అరుణా సాయిరాం
అరుణా సాయిరాం ఒక భారతీయ శాస్త్రీయ గాత్ర విద్వాంసురాలు. ఈమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈమె కేంద్ర సంగీత నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యింది.[2]ఈమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగే "బి.బి.సి.ప్రొమ్స్"లో ప్రదర్శన ఇచ్చిన మొట్టమొదటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. అలాగే ఇజ్రాయేల్‌లో జరిగే "జెరూసలేం ఔద్ ఫెస్టివల్"లో పాల్గొన్న మొట్టమొదటి కర్ణాటక సంగీత విద్వాంసురాలు కూడా.
అరుణా సాయిరాం | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | [1] బొంబాయి, మహారాష్ట్ర, భారతదేశం | 1952 అక్టోబరు 30
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | ఉపాధ్యక్షురాలు కేంద్ర సంగీత నాటక అకాడమీ, గాత్ర విద్వాంసురాలు |
వెబ్సైటు | వెబ్సైటు : అరుణా సాయిరాం |
ఆరంభ జీవితం
మార్చుఈమె 1952, అక్టోబర్ 30న ముంబైలో ఒక తమిళ సంగీత కుటుంబంలో రాజలక్ష్మి, సేతురామన్ దంపతులకు జన్మించింది. ఈమె తల్లి "అలత్తూర్ బ్రదర్స్", "తంజావూర్ శంకర్ అయ్యర్"ల శిష్యురాలు. అరుణ తన తల్లి వద్దనే ప్రాథమిక సంగీత పాఠాలు నేర్చింది.[3][4][5] ఈమె తండ్రి సేతురామన్ [6][7]మంచి సంగీత రసజ్ఞుడు. తన ఇంట్లో సంగీత,నృత్య కళాకారులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. అలా ఆతిథ్యం పొందిన టి.బృంద వద్ద ఈమె "వీణ ధనమ్మాళ్" సాంప్రదాయంలో సంగీతాన్ని నేర్చింది.[8][9][10] [11][12] భారతీయ మహిళా వాణిజ్యవేత్త, పెప్సికో ముఖ్య కార్య నిర్వహణాధికారి ఇంద్రా నూయి ఈమె మేనకోడలు.[13]
ఈమె తన 8వ యేట ముంబైలో జరిగిన ఒక సంగీత పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. తన 14వ యేట తొలిసారిగా పూర్తిస్థాయి కచేరీ చేసింది. 21వ యేట మద్రాసు సంగీత అకాడమీ వార్షిక ఉత్సవాలలో యంగ్ మ్యుజీషియన్ అవార్డును పొందిది.
ఈమె కర్ణాటక శాస్త్రీయ సంగీతంపై సినిమా, పాశ్చాత్య, హిందుస్తానీ సంగీతాల ప్రభావం పడింది.[14] ఈమె కర్ణాటక సంగీత సంప్రదాయాలను కొససాగిస్తూనే కచేరీల నిర్వహణలో కొత్తకొత్త పుంతలు తొక్కింది.[15]
శిక్షణ
మార్చుఈమె టి.బృంద[16][9][17][18][19] వద్ద వీణ ధనమ్మాళ్ బాణీని, ఎస్.రామచంద్రన్ [20] వద్ద చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై బాణీని, ఎ.ఎస్.మణి వద్ద రాగాలాపనను, టి.ఆర్.సుబ్రహ్మణ్యం[21][22][23] వద్ద రాగం, తానం, పల్లవులలో ఆశువుగా స్వరకల్పన చేసి పాడటం, కె.ఎస్.నారాయణస్వామి[24] వద్ద గమకాలను నేర్చుకుంది.
అంతే కాక ఈమె జర్మన్ కళాకారుడు యూజిన్ రాబిన్,[25] మంగళంపల్లి బాలమురళీకృష్ణ, [24] న్యూయార్క్ కళాకారుడు డేవిడ్ జోన్స్[26]ల వద్ద సలహాలు, సూచనలు పొందింది.
వృత్తి
మార్చుఈమె భారత రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల స్మారక స్థలమైన వీర్‌భూమి వద్ద తన సంగీత కచేరీలు చేసింది.[27] ఈమె చెన్నైలోని మద్రాసు సంగీత అకాడమీ,[28] ముంబై లోని ది నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఢిల్లీ లోని సిరి ఫోర్ట్ ఆడిటోరియం, కోల్‌కాతాలోని సంగీత్ రీసెర్చ్ అకాడమీ[29]లతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో తన ప్రదర్శనలను ఇచ్చింది.
