కాగజ్‌నగర్ పురపాలకసంఘం
కాగజ్‌నగర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] కాగజ్‌నగర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
కాగజ్‌నగర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 19°20′08″N 79°29′34″E / 19.3354272°N 79.4928857°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం |
మండలం | కాగజ్‌నగర్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 28 km² (10.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 66,293 |
- పురుషుల సంఖ్య | 33,124 |
- స్త్రీల సంఖ్య | 33,169 |
- గృహాల సంఖ్య | 16,680 |
పిన్ కోడ్ - 504296 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ -08738 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న కాగజ్‌నగర్ 1988లో పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
మార్చుకాగజ్నగర్ 28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°12′04″N 79°23′46″E / 18.201°N 79.396°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ నుండి 26.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 66,293 మంది కాగా, అందులో 33124 మంది పురుషులు, 33169 మంది మహిళలు ఉన్నారు. 16,680 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 31 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 31 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- సద్దాం హుస్సేన్
- పునం మల్హోత్రా
- కె. శివప్రసాద్
- వంగరి సాగరిక
- కొంకిమల్ల శ్రీలత
- పిర్సింగుల జైచందర్
- ఎల్లేష్
- బంక శివ
- మాన్హాజ్
- అన్నం దాసరి విజయ
- మహ్మద్ వాలి
- శశికళ
- ఫరీనా సుల్తానా
- నసీమ్ భాను
- సామిశెట్టి రాజేందర్
- బీస సమత
- విజయ్ యాదవ్
- రామ్టెంకి ఝాన్సీ
- సాహిన్ సుల్తానా
- మదన్ మోహన్
- రాచకొండ గిరీష్
- ఎ. లావణ్య
- బొడ్డున విద్యావతి
- తాతి జైచందర్
- మునీరా భాను
- యాస్మిన్ భాను
- పంబాలా సుజాత
- డోంగ్రీ అనిల్
- వెన్నె సంగిత
- కీర్తి రేఖ
మూలాలు
మార్చు- ↑ "Kagaznagar Municipality". kagaznagarmunicipality.telangana.gov.in. Archived from the original on 12 మే 2021. Retrieved 12 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 12 May 2021.
- ↑ "Basic Information of Municipality, Kagaznagar Municipality". kagaznagarmunicipality.telangana.gov.in. Retrieved 12 May 2021.[permanent dead link]
- ↑ admin (2020-05-16). "Kagaznagar municipality Councillors list 2020". Telangana data. Archived from the original on 2021-05-12. Retrieved 12 May 2021.
వెలుపలి లంకెలు
మార్చు- కాగజ్‌నగర్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-05-12 at the Wayback Machine