భలే మొగుడు 1987 లో విడుదలైన సినిమా. రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మహేశ్వరి మూవీస్ బ్యానర్‌లో ఎస్పీ వెంకన్న బాబు నిర్మించాడు.[1] ఇందులో రాజేంద్ర ప్రసాద్, రజని ప్రధాన పాత్రల్లో నటించారు. సత్యం సంగీతం సమకూర్చాడు.[2] ఈ చిత్రం ప్రముఖ టీవీ నటి కిన్నెర తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[3]

భలే మొగుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం ఎస్.పి. వెంకన్న బాబు
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
రజని ,
సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
సంభాషణలు సత్యానంద్
ఛాయాగ్రహణం శరత్
కూర్పు డి. రాజగోపాల్
నిర్మాణ సంస్థ మహేశ్వరి మూవీస్
భాష తెలుగు

కథసవరించు

రామకృష్ణ (రాజేంద్ర ప్రసాద్) ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్ ప్రతినిధిగా పనిచేస్తూంటాడు. అతను తన యాజమాని కోటేశ్వర రావు (సత్యనారాయణ) కు అత్యంత విశ్వసనీయ ఉద్యోగి. ఈ సంస్థను తన పనితనంతోతో శిఖరాగ్రానికి చేరుస్తాడు. రామకృష్ణ తండ్రి శంకరం (గొల్లపూడి మారుతీరావు), తల్లి పార్వతి (అన్నపూర్ణ), ఒక తమ్ముడు బాబ్జీ (సుభలేఖ సుధాకర్) ఉన్నారు. తండ్రి సోదరుడు సోమరులు కాబట్టి అతనే ఇంటికి సంపాదనాపరుడు. సంస్థకు ఉపయోగించిన తెలివినే కుటుంబాన్ని నడిపించడానికీ ఉపయోగిస్తూంటాడు. సంప్రదాయ ఆచారాలకు వ్యతిరేకంగా ఉండే కోటేశ్వర రావు కుమార్తె సీత (రజని), అబద్ధాలాడే మగవాళ్ళను ఇష్టపడదు. ఆమె భర్త కోసం పత్రికలో ప్రకటన ఇస్తుంది. కృష్ణ ఆ ఇంటర్వ్యూలో గెలుస్తానని తన స్నేహితులతో పందెం వేసి ఇంటర్వ్యూకు వెళ్తాడు.. కానీ సీతను చూసిన తరువాత అతను నిజంగా ఆమె ఎవరో తెలుసుకోకుండా ఆమె ప్రేమలో పడతాడు.

ఇక్కడ, కృష్ణ తానో కోటీశ్వరుణ్ణని అబద్ధం చెబుతాడు. సీత అది నమ్మి అతణ్ణి ప్రేమిస్తుంది. సీత కృష్ణను తన తండ్రికి పరిచయం చేస్తుంది. కోటేశ్వరరావు కృష్ణతో కూతురి పెళ్ళికి సంతోషంగా ఒప్పుకుంటాడు. వారి పెళ్ళి అయ్యే వరకు గోప్యతను కొనసాగించమని కృష్ణను కోరుతాడు. పెళ్ళి అయిన వెంటనే నిజం తెలిసి, సీత తన తండ్రిపైన, కృష్ణపైనా తిరుగుబాటు చేస్తుంది. ఆ తరువాత, ఆమె తన అత్తగారి ఇంటికి వెళుతుంది, అక్కడ ఆమె కృష్ణను తన పనులతో అవమానిస్తుంది. సీత వాస్తవంలో జీవిస్తూ, వాళ్ళిద్దరూ సుఖంగా జీవించడమే మిగతా కథ.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఎస్. పాట పేరు సాహిత్యం గాయకులు పొడవు
1 "అవునా ఊరించే" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, పి.సుశీల 4:36
2 "ఆడింధే ఆటా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్.జానకి 4:32
3 "ఆలుమగల దాంపత్యం" ఆచార్య ఆత్రేయ ఎస్పీ బాలు, పి.సుశీల 3:57
4 "వయసా నీకు తెలుసా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, పి.సుశీల 4:42
5 "చంపమంటారా" ఆచార్య ఆత్రేయ ఎస్పీ. బాలు, రమణ 4:01
6 "అమ్మ అబ్బా" సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:32

మూలాలుసవరించు

  1. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  2. Error on call to మూస:cite web: Parameters url and title must be specified
  3. Error on call to మూస:cite web: Parameters url and title must be specified