ఈమె జర్మన్ మ్యూజిక్ కన్సర్వేటరీ లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేసి అక్కడ దక్షిణ భారతీయ సంగీతాన్ని బోధించింది.
ఈమె లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగే "బి.బి.సి.ప్రొమ్స్"లో ప్రదర్శన ఇచ్చింది. మొట్టమొదటి కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు.[30][31]ఈమె ఆ సమ్మేళనపు 116 యేళ్ళ చరిత్రలో మొట్టమొదటి సారి కచేరీ చేసిన భారతీయ గాత్ర సంగీత విద్వాంసురాలిగా ఘనతను సాధించింది. ఈమె న్యూయార్క్‌లోని కార్నెగీ హాల్‌లో, ప్యారిస్‌లోని థియేటర్ డి లా విల్లే[32][33]మొరాకోలోని ఫెస్టివల్ ఆర్ వరల్డ్ సేక్రెడ్ మ్యూజిక్[24][34]లో తన ప్రదర్శనలు ఇచ్చింది.
ఈమె శంకర్ మహదేవన్ [35][36] ఉప్పలపు శ్రీనివాస్ [37][38][39] నీలా భగవత్, జయంతి కుమరేష్,[40] రామ్ సంపత్,[41] సుధా రంగనాథన్,[42] జాకిర్ హుసేన్,[43] రోనూ మజుందార్, హరిచరణ్[44] వంటి భారతీయ గాయకులతో పాటు డామినిక్ వెల్లార్డ్[45][46] మైకేల్ రీమన్[47]• Christian Bollman [47]నౌరుద్దీన్ తాహిరి,[48] జెస్సీ బానిస్టర్[49] వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి పాడింది.
As of 2019[update], ఈమె 60కి పైగా రికార్డులను వెలువరించింది.[50] వాటిలో కర్ణాటక శాస్త్రీయ గీతాలు, వివిధ ఇతివృత్తాలతో పాడిన పాటలు, పాల్గొన్న కచేరీల రికార్డులు, జర్మన్, ఫ్రెంచి, మొరాకో కళాకారులతో కలసి పాల్గొన్న సంగీతం ఉన్నాయి.ఈమె లలితా సహస్ర నామాలతో "అరుణ: థౌజండ్ నేమ్స్ ఆఫ్ ద డివైన్ మదర్" అనే పేరుతో ఒక ఆల్బమ్ వెలువరించింది.[50]
ఈమె వివిధ ప్రాజెక్టుల క్రింద విదేశాలలోని విద్యార్థులకు సంగీతాన్ని నేర్పింది. వారిలో భారతీయ సంతతికి చెందిన వీణా వాదకుడు హరి శివనేశన్, ఫ్రెంచి గాయకుడు మార్కో హోవర్ట్ మొదలైన వారున్నారు.
ఈమె తన భర్తతో కలిసి "నాదయోగం ట్రస్ట్"ను స్థాపించింది. ఈ ట్రస్ట్ ద్వారా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాన్ని, వాద్య పరికరాలను అందిస్తున్నది. యువ కళాకారులకు అవకాశాలను కల్పిస్తున్నది. అంతే కాక ఈ ట్రస్టు సంగీత పాఠ్యాంశాలను, రికార్డులను భద్రపరుస్తున్నది.[26][51]
ఆమె 2022లో విడుదలైన ‘అంటే సుందరానికి’ సినిమాలో తొలిసారి తెలుగులో ఒక పాట పాడింది.[52]
అవార్డులు, గుర్తింపులు
మార్చుఈమెకు అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి.
