కాశి 2018 లో విడుదలైన తెలుగు సినిమా. లెజెండ్ సినిమా, ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్ ఫాతిమా విజయ్‌ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి నిర్మించిన ఈ సినిమాకు కృతిక ఉదయనిధి దర్శకత్వం వహించింది. విజ‌య్ ఆంటోని, అంజలి, సునైనా, యోగి బాబు, జయప్రకాష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో కాళీ పేరుతో, తెలుగులో కాశి పేరుతో మే 18, 2018న విడుదలైంది.[1]

కాశి
దర్శకత్వంకృతిక ఉదయనిధి
రచనకృతిక ఉదయనిధి
నిర్మాతఫాతిమా విజయ్‌ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి
తారాగణంవిజ‌య్ ఆంటోని, అంజలి, సునయన, యోగి బాబు
ఛాయాగ్రహణంరిచర్డ్ ఎం.నాథన్
కూర్పులారెన్స్ కిశోరె
సంగీతంవిజ‌య్ ఆంటోని
నిర్మాణ
సంస్థ
విజ‌య్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
విడుదల తేదీ
మే 18, 2018 (2018-05-18)
సినిమా నిడివి
133 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

న్యూయార్క్‌లో డాక్టర్ భరత్ (విజయ్ ఆంటోనీ) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి గా గొప్ప జీవితాన్ని అనుభవించే డాక్టర్ భరత్ ఓ చిన్న బాబును ఎద్దు పొడిచినట్టుగా చిన్నతనం నుంచి ఓ కల వస్తుంటుంది. అయితే ఆ కల నిజామా..లేదా..అనే భ్రమలో ఉన్న భరత్ కి అమెరికాలో తనతో పాటు ఉన్న తల్లిదండ్రులు తన సొంత తల్లిదండ్రులు కారనే నిజం తెలుస్తుంది. తనను కన్న తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇండియాకు వస్తాడు. అలా కంచర్లపాలెం చేరుకున్న భరత్ కి ఆ ఊళ్ళో కొన్ని అనుకోని కథలు ఎదురవుతాయి. ఇంతకీ భరత్ తల్లిదండ్రులు ఎవరు ? అసలు భరత్‌ వారికి ఎలా దూరమయ్యాడు ? చివరికి భరత్ వాళ్ళ గురించి ఎలా తెలుసుకున్నాడు అనేది మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: లెజెండ్ సినిమా, ఆంటోని ఫిలిం కార్పోరేషన్ [4]
  • నిర్మాతలు: ఫాతిమా విజయ్‌ ఆంటోని, ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి [5]
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృతిగ ఉదయనిధి
  • సంగీతం: విజయ్ ఆంటోనీ
  • సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్
  • ఎడిటర్: లారెన్స్ కిషోర్
  • మాటలు: భాష్య శ్రీ

మూలాలు

మార్చు
  1. The Times of India. "Vijay Antony's 'Kasi' to release on May 18 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  2. Sakshi (18 May 2018). "'కాశి' మూవీ రివ్యూ". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  3. The Hans India (18 May 2018). "Vijay Antony's Kaasi Movie Review {1.75/5}" (in ఇంగ్లీష్). Archived from the original on 1 September 2021. Retrieved 1 September 2021.
  4. India Glitz (10 May 2018). "Legend Cinema to present Vijay Antony Kaasi". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  5. Sakshi (12 May 2018). "కాశీ ఏం చేశాడు?". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.