కళా తెలంగాణం (పుస్తకం)
కళా తెలంగాణ పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 2017, డిసెంబరు 17న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు వేడుకలలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి. లక్ష్మా రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలు ఆవిష్కరించారు.[1]
కళా తెలంగాణం | |
కళా తెలంగాణం పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | సంకలనం |
---|---|
సంపాదకులు: | మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్ |
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | తెలంగాణ కళారూపాలపై వ్యాసాలు |
ప్రచురణ: | సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ |
విడుదల: | డిసెంబర్ 17, 2017 |
పేజీలు: | 224 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-81-936345-6-1 |
సంపాదకవర్గం
మార్చు- సంపాదకులు: మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్
- సలహామండలి: డా. ఎక్కా యాదగిరిరావు, డా. నునుమాస స్వామి, డా. సురభి వాణీదేవి, డా. భట్టు రమేష్, చావలి దేవదాస్, ఎస్. విజయరాఘవరెడ్డి, సి.ఎస్. రాంబాబు.
- నిర్వాహణ - కూర్పు: అయినంపూడి శ్రీలక్ష్మి
పుస్తకం గురించి
మార్చుభాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాదు ఆకాశవాణిలు సంయుక్తంగా జానపద, సంగీత ఉత్సవాలు నిర్వహించాయి. ఆకాశవాణిలో 2017, ఏప్రిల్ 2నుండి కళలు - కళారూపాలు - వాటి ప్రత్యేకత అనే కార్యక్రమం ప్రసారమయింది. ఆ కార్యక్రమంలో ప్రసారమైన తెలంగాణ జానపద కళారూపాల ప్రసంగాలన్నింటిని ఒక పుస్తకంగా ప్రచురించారు.
వ్యాసాలు
మార్చుక్రమసంఖ్య | వ్యాసం పేరు | రచయిత పేరు | పేజీ నెం |
---|---|---|---|
1 | బైండ్ల కథ | కె.వి. రామకృష్ణ | 1 |
2 | బిక్షుక కుంట్లు | అబ్బు గోపాల్ రెడ్డి | 5 |
3 | చెక్కబొమ్మలాట | డా. సి.హెచ్. రవికుమార్ | 13 |
4 | చిందు యక్షగానం | డా. గడ్డం మోహన్ రావు | 19 |
5 | డప్పు | అందే భాస్కర్ | 31 |
6 | గుస్సాడీ | డా. భట్టు రమేష్ | 41 |
7 | గోంధాళీ వీధి భాగోతం | డా. భట్టు రమేష్ | 45 |
8 | కడ్డీ తంత్రి కథ | డా. దాసరి రంగ | 51 |
9 | కోలాటం | లింగా శ్రీనివాస్ | 59 |
10 | మిత్తలి | డా. బాసని సురేష్ | 69 |
11 | ఒగ్గు కథ | డా. నునుమాస స్వామి | 75 |
12 | పన్నెండుమెట్ల కిన్నెర | డా. దాసరి రంగ | 81 |
13 | రాజగోండుల చరిత్రకారులు - ప్రధాన్‌లు | అడ్లూరి శివప్రసాద్ | 86 |
14 | రుంజ కథలు | అడ్లూరి శివప్రసాద్ | 95 |
15 | సాధనా శూరులు | డా. బాసని సురేష్ | 103 |
16 | శారద కథ | డా. నునుమాస స్వామి | 111 |
17 | తోలుబొమ్మలాట | కె.వి. రామకృష్ణ | 115 |
18 | తోటి కథలు | డా. శ్రీమంతుల దామోదర్ | 123 |
19 | యక్షగానం | డా. మొరంగపల్లి శ్రీకాంత్ | 129 |
20 | తెలంగాణ గిరిజన కళారూపాలు | డా. భట్టు రమేష్ | 137 |
21 | జానపదుల గిరిజన వాద్యాలు | డా. అన్నావఝ్జుల మల్లికార్జున్ | 143 |
22 | చిత్రకళ | డా. సురభి వాణీదేవి | 147 |
23 | శిల్పకళ | టి. ఉడయవర్లు | 153 |
24 | నాటకకళ | డా. సంగనభట్ల నరసయ్య | 159 |
25 | నకాశీ | రాయసం లక్ష్మీ | 165 |
26 | పెద్దరాతి కళాయుగం | శ్రీరామోజు హరగోపాల్ | 171 |
27 | తెలంగాణ పద కవిత్వం | డా. మొరంగపల్లి శ్రీకాంత్ | 185 |
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 December 2017). "రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట". Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.