కాటూరివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


కాటూరివారిపాలెం-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, పొదిలికి చెందిన ఒక రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం జిల్లా కేంద్రం ఒంగోలు నుండి 30 కి.మీ. దూరంలో ఉంది.

కాటూరివారిపాలెం
గ్రామం
పటం
కాటూరివారిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
కాటూరివారిపాలెం
కాటూరివారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°35′55.608″N 79°37′59.808″E / 15.59878000°N 79.63328000°E / 15.59878000; 79.63328000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంపొదిలి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08499 Edit this on Wikidata )
పిన్‌కోడ్523253

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీరామాలయం - ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 10 గంటలకు స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ, కల్యాణం అనంతరం, ఉచిత అన్నదానం కార్యక్రమం నివహించెదరు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.

గ్రామ విశేషాలు

మార్చు
  • ఈ గ్రామ సమీపంలో ఒంగోలు-నంద్యాల ప్రధాన రహదారి ఉంది.
  • ఈ గ్రామం మీదుగా నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం నిర్మాణానికి సర్వే నిర్వహించారు.
  • ఈ వూరికి చెందిన కాటూరి నారాయణ స్వామి (1922 - 2010) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఏనిదోవ లోకసభలో సభ్యునిగా. రైతు నాయకుడుగా సేవలు అందించారు.
  • ఈ వూరికి చెందిన శ్రీ పమిడి భానుచందర్, టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో 24-6-2013 నుడి 30-6-2013 వరకూ జరిగే ఆంతర్జాతీయ గ్లోబల్ పవర్ షిఫ్ట్ సదస్సుకు ఎన్నికయ్యారు. 135 దేశాల నుండి 500 మంది యువకులు ఎన్నికయ్యారు. మన దేశం నుండి ఎన్నికయిన 16 మందిలో ఈయనొకరు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న గణనీయ మార్పుల దృష్ట్యా, కాలుష్యకు నివారణ, ప్రత్యామ్నాయ వనరులు, విద్యుదుత్పత్తి వంటి అత్యవసర అంశాలపై భవిష్యత్తులో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఈ సదస్సులో ఈయన చర్చించెదరు.
  • 2,209 మంది జనాభా ఉన్న ఈ గ్రామస్తులందరూ బ్యాంక్ అకౌంట్లూ, రూ-పే కార్డులూ, సెల్-ఫోన్లూ ఏర్పాటుచేసుకొని, ఈ గ్రామాన్ని 100% నగదు రహిత లావాదేవీలు నిర్వంచే గ్రామంగా అభివృద్ధి చేసుకుని గ్రామానికి పేరు సంపాదించి పెట్టినారు. ఈ విధంగా ఈ గ్రామం, జిల్లాలోనే ఈ ఘనత సాధించిన రెండవ గ్రామంగానూ, రాష్ట్రంలో మూడవ గ్రామంగానూ వినుతికెక్కినది. కె.పల్లెపాలెం గ్రామం జిల్లాలో ప్రథమ స్థానం మరియూ రాష్ట్రంలో రెండవ గ్రామంగానూ రికార్డులకెక్కినది. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ గ్రామములో పాలసరఫరా వారూ, కిరాణా దుకాణాలూ వగైరాలలోనూ ఎలక్ట్రానిక్ పి.వో.ఎస్, యంత్రాలు ఉన్నాయి. గ్రామములో నగదు కొరకు క్యూ లైన్లు లేవు, నగదు లేక అవస్థలు లేవు. అసలు నగదుతో పనే లేదు. ఎరువులూ, పురుగుమందులూ గూడా నగదు రహితంగానే కొనుచున్నారు. ఈ పనికి కేంద్ర ప్రభుత్వం జన-ధన్ పథకంలో భాగంగా గ్రామీణ బ్యాంకు ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామ రచ్చబండ వద్ద వీరు గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామములోని విద్యావంతులుగూడా మిగతావారికి అవగాహన కల్పించారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు