కాకాణి గోవర్ధన్‌రెడ్డి

శాసనసభ్యుడు

కాకాణి గోవర్ధన్‌రెడ్డి (జననం: 10 నవంబరు 1964) నెల్లూరు జిల్లాకు చెందిన రాజకీయవేత్త.[2] ఇతను నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం నుండి 2014 సార్వత్రిక ఎన్నికలలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ్యునిగా గెలుపొందారు. ఇతను నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌ గా కూడా పనిచేశారు.[3] [4]

కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు ఆదాల ప్రభాకర రెడ్డి
నియోజకవర్గం సర్వేపల్లి

జిల్లా పరిషత్ చైర్మన్
నెల్లూరు జిల్లా
పదవీ కాలం
2006 – 2011

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-10) 1964 నవంబరు 10 (వయసు 59)
తోడేరు (గ్రామం), పొదలకూరు (మండలం), ఎస్పీఎస్ఆర్, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1]
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ (2011–present)
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్ (2011 ముందు)
జీవిత భాగస్వామి విజిత
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

ఇతను 2006 లో శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాకు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.[5] తరువాత ఇతను 2011 లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6] కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2015 నుంచి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[7]ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[8] ఆయన 2019 నుంచి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నాడు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[9][10] ఆయన సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఏప్రిల్ 21న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[11]


మూలాలు

మార్చు
  1. Sakshi (18 March 2019). "నెల్లూరు బరిలోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.
  2. Sakshi (10 April 2022). "ఆ అంశాలే కాకాణికి కలిసొచ్చాయి." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. "Kakani Govardhan Reddy(YSRCP):Constituency- SARVEPALLI(NELLORE) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2019-06-09.
  4. "Constituencywise-All Candidates". web.archive.org. 2014-05-18. Archived from the original on 2014-05-18. Retrieved 2019-01-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Chairman & Vice-Chairman list 2006" (PDF). www.apsec.gov.in. Archived from the original (PDF) on 2018-05-09. Retrieved 2019-01-08.
  6. "Nellore ZP chief joins Jagan camp". The Times of India. 21 January 2011. Retrieved 15 February 2020.
  7. "Parliament District Presidents". YSR Congress Party (in ఇంగ్లీష్). Archived from the original on 2019-06-09. Retrieved 2019-06-09.
  8. Sakshi (6 June 2021). "Sarvepalli Constituency Winner List in AP Elections 2019 | Sarvepalli Constituency MLA Election Results 2019". www.sakshi.com. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  9. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  10. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  11. 10TV (21 April 2022). "వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ కాకాణి గోవర్ధన్ రెడ్డి |Kakani Govardhan Reddy has taken over as the Minister of Agriculture" (in telugu). Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

వెలుపలి లంకెలు

మార్చు