కె.ఎస్.నారాయణస్వామి

కొడువాయూర్ శివరామ అయ్యర్ నారాయణస్వామి(1914 – 1999) తంజావూరు శైలికి చెందిన వీణ విద్వాంసుడు.[1]

కె.ఎస్.నారాయణస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం(1914-09-27)1914 సెప్టెంబరు 27
పాలఘాట్, కేరళ
మరణం1999 (aged 84–85)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివీణ విద్వాంసుడు
వాయిద్యాలువీణ

విశేషాలు

మార్చు

ఇతడు కేరళ రాష్ట్రం, పాలక్కాడు జిల్లా, కొడువాయూరు గ్రామంలో 1914, సెప్టెంబరు 27వ తేదీన శివరామ అయ్యర్, నారాయణి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. ఇతడు కర్ణాటక సంగీతాన్ని తొలుత తన సోదరుడు కె.ఎస్.కృష్ణ అయ్యర్ వద్ద తన 7వ సంవత్సరం నుండి అభ్యసించాడు. తరువాత ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాలలో చేరాడు. అక్కడ మహమహులైన టి.ఎస్.సబేశ అయ్యర్, తంజావూరు పొన్నయ్య పిళ్ళై వంటి విద్వాంసుల వద్ద గాత్రం నేర్చుకున్నాడు. దేశమంగళం సుబ్రహ్మణ్యపిళ్ళై వద్ద వీణ, తంజావూరు పొన్నయ్య పిళ్ళై వద్ద మృదంగంలో తర్ఫీదు పొందాడు. 1937 నుండి 1946 వరకు ఇతడు తాను చదివిన సంగీత కళాశాలలోనే అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, అరుణాచల కవి మొదలైన వాగ్గేయకారుల కృతులను ప్రచురించడంలో తోడ్పడ్డాడు.[2]

తిరువాంకూరు మహారాజా ఆహ్వానంపై ఇతడు "స్వాతి తిరుణాళ్ సంగీత కళాశాల"లో వీణ నేర్పించే అధ్యాపకుడిగా చేరాడు.[3] అక్కడ ప్రధానాచార్యుడు సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌తో కలిసి స్వాతి తిరునాళ్ కృతులను పరిష్కరించి ప్రచురించాడు.[1][4][5] ఇతడు అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నాడు. రష్యా, తూర్పు ఐరోపా దేశాలలో 1954లో పర్యటించిన భారత సంగీత, సాంస్కృతిక బృందంలో ఒక సభ్యుడిగా ప్రభుత్వం తరఫున వెళ్ళాడు. 1970లో అంతర్జాతీయ వయోలిన్ విద్వాంసుడు యెహూది మెనూహిన్ ఆహ్వానంపై ఇతడు "బాత్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్"కు హాజరయ్యాడు. ఆ పర్యటనలో ఇతడు లండన్, బ్రిస్టల్, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, బర్మింగ్‌హాం నగరాలలో వీణ కచేరీలు చేశాడు. సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ తరువాత ఆ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది 1970లో రిటైర్ అయ్యాడు.[2]

1970లో ముంబైలోని షణ్ముఖానంద లలితకళలు & సంగీత సభకు చెందిన సంగీత విద్యాలయానికి ప్రిన్సిపాల్‌గా చేరి అక్కడి విద్యార్థులకు 1985 వరకు వీణా వాదనను, గాత్ర సంగీతాన్ని నేర్పించాడు.[1][2][3] 1974లో ఆస్ట్రేలియా పెర్త్‌లో జరిగిన ఇంటర్నేషనల్ సోసైటీ ఆఫ్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ 11వ సదస్సుకు కర్ణాటక సంగీత ప్రతినిధిగా హాజరయ్యాడు. 1977లో బెర్లిన్‌లో జరిగిన భారతీయ సంగీత నృత్యోత్సవాలలో పాల్గొన్నాడు.[2]

పురస్కారాలు

మార్చు

ఇతడు అనేక పురస్కారాలను, సత్కారాలను పొందాడు.

వాటిలో ముఖ్యమైన కొన్ని పురస్కారాలు:

శిష్యులు

మార్చు

ఇతని వద్ద సంగీతం నేర్చుకున్న వందలాది శిష్యులలో రుక్మిణీ గోపాలకృష్ణన్,[9][10] కళ్యాణీ శర్మ,[1] సరస్వతి రాజగోపాలన్,[11] త్రివేండ్రం వెంకటరామన్,[12] అశ్వతి తిరునాళ్ రామవర్మ,[13] గీతా రాజ,[3] నిర్మలా పార్థసారథి,[14] జయశ్రీ అరవింద్, అరుణా సాయిరాం[15] మొదలైన వారున్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Homage to a 'Guru' Archived 2002-01-22 at the Wayback Machine, The Hindu, 21 August 2001
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 Kalyani Sharma, Tribute to Sangeetha Kalanidhi Sri K.S. Narayanaswamy- 101 Keerthana Mani Malai, 2nd Edition (April 2006), compiled and published by Kalyani Sharma
  3. 3.0 3.1 3.2 "Geetha Raja on her Gurus". Archived from the original on 2018-04-07. Retrieved 2021-03-24.
  4. The Navaratri Mandapam experience Archived 18 ఏప్రిల్ 2011 at the Wayback Machine, The Hindu, 29 November 1998
  5. Semmangudi looks back - at 90 Archived 2012-11-09 at the Wayback Machine, Interview of Semmangudi Srinivasa Iyer with the Frontline magazine, Vol. 15, Issue 22, 24 October – 6 November 1998
  6. List of Sangeet Natak Akademi Awards Archived 17 ఫిబ్రవరి 2012 at the Wayback Machine from Sangeet Natak Akademi, India (www.sangeetnatak.org)
  7. List of Padma Bhushan Awardees from 1954 to 2009 Archived 10 మే 2013 at the Wayback Machine from Ministry of Home Affairs, India (www.mha.nic.in)
  8. List of Sangeetha Kalanidhi Awardees Archived 30 డిసెంబరు 2012 at the Wayback Machine from Madras Music Academy (www.musicacademymadras.in)
  9. Notes of excellence Archived 2011-06-06 at the Wayback Machine, The Hindu: Entertainment Thiruvananthapuram, 1 April 2005
  10. To honour a teacher Archived 2007-11-27 at the Wayback Machine, Friday Review Thiruvananthapuram, 21 July 2006
  11. [1], The Hindu: Arts, 15 October 2013
  12. Rare artistic acumen, The Hindu: Arts, 21 January 2010
  13. A royal love for music Archived 2011-06-06 at the Wayback Machine, The Hindu: Metro Plus Kochi, 3 January 2009
  14. Rising like the Thanjavur gopuram Archived 2007-03-11 at the Wayback Machine, Friday Review, The Hindu, 9 March 2007
  15. itcsra.org, (2014). Artist of the month. [online] Available at: http://www.itcsra.org/aom/artist_ofthe_month.asp [Accessed 27 October 2014].

బయటి లింకులు

మార్చు