కల్పనా పండిట్
కల్పన పండిట్ (జననం 1967 జనవరి 20) భారతీయ నటి, మోడల్, వైద్యురాలు. ఆమె హౌస్ ఆఫ్ పండిట్ (TM) అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించింది. ఆమె బాలీవుడ్, కన్నడ సినిమా రంగాలలో ప్రసిద్ధి చెందింది. 2008లో, ఆమె లండన్‌లో జీ సినీ అవార్డ్స్ సాంకేతిక అవార్డుల వేడుకను నిర్వహించింది. 2012లో, అరిజోనాలోని టక్సన్‌లో 2012 ఆగస్టు 29న జరిగిన మిసెస్ అమెరికా పోటీ 2012 జ్యూరీలో ఒకరిగా ఆమె పనిచేసింది. నవంబరు 2013లో, చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన మిసెస్ వరల్డ్ 2013 సెలబ్రిటీ జడ్జింగ్ ప్యానెల్‌లో కూడా ఆమె చేసింది.[1]
కల్పనా పండిట్ | |
---|---|
జననం | నంజన్‌గూడ, మైసూరు జిల్లా, కర్ణాటక | 1967 జనవరి 20
వృత్తి | సినిమా నటి మోడల్ నిర్మాత వైద్యురాలు |
ఎత్తు | 5 అ. 9 అం. (1.75 మీ.) |
కేశాల రంగు | నలుపు |
కళ్ళ రంగు | గోధుమ రంగు |
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధిగా హాలీవుడ్ గ్రాండ్ మూవీ ప్రీమియర్స్ రెడ్ కార్పెట్ మీద ఆమె నడిచింది. ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, క్వాంటమ్ ఆఫ్ సోలేస్ చిత్రాలకుగాను ప్రీమియర్ నైట్స్‌కు అతిథిగా ఆమె గౌరవించబడింది. బ్రాడ్ పిట్, డేనియల్ క్రెయిగ్, జెన్నిఫర్ లోపెజ్, ఏంజెలీనా జోలీ వంటి మరెందరో హాలీవుడ్ ప్రముఖులతో ఆమెకు పరిచయం ఉంది. ఆమె ప్రఖ్యాతి చెందిన అత్యవసర వైద్యురాలు, కార్యనిర్వాహకురాలు కూడా.
2004లో వచ్చిన ఆనందమానందమాయె తెలుగు చలన చిత్రంలో ఆమె ప్రత్యేక పాత్రలో నటించింది. ఈ చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా జై ఆకాశ్, రేణుక మీనన్, జె. డి. చక్రవర్తి, ప్రీతి జింగానియా తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు,[2][3]
ప్రారంభ జీవితం
మార్చుకల్పనా పండిట్ కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు భిషాగ్రత్న ఆయుర్వేద విద్వాన్ శ్రీ బి. వి. పండిట్ మనవరాలు. ఆమె ప్రతిష్టాత్మక మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఎం.బి.బి.ఎస్. డిగ్రీ అందుకుంది. ఆ తరువాత, ఆమె యుఎస్ఎ వెళ్ళి ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎం.డి. పూర్తి చేసింది.[4] అక్కడ, ఆమె కొంతకాలం అత్యవసర వైద్యురాలిగా పనిచేసింది.
కెరీర్
మార్చుభారతదేశంలో వీల్ డిటర్జెంట్ పౌడర్, మైసూర్ శాండల్ టాల్క్, నైల్, రాణిపాల్ స్టెయిన్ రిమూవర్, సిర్టెక్స్ వంటి ఉత్పత్తుల టెలివిజన్ వాణిజ్య ప్రకటనలకు ఆమె మోడల్.
2000లో, ఎం.ఎఫ్. హుసేన్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం గజ గామినితో ఆమె తొలిసారిగా నటించింది.
ఫిల్మోగ్రఫీ
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్స్ |
---|---|---|---|---|
2000 | గజ గామిని | అభిసారిక | హిందీ | |
2001 | మోక్ష | నీలిమ | హిందీ | |
2002 | పితాః | హిందీ | 'మేరీ జవానీ' పాటలో ప్రత్యేక పాత్ర | |
2003 | ప్రాణ్ జాయే పర్ షాన్ నా జాయే | హిందీ | స్పెషల్ అప్పీయరెన్స్ | |
2003 | ఓం | హిందీ | స్పెషల్ అప్పీయరెన్స్ | |
2003 | ప్యార్ కియా నహిం జాతా | అంజు | హిందీ | |
2004 | ఆనందమానందమాయె | తెలుగు | స్పెషల్ అప్పీయరెన్స్ | |
2005 | పద్మశ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ | సూపర్ మోడల్ "చిడియా చిడియా" | హిందీ | స్పెషల్ అప్పీయరెన్స్ |
2007 | దేహా | సూపర్ మోడల్ | హిందీ | |
2009 | అనుభవ్ | లైలా | హిందీ | |
2010 | జో జో లాలీ | కల్పన | కన్నడ | |
2011 | లవ్ ఖిచ్డీ | నఫీసా ఖాన్ | హిందీ | |
2012 | పనితులి | మాయ | తమిళం | |
2012 | జాన్లేవా 555 | నీలం / రజని | హిందీ | |
2013 | ది చైనామాన్ | కరోలిన్ | ఆంగ్లం | |
2014 | తుమ్ హో యారా | మాయ | హిందీ | |
2015 | సులిగే సిక్కిదాగా | పల్లవి | కన్నడ | |
2018 | వెన్ ఐ సింగ్ | ఆంటోనియా | ఆంగ్లం |
అవార్డులు
మార్చు- ఉత్తమ నటి కన్నడ - సౌత్ ఇండియన్ మెగా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2011 బెంగళూరు - జో జో లాలీ (2010)[5]
- ఉత్తమ నటి- బెంగళూరు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 - "జో జో లాలీ"
- నటి/ స్వతంత్ర నూతన నిర్మాత అవార్డు 2013 _ శివ రాజముద్ర చత్రపతి శివాజీ అవార్డు ముంబై 2013 "జన్లేవా 555"
- ఉత్తమ నటి-బాలీవుడ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2016 _ సులిగే సిక్కిదాగా "బీ ఫ్లూయిడ్ యాజ్ వాటర్.... "
మూలాలు
మార్చు- ↑ "Kalpana: Actress, House of Pandit owner - Indian Ad Divas". indianaddivas.com. Archived from the original on 16 June 2015. Retrieved 11 February 2015.
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఆనందమానందమాయె". telugu.filmibeat.com. Retrieved 27 April 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Anandamanandamaye". www.idlebrain.com. Retrieved 27 April 2018.
- ↑ "Physician Kalpana Pandit Makes Debut in Bollywood". Indiawest. 2012-09-14. Archived from the original on 5 June 2013. Retrieved 2012-11-04.
- ↑ "Kalpana Pandit to judge Miss India International 2012". Bangalore Live News. 2012-05-06. Archived from the original on 4 March 2016. Retrieved 2012-11-04.