అసాధ్యులు

1992లో విడుదలైన తెలుగు సినిమా

అసాధ్యులు అనేది 1992లో విడుదలైన తెలుగు సినిమా. నియో ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై కెవి రావు నిర్మించిన ఈ సినిమాకు జోమోన్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, సురేష్, శోభన, నిరోషా నటించగా ఇళయరాజా సంగీతం అందించారు. డ్రీమ్ టీమ్ (1989) అనే ఆంగ్ల సినిమా నుండి ప్రేరణతో ఈ సినిమా రూపొందింది.

అసాధ్యులు
దర్శకత్వంజోమోన్
రచనసత్యానంద్ (మాటలు)
స్క్రీన్ ప్లేజోమోన్
కథకొడాలి
దీనిపై ఆధారితండ్రీమ్ టీమ్ (1989)
నిర్మాతకె.వి. రావు
సి. కళ్యాణ్ (సమర్పణ)
తారాగణంజగపతిబాబు
సురేష్
శోభన
నిరోషా
ఛాయాగ్రహణంజయరాం
కూర్పుహరి హర పుత్రన్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
నియో ఆర్ట్ క్రియేషన్స్[1]
విడుదల తేదీ
1992 (1992)
సినిమా నిడివి
118 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా సారాంశం

మార్చు

శ్రీధర్, ఆనంద్, డా. ప్రతాప్, వినోద్ మానసిక రోగులు. ప్రతి ఒక్కరికి వారి జీవితాన్ని కలిగి ఉన్న మానసిక వైద్య కేంద్రం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. డాక్టర్ వైజయంతి కొత్తగా నియమితులైన వైద్యురాలు ఆ నలుగురికి మంచి స్నేహితురాలు అవుతుంది. ఒకసారి, వైజయంతి తన హామీపై వారిని విహారయాత్రకు తీసుకువెళుతుంది. వారి తిరుగు ప్రయాణంలో, వైజయంతి ఒక ఎమ్మెల్యే చిదంబరం, అతని కుమారుడు జగపతి వారి అక్రమ కార్యకలాపాల రహస్యాల డైరీని కలిగి ఉన్న సీబీఐ అధికారిని చంపడం వైజయంతి చూస్తుంది. దురదృష్టవశాత్తు, డైరీ వైజయంతి చేతికి వెళుతుంది, ఇప్పుడు వారు ఆమెను కూడా చంపడానికి ప్రయత్నిస్తుడంగా ఆ నలుగురు పిచ్చివాళ్ళు తమ డాక్టర్‌ని ఎలా కాపాడుకున్నారు అనేది మిగతా కథ.

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
క్రమసంఖ్య పాట పేరు గాయకులు నిడివి
1 "చిటికేసి చప్పున ఆడు" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి 4:06
2 "అరె ఏమైందో లోలోనా" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 5:34
3 "కనపడే దారిలో" ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, ఎస్. జానకి 4:50

మూలాలు

మార్చు
  1. "Asadhyulu (Overview)". Youtube.