ప్రీతి ఝంగియాని

భారతీయ సినిమా నటి, మోడల్
(ప్రీతి జింగానియా నుండి దారిమార్పు చెందింది)

ప్రీతి ఝంగియాని ఒక భారతీయ చలనచిత్ర నటి, మోడల్. ఈమె పేరును ప్రీతి జింగానియాగా, ప్రీతి జింగ్యానిగా సినిమా టైటిల్స్‌లో పేర్కొన్నారు.

ప్రీతి ఝంగియాని
జననం
వృత్తిమోడల్, నటి
జీవిత భాగస్వామిపర్వీన్ దబ్బాస్ (2008–ప్రస్తుతం)

విశేషాలు

మార్చు

ప్రీతి ఝంగియాని ముంబైలో ఒక సింధీ కుటుంబంలో జన్మించింది.[1] ఈమె మొదటి సారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి "యే హై ప్రేమ్" అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించింది. ఈ ఆల్బం ఈమె, అబ్బాస్ ఇద్దరితో పాటు ఆల్బం గుర్తుగా వాడిన కోలాకు పేరు తెచ్చిపెట్టింది. తరువాత ఈమె నిర్మా శాండల్ సోప్ ప్రకటనలో నటించింది. తరువాత అనేక ప్రకటనలలో మోడల్‌గా కనిపించింది.

ఈమె మలయాళ సినిమా "మళవిల్లు"తో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె ప్రశాంత్ తో హలో అనే తమిళ సినిమాలో, పవన్ కళ్యాణ్ తో తమ్ముడు అనే తెలుగు సినిమాలలో నటించింది. 2000 సంవత్సరంలో "మొహబ్బతే" సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె తరువాత హిందీ సినిమా "ఆవారా పాగల్ దీవానా" అనే కామెడీ సినిమా. ఈమె ఇంకా కన్నడ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, రాజస్థానీ సినిమాలలో నటించింది.

ఈమె ఆదిత్య చోప్రా, అరుణ్ ప్రసాద్, ఎస్. ఎస్. రాజమౌళి, శ్రీను వైట్ల, బి.గోపాల్, రవిరాజా పినిశెట్టి, దినేష్ బాబు, కె.సెల్వ భారతి,అర్జున్ సబ్లోక్, విక్రం భట్, మనోజ్ అగర్వాల్, రవి దీవాన్, టిన్నూ వర్మ, జె.పి.దత్తా, మాధుర్ భండార్కర్, శ్రీను యరజాల, శివమణి, కీర్తి కుమార్, సౌరభ్ శుక్లా, జై ప్రకాష్, గ్లెన్ బ్లారెట్టో, అంకుష్ మొహ్లా, ముస్తఫా ఇంజనీర్, హృదయ్ శెట్టి, అనంత్ మహదేవన్, వర ముళ్ళపూడి, జయతీర్థ, గౌతం అనిల్ నాగరథ్ మొదలైన దర్శకుల సినిమాలలో నటించింది.

ఈమె పవన్ కళ్యాణ్, ప్రశాంత్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, అక్కినేని నాగార్జున, సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, గోవిందా, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, అజయ్ దేవగణ్, రాజేంద్ర ప్రసాద్, జె. డి. చక్రవర్తి, ఉపేంద్ర, జూనియర్ ఎన్.టి.ఆర్, అల్లరి నరేష్ వంటి నటులతో కలిసి పనిచేసింది.

ఈమె సహీ దంధే గలత్ బందే అనే హిందీ సినిమాను స్వంతంగా నిర్మించి బాలీవుడ్ మహిళా నిర్మాతల సమూహంలో చేరింది. ఈమె 2013 తర్వాత వివాహం, సంతానం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి 2017లో పునఃప్రవేశం చేసింది.

పురస్కారాలు

మార్చు

ఈమె నటించిన రాజస్థానీ సినిమా "తావ్‌డొ ద సన్‌లైట్"లో ఈమె నటనకు రాజస్థానీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌(RIFF)లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.[2] 2017లో జరిగిన రాజస్థాన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటిగా ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది[3].

