కిన్నెర ఒక ప్రముఖ తెలుగు సినిమా, టీవీ నటి,, కూచిపూడి నర్తకి. 80కి పైగా సినిమాల్లో నటించింది. నటిగా, సహ నటిగా ఎనిమిది టీవీ నంది అవార్డులు అందుకున్నది. అనేక వేదికలమీద నాలుగు వేలకి పైగా కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చింది.[1]

కిన్నెర
జననం
దేవి[1]

వృత్తినటి
జీవిత భాగస్వామిఎ. ఫణికుమార్
పిల్లలుజయసూర్య, జాబిలి
తల్లిదండ్రులు
  • సి. హెచ్. సత్యనారాయణ (తండ్రి)
  • లలితా రాణి (తల్లి)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె జన్మస్థలం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. రంగస్థల, సినీనటి లలితారాణి కుమార్తె ఈమె. కిన్నెర అసలు పేరు దేవి. ఈమె కూచిపూడి నాట్యకారిణి కూడా. భరతకళాప్రపూర్ణ కోరాడ నరసింహారావు వద్ద ఈమె నాట్యం నేర్చుకొనేవారు. తర్వాత వెంపటి చినసత్యంగారి నృత్యాలయంలో కూడా కొన్నాళ్లు నాట్యం నేర్చుకున్నారు. 2005వ సంవత్సరంలో కిన్నెరకు వివాహం జరిగింది. ఈమె భర్త పేరు ఎ.ఫణికుమార్‌. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌లో ఉద్యోగం. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు పేరు జయసూర్య, పాప పేరు జాబిలి.

సినిమారంగం

మార్చు

నటుడు పేకేటి శివరామ్ మిత్రులు, నిర్మాత పి.వి.రావు ఈమెను చలనచిత్రరంగానికి పరిచయం చేశారు. చిరంజీవితో రుస్తుం, దొంగ మొగుడు లాంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన నిర్మాత ఎస్.పి.వెంకన్నబాబు ఈమె పేరును "భలే మొగుడు" సినిమాతో కిన్నెరగా మార్చారు. దర్శకుడు వంశీ ప్రత్యేకంగా ఈమెను పిలిపించి చెట్టుకింద ప్లీడర్‌ చిత్రంలో హీరోయిన్‌గా కామెడీరోల్‌ చేయించారు. 1992లో బ్రహ్మానందం హీరోగా నటించిన బాబాయ్ హోటల్ లో కూడా కథానాయికగా నటించారు కిన్నెర.

టివిరంగం

మార్చు

టీవీ సీరియల్స్‌లో కూడా తనదైన శైలిలో నటించారు కిన్నెర. దూరదర్శన్‌లో ప్రసారమైన ఓ స్త్రీ సంకెళ్లు తెంచుకో, పువ్వు, కథానాయిక మొల్ల, ఈటీవీలో ప్రసారమైన విధి, అంతరంగాలు, శివరంజని లాంటి సీరియల్స్ అందులో ప్రముఖమైనవి.నటిగా, సహనటిగా ఎనిమిదిసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డులు అందుకున్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "నన్ను చూడగానే బ్యూటిఫుల్ అనేశారు." andhrajyothy.com. ఆంధ్రజ్యోతి. Archived from the original on 9 నవంబరు 2016. Retrieved 24 November 2016.