- 2018లో మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి పురస్కారం.[53]
- 2015లో కేంద్ర సంగీత నాటక అకాడమీకి ఉపాధ్యక్షురాలిగా నియామకం.[54]
- 2014లో సంగీత నాటక అకాడమీ అవార్డు[55]
- 2015లో బెంగళూరు దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం వారిచే భారతీ త్యాగరాజ సమ్మాన్.[56]
- 2015లో రాజలక్ష్మి ఫైన్ ఆర్ట్స్, చెన్నై వారిచే "ఇసై మణిమకుటం" అవార్డు.[57]
- 2014లో ఆర్ష విద్యా గురుకులం, కొయంబత్తూరు వారిచే "ఆర్ష కళా భూషణం"[58]
- 2013లో సర్ రాజా అన్నామలై చెట్టియార్ మెమోరియల్ ట్రస్ట్ వారిచే "రాజా సర్ అన్నామలై చెట్టియార్ అవార్డు"[59]
- 2012లో పి.ఓబుల్‌రెడ్డి & పి.జ్ఞాంబాళ్ అవార్డు.[60]
- 2012లో ఇందిరా శివశైలం ఎండోమెంట్ అవార్డు.[61]
- 2012లో మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ Sangita Kala Nipuna by Mylapore Fine Arts Club, Chennai, 2012[62]
- 2011లో అంబత్తూర్ రోటరీ క్లబ్ వారిచే సేక్ ఆఫ్ ఆనర్ అవార్డు[63]
- 2009లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం[64]
- 2008లో యు.ఎస్. కాంగ్రెస్ ప్రొకమేషన్ ఆఫ్ ఎక్సలెన్స్[24]
- 2008లో బ్రహ్మగాన సభ చే "గాన పద్మం"[65]
- 2006లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" వారిచే కళైమామణి పురస్కారం[66]
- 2006లో తమిళనాడు ప్రభుత్వంచే "ఇసై సెల్వం"[67]
- 2006లో శ్రీకృష్ణ గానసభ వారిచే "సంగీత చూడామణి"[68]
- తమిళనాడు ముఖ్యమంత్రి ద్వారా తమిళనాడు సాంస్కృతిక శాఖకు సలహాదారుగా నియామకం.[69]
మూలాలు
మార్చు- ↑ "Aruna Sairam". Sangeet Natak Akademi. Archived from the original on 14 నవంబరు 2018. Retrieved 7 May 2020.
- ↑ "The Hindu: Entertainment Delhi / Music : Song of the soul". Chennai, India: Hindu.com. 17 February 2006. Archived from the original on 13 సెప్టెంబరు 2006. Retrieved 30 September 2010.
- ↑ "The Hindu: Entertainment Delhi / Music : Song of the soul". Chennai, India: Hindu.com. 2006-02-17. Retrieved 2010-09-30.
- ↑ "Reinvention of an artist". The Hindu. 27 October 2014.
- ↑ Mohan, R. (27 October 2014). "The melody of classical notes". buzzintown.com. Archived from the original on 23 September 2015.
- ↑ Venkatraman, L. (27 October 2014). "Face-To-Face". sabhash.com. Archived from the original on 20 జూన్ 2021. Retrieved 27 ఫిబ్రవరి 2021.
- ↑ Rajan, Anjana (27 October 2014). "Her own zone". The Hindu.
- ↑ Padmanabhan, G. (27 October 2014). "In tune with creativity". The Hindu.
- ↑ 9.0 9.1 Ramesh, D. (27 October 2014). "Her voice cuts across frontiers". Deccan Chronicle. Archived from the original on 22 September 2014.
- ↑ Jagannathan, S. (27 October 2014). "Aruna Sairam, a listeners' artiste". carnaticdarbar.com. Archived from the original on 27 March 2019. Retrieved 27 October 2014.
- ↑ "Artist of the month". itcsra.org. 27 October 2014.
- ↑ Ganesh, D. (27 October 2014). "Echoing voices within". The Hindu.
- ↑ "TN remembers PepsiCo's 'Iron woman'". Hindustan Times (in ఇంగ్లీష్). 2006-08-17. Retrieved 2020-08-08.
- ↑ Rodricks, Allan Moses (2018-03-27). "A seamless blend of Carnatic, Hindustani and contemporary jazz music". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-07.
- ↑ Rajan, Anjana (2010-10-14). "Her own zone". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-01-07.
- ↑ Padmanabhan, G. (2011). In tune with creativity. The Hindu. [online] Available at: http://www.thehindu.com/features/friday-review/music/in-tune-with-creativity/article2503172.ece [Accessed 27 October 2014].
- ↑ Jagannathan, S. (2012). Aruna Sairam, a listeners' artiste. carnaticdarbar.com. [online] Available at: http://www.carnaticdarbar.com/review/2012/review_125.asp Archived 27 మార్చి 2019 at the Wayback Machine [Accessed 27 October 2014].
- ↑ Balasubramanian, V. (2012). Bhavam ruled. The Hindu. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/bhavam-ruled/article4172389.ece [Accessed 27 October 2014].
