కాకులపాడు

భారతదేశంలోని గ్రామం

కాకులపాడు, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 106., ఎస్.టీ.డీ.కోడ్ = 08656. కాకులపాడు కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపులపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుడివాడ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 625 ఇళ్లతో, 2097 జనాభాతో 1195 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1087, ఆడవారి సంఖ్య 1010. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 786 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 6. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589092[1].పిన్ కోడ్: 521106, ఎస్.టీ.డీ.కోడ్ = 08656.

కాకులపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి వెలగపూడి సరితకుమారి
జనాభా (2011)
 - మొత్తం 2,097
 - పురుషులు 1,087
 - స్త్రీలు 1,010
 - గృహాల సంఖ్య 625
పిన్ కోడ్ 521106
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

బాపులపాడు మండలంసవరించు

బాపులపాడు మండలంలోని అంపాపురం, ఆరుగొలను, ఓగిరాల, కాకులపాడు, కురిపిరాల, కొదురుపాడు, కానుమోలు, కొయ్యూరు, చిరివాడ, తిప్పనగుంట, దంతగుంట్ల, బండారుగూడెం, బాపులపాడు, బొమ్ములూరు కండ్రిగ, బొమ్ములూరు, మల్లవల్లి, రంగన్నగూడెం, రామన్నగూడెం, రేమల్లె, వీరవల్లె, వెంకటరాజుగూడెం, వెంకటాపురం, వెలేరు, శోభనాద్రిపురం, సింగన్నగూడెం, సెరి నరసన్నపాలెం గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికంసవరించు

[3] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో ఓగిరాల, ఆరుగొలను, తిప్పనగుంట, అరిపిరాల, కుదరవల్లి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

పెదపాడు, నందిగామ, ఉంగుటూరు, గుడివాడ

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

కాకులపాడులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి. హనుమాన్ జంక్షన్, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుడివాడ విజయవాడ 44 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి బాపులపాడులోను, మాధ్యమిక పాఠశాల రామన్నగూడెంలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల కనుమోలులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బాపులపాడులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల ఏలూరులోను, పాలీటెక్నిక్‌ గుడివాడలోను, మేనేజిమెంటు కళాశాల బొమ్ములూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల గుడివాడలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు ఏలూరులోనూ ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

నీటిశుద్ధి పథకoసవరించు

కాకులపాడులో దాసరి ట్రస్టు క్రింద నిర్మించిన నీటిశుద్ధి పథకాన్ని 26,జనవరి-2014న గణతంత్రదినోత్సవ నాడు, పునఃప్రారంభించారు. యూ.వీ.పద్ధతిలో నడుస్తున్న ఈ పథకం నీరు, తాగేందుకు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఆర్.వీ.పద్ధతి లోనికి మార్చారు. ఇందుకోసం సహకార సంఘం వారు రెండు లక్షల రూపాయలు వితరణ చేశారు. [3]

ప్రాధమిక సహకార పరపతి సంఘంసవరించు

ఈ సంఘ కార్యాలయానికి 70 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఒక శాశ్వత భవనాన్ని, 2016,డిసెంబరు-8న ప్రారంభించెదరు. దీనిలో రైతుల కోసం ఒక గోదాము ఉంటుంది. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నుండి ఎలాంటి ఋణం తీసుకోకుండానే ఈ భవనం నిర్మించడం విశేషం. ఈ భవన నిర్మాణానికి కావలసిన పదిన్నర సెంట్ల భూమిని, జీవిత బీమా సంస్థ విశ్రాంత ఉద్యోగి శ్రీ త్రిపురనేని వెంకట కనక వేణుగోపాల రావు వితరణగా అందించారు. [7]

కళ్యాణ మండపంసవరించు

పారిశుధ్యంసవరించు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

కాకులపాడులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

 1. ఈ ఊరి మధ్యలో మంచినీళ్ళ చెరువు ఉంది. ఈ చెరువు చుట్టూరా గ్రామ పంచాయితీ భవనం, ప్రాథమిక పాఠశాల, పాలకేంద్రం, గుడి, పెద్దపెద్ద మర్రి చెట్లు మొదలగునవి ఉన్నాయి.
 2. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, కోనేరుచెరువు, వైకుంఠలక్ష్మీపురం చెరువులలో పూడికతీత కార్యక్రమం చేపట్టి అభివృద్ధిచేసారు. మంచినీటి చెరువునుగాడా బాగుచేయించారు. ఆ తరువాత పట్టిసీమనుండి వచ్చిన గోదావరి జలాలతో ఈ మూడు చెరువులనూ పూర్తిస్థాయిలో నింపినారు. అందువలన చుట్టు ప్రక్కన గల గ్రామాలు నీటి ఎద్దడితో విలవిలలాడుచుండగా ఈ గ్రామం జలకళతో అలరారుచున్నది. [6]

