కావేరి నది

దక్షిణ భారతదేశంలో నది
11°21′40″N 79°49′46″E / 11.36111°N 79.82944°E / 11.36111; 79.82944

కావేరి నది (Kaveri river) (కన్నడ: ಕಾವೇರಿ ನದಿ, తమిళం: காவேரி ஆறு) భారతదేశంలో ప్రధానమైన నదుల్లో ఒకటి. హిందువులు ఈ నదిని పవిత్ర నదుల్లో ఒకటిగా భావిస్తారు. దీని జన్మస్థానం కర్ణాటక, లోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలకావేరి అనే ప్రదేశం.

కావేరి
River
పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు వద్ద కావేరి
దేశం India
రాష్ర్టాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి
ఉపనదులు
 - ఎడమ హేమవతి నది, షింషా, అర్కవతి నది
 - కుడి కుబిని నది, భవానీ నది, నొయ్యల్, అమరావతి నది
Cities తలకావేరి, కుషల్‌నగర్, శ్రీరంగపట్టణం, భవానీ, ఈరోడ్, నమ్మక్కల్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్
Source తలకావేరి, కొడగు, పశ్చిమ కనుమలు
 - స్థలం కర్ణాటక, భారతదేశం
 - ఎత్తు 1,276 m (4,186 ft)
 - అక్షాంశరేఖాంశాలు 12°38′N 75°52′E / 12.633°N 75.867°E / 12.633; 75.867
Mouth కావేరీ డెల్టా
 - location బంగాళాఖాతం, భారతదేశం & భారతదేశం
 - ఎత్తు 0 m (0 ft)
 - coordinates 11°21′40″N 79°49′46″E / 11.36111°N 79.82944°E / 11.36111; 79.82944
పొడవు 765 km (475 mi)
పరివాహక ప్రాంతం 81,155 km2 (31,334 sq mi)
కావేరి బేసిన్ యొక్క పటం
శ్రీరంగ పట్నం వద్ద నిండుగా ప్రవహిస్తున్న కావేరీ నది

ఉపయోగాలు

మార్చు

కావేరి నదిలోని నీరు ముఖ్యంగా వ్యవసాయానికి, గృహావసరాలకు, విద్యుదుత్పత్తికీ ఉపయోగిస్తారు. నదిలోకి నీరు ముఖ్యంగా ఋతుపవనాల కారణంగా కలిగే వర్షాలవల్లనే లభిస్తుంది ఈ నదిపై నిర్మించబడిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్, మెట్టూర్ డ్యామ్, మొదలైనవి ఋతుపవనాల సమయంలో నీరు నిల్వచేసి వర్షాభావ పరిస్థితుల్లో విడుదల చేయబడుతాయి.u r

హిందూ మతంలో కావేరి ప్రాముఖ్యత

మార్చు

బ్రహ్మగిరి కొండల్లో నెలకొని ఉన్న, ఈ నది జన్మస్థానమైన తలకావేరి ఒక సుప్రసిద్ధ యాత్రా స్థలంగా ప్రసిద్ధి గాంచింది. తుల సంక్రమణం అనే ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొను వేలాది మంది భక్తులు ఇక్కడ గల మూడు దేవాలయాలను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ నీరు ఫౌంటెయిన్ లాగా ఎగజిమ్ముతూ ప్రవహిస్తుందని భక్తుల విశ్వాసం.

పరీవాహక ప్రాంతాలు

మార్చు

చందనం అడవులకు పేరు గాంచిన,, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకొనే కూర్గ్ ఈ నదీమతల్లి వరప్రసాదమే.శ్రీరంగ పట్టణం ఈనది ఒడ్డునే నెలకొని ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రములు శ్రీరంగం, కుంభకోణం ఈనది ఒడ్డునే నెలకొని ఉన్నాయి.. బృందావన్ గార్దెన్స్ ఈ నది వొడ్దు న ఉన్నాయి.

కావేరి జల వివాదం

మార్చు

ఈ నదీ జలాల వినియోగ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం నెలకొని ఉంది. తమిళనాడు రాష్ట్రం చాలాకాలంగా ఈ నదీ జలాలను విస్తారంగా వాడుకుంటుండగా, కర్ణాటక దీన్ని చారిత్రక తప్పిదంగా భావిస్తోంది. 2023 వ సంవత్సరం లో ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది.

బయటి లింకులు

మార్చు