- ↑ Ramani, V. (2014). Sailing from one raga to the next. The Hindu. [online] Available at: http://www.thehindu.com/features/friday-review/music/sailing-from-one-raga-to-the-next/article6485219.ece [Accessed 27 October 2014].
- ↑ The Hindu, (2009). Reinvention of an artist. [online] Available at: http://www.thehindu.com/features/friday-review/music/article69922.ece [Accessed 27 October 2014].
- ↑ "The Hindu: Friday Review Chennai / Events : Odyssey of a musician". Chennai, India: Hindu.com. 17 October 2008. Archived from the original on 21 అక్టోబరు 2008. Retrieved 30 September 2010.
- ↑ Ramnarayan, G. (2010). Soaring songs. The Hindu. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/soaring-songs/article904263.ece [Accessed 27 October 2014].
- ↑ Ramnarayan, G. (2010). Eclectic range. The Hindu. [online] Available at: http://www.thehindu.com/features/friday-review/music/eclectic-range/article870898.ece [Accessed 27 October 2014].
- ↑ 24.0 24.1 24.2 24.3 itcsra.org, (2014). Artist of the month. [online] Available at: http://www.itcsra.org/aom/artist_ofthe_month.asp [Accessed 27 October 2014].
- ↑ The Times of India, (2012). Seeking the right tone. [online] Available at: http://timesofindia.indiatimes.com/city/chennai/Seeking-the-right-tone/articleshow/17749659.cms [Accessed 30 October 2014].
- ↑ 26.0 26.1 Rajan, A. (2014). Quest for the best. The Hindu. [online] Available at: http://www.thehindu.com/features/friday-review/music/quest-for-the-best/article5922104.ece [Accessed 27 October 2014].
- ↑ Swaminathan, C. (2014). A new season of promise. The Hindu. [online] Available at: http://www.thehindu.com/features/metroplus/a-new-season-of-promise/article6001381.ece [Accessed 27 October 2014].
- ↑ The Times of India, (2011). Let The Music Play. [online] Available at: http://epaper.timesofindia.com/Repository/ml.asp?Ref=VE9JQ0gvMjAxMS8xMS8zMCNBcjAyMzAw Archived 27 మార్చి 2019 at the Wayback Machine [Accessed 30 October 2014].
- ↑ narthaki.com, (2010). Performance par excellence. [online] Available at: http://www.narthaki.com/info/rev10/rev857.html [Accessed 27 October 2014].
- ↑ The Times of India, (2011). Carnatic music to debut in BBC Prom. [online] Available at: http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=pastissues2&BaseHref=TOICH/2011/07/23&PageLabel=10&EntityId=Ar01002&ViewMode=HTML [Accessed 30 October 2014].
- ↑ The Times of India The Crest Edition, (2011). The voice that rocked Albert Hall. [online] Available at: http://www.timescrest.com/culture/the-voice-that-rocked-albert-hall-5968 Archived 28 అక్టోబరు 2014 at the Wayback Machine [Accessed 27 October 2014]
- ↑ sabhash.com, (2012). Face to Face. [online] Available at: http://www.sabhash.com/music/face-to-face/8/aruna-sairam---by-lakshmi-venkatraman.htm Archived 2021-06-20 at the Wayback Machine [Accessed 30 October 2014].
- ↑ The Hindu, (2008). Top U.S. honours for Aruna Sairam. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/article1435391.ece [Accessed 27 October 2014].
- ↑ Ramnarayan, G. (2010). Soaring songs. The Hindu. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/soaring-songs/article904263.ece [Accessed 30 October 2014].
- ↑ Swaminathan, G. (2010-10-07). "Meeting of minds". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ Kumar, Divya (2010-09-23). "An ode to India". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ SAIRAM, ARUNA. "U Srinivas: an artiste who put Carnatic on the world map". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-05-22.
- ↑ Rao, V. Prabhakar (2016-03-17). "Voice and instrument merge seamlessly". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ "Aruna Sairam to light up Margazhi with Raghavendra Rao, Thiruvarur Vaidyanathan and SV Ramani". www.indulgexpress.com. Retrieved 2020-05-22.
- ↑ "London Gears Up for Darbar Fest | International Newspaper From London" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-22.[permanent dead link]
- ↑ "Striking The Right Chords". The Indian Express (in ఇంగ్లీష్). 2013-07-05. Retrieved 2020-05-22.
- ↑ Swaminathan, G. (2017-03-30). "Aruna Sairam and Sudha Ragunathan: a confluence of styles". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ "Legendary Carnatic singer Aruna Sairam and sarod virtuoso Soumik Datta to collaborate". www.radioandmusic.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-22.
