కాచి బీ.సి.డి.గ్రూపు కులం. కాచిగూడ హైదరాబాదు‌ పాతబస్తీ నుంచి అంబర్‌పేట వరకు మూసి నది ఒడ్డున `కాచి' కులం వారు కనిపిస్తారు.

చరిత్ర

మార్చు

వీరి పూర్వీకులు వందల ఏళ్ల క్రిందట బుందేల్‌ ఖండ్‌ నుంచి హైదరాబాదు‌కు వలస వచ్చారు. కనుకనే వీరు గ్రేటర్‌ హైదరాబాదు‌ మినహా మరెక్కడా కనిపించరు. వీరి పూర్వీకులు కూరగాయలు పండించి జీవించేవారు. కనుకనే వీరు ఎక్కడున్నా నది ఒడ్డును నివాస ప్రాంతాలుగా ఎంచుకుంటారు.

సమకాలీనం

మార్చు

రాజకీయాలలో

మార్చు
 
ఈ కులానికి చెందిన అశోక గెహ్లాట్

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , మహారాష్ర్ట డిప్యూటీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి కాచి కులస్తులే. ఉత్తరప్రదేశ్‌లో 14 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా వారిలో నలుగురు మంత్రులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మన రాష్ర్టంలో మాత్రం కాచి కులస్తులలో ఒక్కరికి హైదరాబాదు‌లో కార్పొరేటర్‌గా ఎంఐఎం అవకాశం ఇచ్చింది. ఈ 60 ఏళ్ల చరిత్రలో ఆ ఒక్క కార్పొరేటర్‌ మినహా ప్రజా ప్రతినిధిగా ఎన్నికయిన వారు ఎవ్వరూ లేరు.

సామాజిక జీవితం, వృత్తి

మార్చు

హైదరాబాదు‌లో ఇల్లు కట్టుకోవటానికే జాగా దొరకని పరిస్థితుల్లో వీరు కూరగాయలు పండించుకునే చోటు ఎక్కడుంటుంది. కనుకనే వీరు కుల వృత్తిని కోల్పోయారు. గతంలో తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు చేరవేసేవారు. కూరగాయల మార్కెట్‌లో వీరు వ్యాపారులుగా కనిపిస్తుంటారు. మహిళలు మెంతి కూర పండించి కట్టలు కట్టి మార్కెట్‌ చేస్తుంటారు. వీరికి ఉండటానికే ఇళ్లులేని కారణంగా మెంతి కూరను రోడ్డు పక్కన కూడా పండిస్తారు. వీరి పెళ్ళిళ్లు, శుభకార్యాలన్నీ వీరి కమ్యూనిటీ హాలులోనే జరిపిస్తారు. ఆ హాలు, అందులో ఉపయోగించుకునే వంట పాత్రలు వంటి వాటికి అద్దె కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవారైన పప్పు, వైట్‌ రైస్‌తో సింపుల్‌గా పెళ్ళి జరిపిస్తారు. ఆ పప్పన్నం తృప్తిగా తిని వధూవరులను దీవించి వెళతారు. పెళ్లయిన తర్వాత రిసెప్షన్‌కు కమ్యూనిటీ హాలు మాత్రం ఇవ్వరు. యువత పెడదారి పట్టకుండా పెద్దలు వారిపై ఒక కన్నేసి ఉంచుతారు. పాతబస్తీలో ఈ కులం నుంచి ఒక్క రౌడీ లేడు. ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వీరు ఎక్కడున్నా ఐక్యంగా ఉండటంతోపాటు, సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి శాంతిని కోరుకుంటారు.

వినతులు

మార్చు

బి.సి-డి గ్రూప్‌ నుండి తమకులాన్ని బిసి-ఏ గ్రూప్‌లోకి మార్చాలి అని కోరుతున్నారు. తమ కులంలో వృద్ధ మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కనుక వారికి వృద్ధాశ్రమాలు నిర్మించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని కోరుతున్నారు. రాష్ర్టంలో కాచి జనాభా 3 లక్షలు.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=కాచి&oldid=3267263" నుండి వెలికితీశారు