కాళియుడు
కాళియుడు (కాళిందుడు) ద్వాపర యుగంలో బృందావనంలోని యమునా నదిలో నివసించిన విష నాగరాజు.[1] అతని చుట్టూ ఉన్న యమునా నది నీరు వేడిగా, విషంతో బుడగలుగా ఉండేది. ఏ పక్షిగాని, జంతువుగాని దాని దగ్గరకు వెళ్ళలేదు, నది ఒడ్డున ఒకేఒక కదంబ చెట్టు మాత్రమే పెరిగింది.
కాళియుడు | |
---|---|
అనుబంధం | నాగుపాము |
తల్లిదండ్రులు | కశ్యపుడు (తండ్రి) కద్రు (తల్లి) |
తోబుట్టువులు | ఆదిశేషుడు, వాసుకి, etc. |
పాఠ్యగ్రంథాలు | భాగవత పురాణం, హరివంశ పురాణం, మహాభారతం |
పండుగలు | నాగనృత్యం |
జననం
మార్చువిష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ కుమారుడైన కశ్యపుడికి నలుగురు భార్యలు. మూడవ భార్య కద్రువకు వేయి పాములకు జన్మించారు. వారిలో వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, కాళియుడు, పద్మ, మహాపాదుడు, శంఖుడు, పింగళుడు ప్రముఖులు. తల్లి కారణంగా నాగులకు ‘కద్రుజ’ అనే పేరు వచ్చింది.[2]
కథ
మార్చుశ్రీకృష్ణుడు, కాళిందుడి కథను భాగవత పురాణంలోని పదవ పర్వం, పదహారవ అధ్యాయంలో చెప్పబడింది.
కాళిందుడు రామక ద్వీపానికి చెందినవాడు. పాముల శత్రువైన గరుత్మంతుడుకు భయపడి అక్కడి నుండి తరిమివేయబడ్డాడు. గరుత్మంతుడు బృందావనం వద్దకి రావద్దని అక్కడ నివసించే యోగి సౌభారీ చేత శపించబడ్డాడు. కాబట్టి కాళిందుడు బృందావనంను తన నివాసంగా ఎంచుకున్నాడు. ఆశ్రమంలో ఉన్న దుర్వాసుడికి సేవలు చేయడానికి వెళ్ళిన రాధ, తిరుగు ప్రయాణంలో యమునా నది మీదుగా నడుస్తున్నప్పుడు నదిలోని పెద్ద పాముని చూసి భయపడింది. బృందావనంకు వెళ్ళిన రాధ, నదిలో ఒక పెద్ద పామును చూసినట్లు శ్రీకృష్ణుడికి, అక్కడి ప్రజలకు తెలియజేసింది. రాధని ఇబ్బంది పెట్టినందుకు కాళిందుడికి గుణపాఠం నేర్పాలకున్న శ్రీకృష్ణుడు, అతనిని వెతుకుతూ యమునా నదికి వెళ్ళాడు. కృష్ణుడిని చూసిన కాళిందుడు, కృష్ణుడి కాళ్ళ చుట్టూ చుట్టబడి అతనిని నిర్బంధించాడు. అది చూసిన యశోద పాముకు భయపడి కృష్ణుడిని తిరిగి రమ్మని ఆదేశించింది. ఇంతలో, కాళిందుడు తప్పించుకోవడానికి ప్రయత్నించగా కృష్ణుడు అతని తోకపై అడుగుపెట్టి, మళ్ళీ ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించాడు.
మరుసటి రోజు కృష్ణుడు, రాధ, తన స్నేహితులతో కలిసి యమున నది సమీపంలో బంతి ఆట ఆడుతున్నాడు. ఆ బంతి యమున నదిలో పడిపోయినపుడు, దాన్ని తీసుకురావడానికి రాధ వెళుతుండగా కృష్ణుడు ఆమెను ఆపి, తను యమనా నది దగ్గరికి వెళ్ళాడు. అప్పడు కాళిందుడు అతన్ని నిర్బంధించి యమున నదిలోకి లాక్కెళ్ళాడు. అది చూసి అక్కడి ప్రజలందరూ ఆందోళన చెంది, యమున నది ఒడ్డు వైపు పరుగెత్తారు. నది లోపల కృష్ణుడిని తన శరీరంతో చుట్టగా, కృష్ణుడు తన శరీరాన్ని విస్తరించడంతో కాళిందుడి శరీరం పగిలిపోయే పరిస్థితి వచ్చింది. దాంతో కాళిందుడు కృష్ణుడని వదిలివేశాడు. వెంటనే కృష్ణుడు తన అసలు రూపంలోకి వచ్చి, యమునను ఇకపై కలుషితం చేయకుండా పాములోని విషాన్ని తీసివేయడంకోసం కాళిందుడి తలపై ఎక్కి నృత్యం చేయడం ప్రారంభించాడు.
కాళిందుడి తలపైకి దూకిన కృష్ణుడు, విశ్వమంత బరువుతో అతని కాళ్ళతో కొట్టాడు. దాంతో రక్తం కక్కుతూ చనిపోయేస్థితిలో ఉన్న తన భర్తను చూసిన కాళిందుడు భార్యలు వచ్చి తమ భర్తను అనుగ్రహించమని కృష్ణుడిని వేడకున్నారు. కృష్ణుడి గొప్పతనాన్ని గ్రహించిన కాళిందుడు లొంగిపోయి, తాను మరలా ఎవరినీ వేధించనని వాగ్దానం చేశాడు. కృష్ణుడు కాళిందుడిని క్షమించి నదిని విడిచిపెట్టి రామనాక ద్వీపానికి వెళ్ళమని కోరి, అక్కడ కాళిందుడికి గరుత్మంతుడు ఇబ్బంది ఉండదని వాగ్దానం చేశాడు.[3]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, ఆధ్యాత్మికం (29 January 2019). "దివ్యచరణాలు". www.eenadu.net. Archived from the original on 30 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఫ్యామిలీ (15 July 2016). "నేడు వరల్డ్ స్నేక్ డే". Sakshi. Archived from the original on 28 May 2017. Retrieved 30 June 2020.
- ↑ ఆంధ్రభూమి, తెలంగాణ (10 January 2020). "నవనీతచోరునిగా, కాళీయమర్ధనుడిగా నరసింహుడు". www.andhrabhoomi.net. Archived from the original on 10 జనవరి 2020. Retrieved 30 June 2020.
ఇతర లంకెలు
మార్చు- Bhagavata Purana, Canto Ten, Chapter 16 The account of Krishna and Kaliya, as told in the Bhagavata Purana. (Full Sanskrit text online, with translation and commentary.)
- The Importance of Kaaleya Mardan - A comparative view of the knowledge of solar physics and biology among the modern scientists, among the ancient civilised nations, and among the early Sanskrit writers.
- Kalia Scheme Odisha 2019 New Kalia Scheme For Odisha Farmers 2019