- ↑ "An Inclusive Journey of Music – Culturama" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-08-09. Retrieved 2020-05-22.
- ↑ Ramani, V. v (2018-02-01). "Collaboration revived". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ Nagarajan, Saraswathy (2018-02-08). "Carnatic music meets Gregorian chants". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-05-22.
- ↑ 47.0 47.1 Christian Bollmann, Aruna Sayeeram & Michael Reimann - Kaljani (in ఇంగ్లీష్), retrieved 2020-05-22
- ↑ "TRIALOGUE A project around South Indian, Moroccan and European medieval traditions. Aruna Saïram, Noureddine Tahiri, Dominique Vellard". www.glossamusic.com. Retrieved 2020-05-22.
- ↑ Mohanam by Aruna Sairam and Jesse Bannister (in ఇంగ్లీష్), retrieved 2020-05-22
- ↑ 50.0 50.1 "Welcome to Aruna Sairam Offical Site |Aruna Sairam Albums". www.arunasairam.org. Retrieved 2023-02-19.
- ↑ "Book on Vainika T Brinda released". The New Indian Express. Retrieved 2023-02-19.
- ↑ Andhra Jyothy (12 June 2022). "సంగీత కళాకారులకు శ్రద్ధ సబూరి ముఖ్యం" (in ఇంగ్లీష్). Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ "Sangita Kalanidhi award for Aruna Sairam".
- ↑ "sangeetnatak.gov.in". sangeetnatak.gov.in. Archived from the original on 25 January 2016. Retrieved 11 February 2016.
- ↑ The Hindu, (2014). President presents Sangeet Natak Akademi awards. [online] Available at: http://www.thehindu.com/news/national/president-presents-sangeet-natak-akademi-awards/article5903355.ece [Accessed 27 October 2014].
- ↑ "'www.pocketnewsalert.com". pocketnewsalert.com. Archived from the original on 22 August 2015. Retrieved 11 February 2016.
- ↑ "The Hindu: Entertainment Chennai / Medley of art forms". Chennai, India: Hindu.com. 10 September 2015.[permanent dead link]
- ↑ "The Hindu: Entertainment Coimbatore / Non-violence should be practised to avoid conflicts: Swami Dayananda Saraswati". Coimbatore, India: Hindu.com. 17 November 2014.
- ↑ The Times of India, (2013). Cultural and the Carnatic. [online] Available at: http://epaper.timesofindia.com/Default/Scripting/ArticleWin.asp?From=Archive&Source=Page&Skin=TOINEW&BaseHref=TOICH/2013/10/01&PageLabel=7&EntityId=Pc00712&ViewMode=HTML [Accessed 27 October 2014].
- ↑ "The New Indian Express: Entertainment Chennai / Bhavan's cultural festival". Chennai, India: newindianexpress.com. 24 November 2012. Archived from the original on 15 ఫిబ్రవరి 2016. Retrieved 27 ఫిబ్రవరి 2021.
- ↑ "The Hindu: Entertainment Chennai / Indira Sivasailam Endowment award for Aruna Sairam". Chennai, India: Hindu.com. 1 September 2012.
- ↑ "The Hindu: Entertainment Chennai / Mylapore Fine Arts Club 60 years young". Chennai, India: Hindu.com. 11 December 2011.
- ↑ "The Hindu: Entertainment Chennai / For the Sake of Honour Award given". Chennai, India: Hindu.com. 18 December 2011.
- ↑ "Jayakanthan, Vivekh, Aruna Sairam among Padma awardees". The Times of India. 26 January 2009. Archived from the original on 7 జూలై 2012. Retrieved 22 January 2012.
- ↑ "'www.narthaki.com". narthaki.com. Archived from the original on 4 March 2016.
- ↑ The Hindu, (2006). Kalaimamani awards for 123 artists. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/kalaimamani-awards-for-123-artists/article3183730.ece [Accessed 27 October 2014].
- ↑ "The Hindu: Entertainment Chennai / Muthamizh Peravai awards presented". Chennai, India: Hindu.com. 15 February 2006.
- ↑ The Hindu, (2006). Music festival begins. [online] Available at: http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/music-festival-begins/article3086346.ece [Accessed 27 October 2014].
- ↑ "Aruna Sairam to light up Margazhi with Raghavendra Rao, Thiruvarur Vaidyanathan and SV Ramani".