కార్తీక మురళీధరన్

సినిమా నటి

కార్తీక మురళీధరన్ (జననం 1997, జనవరి 18) మలయాళ సినిమా నటి. తమిళ, తెలుగు సినిమాలలో కూడా నటించింది. 2017లో దుల్కర్ సల్మాన్‌ హీరోగా వచ్చిన కామ్రేడ్ ఇన్ అమెరికా అనే మలయాళ సినిమాలో తొలిసారిగా నటించింది.[2] ఆ తరువాత మమ్ముట్టితో కలిసి అంకుల్ అనే సినిమాలో నటించింది.[3][4] తిరువీర్ హీరోగా నటించిన తిరువీర్4 అనే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

కార్తీక మురళీధరన్
జననం (1997-01-18) 1997 జనవరి 18 (వయసు 27)
విద్యాసంస్థసృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీ
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2017 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • సి.కె. మురళీధరన్
  • మీనా నాయర్
బంధువులుఆకాష్ మురళీధన్ (సోదరుడు)[1]

జీవిత విశేషాలు

మార్చు

కార్తీక 1997, జనవరి 18న కేరళలోని కొట్టాయంలో జన్మించింది. ఈమె తండ్రి సికె మురళీధరన్ సినిమాటోగ్రాఫర్. సృష్టి స్కూల్ ఆఫ్ ఆర్ట్ డిజైన్ అండ్ టెక్నాలజీలో చదివింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2017 కామ్రేడ్ ఇన్ అమెరికా సారా మేరీ కురియన్ మలయాళం [5]
2018 అంకుల్ శృతి విజయన్ మలయాళం [6][7]
2023 సబా నాయకన్ దీప్తి/ఈషా తమిళం

మూలాలు

మార్చు
  1. "Siblings make debut: Karthika and Akash Muraleedharan". Retrieved 31 August 2018.
  2. "Dulquer Salmaan's heroine with Mammootty next". Retrieved 31 August 2018.
  3. "Karthika Muralidharan to play the heroine in Mammootty's Uncle". Retrieved 31 August 2018.
  4. "I want to be an actor, not a heroine- Karthika Muralidharan". newindianexpress. 20 February 2018.
  5. "The crossing". Retrieved 31 August 2018.
  6. "Mammootty's character in Uncle has shades of grey". Cinema Express. Retrieved 27 January 2018.
  7. "Mammootty's Uncle movie crew meet up in Kochi". Retrieved 31 August 2018.

బాహ్య లింకులు

మార్చు