వ్యక్తిగత జీవితం

మార్చు

మేనకా ఝంగియాని, గోబింద్ ఝంగియానిలు ఈమె తల్లిదండ్రులు. ఈమె 2008, మార్చి 23న నటుడు, దర్శకుడు అయిన పర్వీన్ దబస్‌ను వివాహం చేసుకుంది. 2011లో జయ్‌వీర్, 2016లో దేవ్ అనే ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చింది. ఈమె తన కుటుంబంతో ముంబైలోని బాంద్రా అనే ప్రదేశంలో నివసిస్తున్నది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష వివరాలు
1999 మళవిల్లు వీణ మలయాళం
హలో శ్వేత తమిళం
తమ్ముడు జానకి / జాను తెలుగు
2000 మొహబ్బతే కిరణ్ హిందీ
2001 నరసింహ నాయుడు అంజలి తెలుగు
అధిపతి అనూరాధ తెలుగు
2002 నా తుమ్‌ జానో నా హమ్‌ హిందీ ప్రత్యేక పాత్ర
ఆవారా పాగల్ దీవానా ప్రీతి హిందీ
వాహ్! తేరా క్యా కహ్నా మీనా హిందీ
అనర్థ్ ప్రీతి హిందీ
2003 బాజ్: ఎ బర్డ్ ఇన్ డేంజర్ ప్రీతి రస్తోగి హిందీ
ఎల్.ఓ.సి. కార్గిల్ బల్వాన్ సింగ్ స్నేహితురాలు హిందీ
2004 అప్పారావు డ్రైవింగ్ స్కూల్ అంజలి తెలుగు
ఆన్: మెన్ ఎట్ వర్క్ జానకి హిందీ
ఆనందమానందమాయె మహేశ్వరి తెలుగు
ఓంకార దివ్య కన్నడ
2005 సౌదా - ది డీల్ దేవిక హిందీ
సుఖ్ సుశీల చంద్రప్రకాష్ శర్మ హిందీ
చెహరా డా.రీనా హిందీ
చాహత్ - ఏక్ నషా రశ్మి ఎస్.జెట్లీ హిందీ
2006 విత్ లవ్ తుమ్హారా అనూరాధ బి. సింగ్ హిందీ
జానే హోగా క్యా సుచిత్ర హిందీ
చాంద్ కే పార్ చలో నిర్మల / గరిమ హిందీ
2007 సజ్నా వె సజ్నా పంజాబీ
గాడ్‌ఫాదర్: ద లెజెండ్ కంటిన్యూస్ ఉర్దూ పాకిస్థానీ సినిమా
విక్టోరియా నెం.203 దేవయాని / మోనా హిందీ
యమదొంగ ఊర్వశి తెలుగు యంగ్ యమా యంగ్ యమా పాటలో ఒక అప్సరసగా ప్రత్యేక పాత్రలో నటించింది
2008 విశాఖ ఎక్స్‌ప్రెస్ సుచిత్ర తెలుగు
2009 హసీనా: స్మార్ట్, సెక్సీ, డేంజరస్ టీనా హిందీ
2010 తేజం తెలుగు ఐటం సాంగ్‌లో నటించిందిr[4]
యాజ్ ద రివర్ ఫ్లోస్ హిందీ సంజయ్ సూరితో కలిసి నటించింది.[5]
2011 ద మాస్టర్‌పీస్ ప్రీతి హిందీ లఘుచిత్రం
సహీ ధంధే గలత్ బందే శాలినీ మెహతా హిందీ నిర్మాత కూడా
2013 దేఖో యే హై ముంబై రియల్ లైఫ్ హిందీ
టోని కన్నడ
కాష్ తుమ్‌ హోతే హిందీ
మిస్టేక్ బెంగాలీ విక్రం చటర్జీతో కలిసి నటించింది.
బిక్కర్ బాయ్ సెంటిమెంటల్ పంజాబీ
2017 తావ్‌డొ ద సన్‌లైట్[6] పాల్కి రాజస్థానీ

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Leena Mulchandani, ET Bureau (2009-07-11). "Sindhi film industry striving hard to revive fading culture - Page 2 - Economic Times". Articles.economictimes.indiatimes.com. Retrieved 2014-08-05.
  2. "Preeti Jhangiani wins best actor award for 'Taawdo' at RIFF - Times of India".
  3. "DPK NEWS". dpknewsindia.com. Archived from the original on 2017-11-07. Retrieved 2018-03-07.
  4. "Preeti Jhangiani tried southern pastures". realbollywood.com. 26 March 2009. Archived from the original on 30 మార్చి 2009. Retrieved 16 May 2011.
  5. "Preeti to make Bollywood comeback". digitalspy.com. 3 July 2009. Retrieved 16 May 2011.
  6. "राजस्थानी फिल्म तावड़ो 31 मार्च को होगी रिलीज". 29 March 2017. Archived from the original on 19 జూలై 2018. Retrieved 7 మార్చి 2018.

బయటి లింకులు

మార్చు