్ణన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 5. Eenadu (21 May 2021). "Dhanush Karnan Review: తిరగబడిన కర్ణుడి కథ 'కర్ణన్‌' - the review of tamil film karnan". www.eenadu.net. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 6. TV9 Telugu, TV9 (31 January 2021). "Danush: 'గుర్రం, ఏనుగు, కుక్క, కత్తి'... ఆసక్తి రేకెత్తిస్తోన్న ధనుష్‌ కొత్త చిత్రం టీజర్‌.. - Dhanush karnan Teaser Out". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
 7. The Times of India (29 September 2019). "Santhosh Narayanan to score the music for Dhanush's next - Times of India". Archived from the original on 8 మే 2021. Retrieved 8 May 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)