గ్రామ పంచాయతీసవరించు

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి వెలగపూడి సరితకుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

 1. శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం:- ఈ గ్రామంలో నెలకొన్న ఈ దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ 2014,మార్చ్-17, సోమవారం నాడు, వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 13వ తేదీ నుండి 5 రోజులపాటు, సుప్రభాతసేవ నుండి మూలమంత్ర హోమం వరకూ, వివిధ పూజాకార్యక్రమాలు నిర్వహించారు. 17వ తేదీ సోమవారం నాడు, ఉదయం సుప్రభాతసేవతో మొదలుపెట్టి, యంత్రప్రతిష్ఠచేసి, శాస్త్రోక్తంగా, ద్వజస్థంబాన్ని, ఆలయం ముంగిట నిలిపారు. అనంతరం శాంతికళ్యాణం, పిదప అన్నసమారాధన జరిపినారు. [4]
 2. శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరటంతో గ్రామస్థులు, దాతల సహకారంతో ఈ ఆలయాన్ని, రు. 10 లక్షల వ్యయంతో, మూడు నెలల వ్య్వధులోనే జీర్ణోద్ధరణ చేసారు. పునర్నిర్మాణం చేసిన ఈ ఆలయంలో, 2014, జూన్-18, బుధవారం తెల్లవారుఝామున సుప్రభాతం, అర్చన, విష్వక్సేనపూజ, కళాన్యాసహోమం నిర్వహించి, శాస్త్రోక్తంగా శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నసంతర్పణ చేసారు. [5]

గ్రామ ప్రముఖులుసవరించు

 • రచయిత్రి ఝాన్సీ కమల వరకుమారి, కవి తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ ఈ గ్రామంలో జన్మించి పెరిగి పెద్దయినవారే.
 • కవి తుల్లిమల్లి విల్సన్‌ సుధాకర్‌ "దళిత వ్యాకరణం" అను కవితా సంపుటిని వెలువరించాడు. ఈ పుస్తకానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారాన్ని 2007 సంవత్సరానికి అందచేసింది. 2013 లో ' మాకూ ఒక భాష కావాలి' కవితా సంపుటిని విల్సన్ సుధాకర్ వెలువరించి 2014లో ' ఫ్రీవర్స్ ఫ్రంట్ ' అవార్డును పొందారు. ఈయన భారత పర్యాటక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా సేవలందిస్తున్నారు.

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయడానికై, దాతలు శ్రీ చలసాని ఆంజనేయులు, శ్రీ పుట్టగుంట సతీష్ కుమార్, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [6]

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వారం వారం సంత గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

కాకులపాడులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 104 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 3 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 36 హెక్టార్లు
 • బంజరు భూమి: 2 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1048 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 2 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1048 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

కాకులపాడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 1048 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

కాకులపాడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులుసవరించు

గ్రామంలో 90% ప్రజలు వ్యవసాయం పైనే ఆధారపడ్డారు.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,097 - పురుషుల సంఖ్య 1,087 - స్త్రీల సంఖ్య 1,010 - గృహాల సంఖ్య 625

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2326.[4] ఇందులో పురుషుల సంఖ్య 1193, స్త్రీల సంఖ్య 1133, గ్రామంలో నివాసగృహాలు 603 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1195 హెక్టారులు.

మూలాలుసవరించు

 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
 3. "కాకులపాడు". Retrieved 22 June 2016.
 4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-06.

వెలుపలి లంకెలుసవరించు

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-25; 9వపేజీ. [3] ఈనాడు విజయవాడ; 2014,జనవరి-27; 5వపేజీ. [4] ఈనాడు విజయవాడ; 2014,మార్చి18; 5వపేజీ. [5] ఈనాడు విజయవాడ/మంగళగిరి; 2014,జూన్-19; 5వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-15; 5వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2016,డిసెంబరు-8; 7వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కాకులపాడు&oldid=2984198" నుండి వెలికితీశారు