కర్నూలు జిల్లా పర్యాటకరంగం

ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రిక ప్రాధాన్యత కలిగిన కొండారెడ్డి బురుజు వంటి ప్రదేశాలతో పాటు అహోబిలం, మహానంది, మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలు, ప్రకృతి సహజ నిర్మాణాలైన బెలుం గుహలు, ఓర్వకల్లు రాతి ఉద్యానవనం వంటివి ఈ పర్యాటక ప్రదేశాల్లో భాగం.

కొండారెడ్డి బురుజు

మార్చు

కొండారెడ్డి బురుజు కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కోట. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి. సా.శ. 1505-1509 మధ్య విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వీర నరసింహరాయలు కందనవీడు కోటను అరవీడు రామరాజుకు బహూకరించినట్లు "ఎ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా" అనే పుస్తకం ద్వారా తెలుస్తూ ఉంది. మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి.[1] శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి.

దేవాలయములు

మార్చు

అహోబిలం

మార్చు
 
శ్రీ నరసింహ స్వామి దేవాలయం - అప్పర్ అహోబిలం

ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.[2] ఈ భూమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో ఈ స్థల పురాణం, అహోబిలం గురించి వ్రాయబడింది.

మహానంది

మార్చు

మహానంది ప్రముఖ శైవ క్షేత్రం.ఇది నంద్యాలకు 14 కి.మీ దూరంలో ఉంది. ఈ మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ది నాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా.

మంత్రాలయం

మార్చు

మంత్రాలయం లోని రాఘవేంద్రస్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది జిల్లా కేంద్రం కర్నూలు నుండి 100 కి.మీ. దూరంలో ఉంది.

ఆదోని కోట

మార్చు

ఆదోని కోట ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపుర సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, చివరికి ఆంగ్లేయుల చేతుల్లోకి మారుతూ వచ్చింది.

బెలుం గుహలు

మార్చు
 
బెలూం గుహలు

తాడిపత్రికి 28 కిలోమీటర్లదూరంలో ఉన్న బెలూం గుహలు ప్రకృతి సిద్ధమైనవి.

రోళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం

మార్చు

రోళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణా కేంద్రం కర్నూలు జిల్లా కేంద్రం నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 6.14 చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ అభయారణ్యాన్ని 1988 లో స్థాపించారు. అంతరించిపోతున్న బట్టమేక పిట్టకు ఇది ఆవాసం.[3]

ఓర్వకల్లు రాతి ఉద్యాన వనం

మార్చు

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం జిల్లా కేంద్రం నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుండి నంద్యాల వెళ్ళే జాతీయ రహదారి 18 కి పక్కనే వీటిని చూడవచ్చు. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిగా ఉపయోగించే క్వార్ట్జ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిలలు ఏర్పడ్డాయి.[4] ఇక్కడ సినిమాలు కూడా చిత్రీకరిస్తుంటారు.

మూలాలు

మార్చు
  1. Murthy, Vydehi (2016-11-24). "కొండారెడ్డి బురుజు సెంటరు, కర్నూలు, చంద్రగిరికోట @ చిత్తూరు". KostaLife (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2017-02-01. Retrieved 2019-01-16.
  2. http://ahobilam.net/ahobilamhistory.html
  3. "Rollapadu Wildlife Sanctuary". Department of Forests, Government of Andhra Pradesh. Archived from the original on 29 అక్టోబరు 2013. Retrieved 5 June 2013.
  4. కుమారనాథ్, కె. వి. "A rocky, solid gift from nature". thehindubusinessline.com. ఎన్. రాం. Retrieved 17 October 2016.