కె.కొత్తపాలెం (మోపిదేవి)
కె.కొత్తపాలెం కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం పూర్తి పేరు కొక్కిలిగడ్డ కొత్తపాలెం.సముద్రమట్టానికి 6 మీ.ఎత్తులో ఉంది
కె.కొత్తపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°05′19″N 80°53′44″E / 16.088747°N 80.895679°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | మోపిదేవి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 125 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుమోపిదేవి, ఆనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ.దూరంలో ఉంది
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చుఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-17వతేదీనాడు నిర్వహించెదరు. [6]
2017,ఏప్రిల్-17న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి సబ్‌జూనియర్ కబడ్డీ పోటీలలో, ఆంధ్రప్రదేశ్‌నుండి పాల్గొనే జట్టులో, ఈ పాఠశాలకు చెందిన సుకన్య అను విద్యార్థిని ఎంపికైనది. ఇటీవల ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించిన ఈ బాలిక, జాతీయస్థాయి పోటీఅలలో పాల్గొనుటకు అర్హత సంపాదించింది. [12]
మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల
మార్చుఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చి-26వ తేదీనాడు నిర్వహించారు. [7]
గ్రామములో మౌలిక వసతులు
మార్చుగ్రామంలోని త్రాగునీటి పథకం:- ఆర్. వో. ప్లాంట్.సామాజిక భవనం:- ఈ గ్రామంలో "మత్తి శ్రీరాములు, మత్తి వెంకటరామారావు" పేరుతో, రు. 30 లక్షల వ్యయంతో నిర్మించిన సువిశాలమైన సామాజిక భనాన్ని, 2014,డిసెంబరు-2వ తేదీనాడు ప్రారంభించారు. [4]
గ్రామ పంచాయతీ
మార్చుఉత్తరపాలెం, కె.కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
2013 జూలైలో కె.కొత్తపాలెం గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చందన సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనాడు. [3]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం
మార్చుగ్రామంలో కృష్ణా నదీతీరాన ఈ ఆలయం ఉంది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ దేవస్థాన ట్రస్టు బోర్డు 2 సంవత్సరములకొకసారి ఏర్పడును. ఇక్కడ ధనుర్మాస పూజలు బాగుగా చేయుదురు. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసం (మే నెల) లో, 4 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [2]
2016,ఆగస్టు-12న మొదలగు కృష్ణా నది పుష్కరాల సందర్భంగా, ఈ ఆలయాన్ని ఆరు లక్షల రూపాయల పుష్కర నిధులతో అభివృద్ధిచేసారు. ఆలయం చుట్టూ ప్రధక్షిణల కొరకు ఒక చప్టా నిర్మించారు. టైల్స్ అతికించారు. ముఖమండపాన్ని రంగులతో తీర్చిదిద్దినారు. స్లాబ్ మరమ్మత్తులతోపాటు అన్ని పనులూ పూర్తి అయినవి. [10]
శ్రీ మామిళ్ళ అమ్మవారి ఆలయం
మార్చుఈ గ్రామంలో శ్రీ మామిళ్ళ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠాపన, నూతన పోతురాజుశిలల ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని, 2013 అక్టోబరు 27 ఆదివారన్నాడు, మత్తి వంశస్థులు, గ్రామ ప్రజల ఆనందోత్సాహాల మధ్య, నిర్వహించారు. [1]
శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయం
మార్చుఈ గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ఈ ఆలయ నిర్మాణానికి, భూమిపూజ నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి ఎలాటి ఆటంకాలు కలుగకుండా, వాస్తుదోష హోమం, గణపతిపూజ, పుణ్యాహవచనం, లక్ష్మీగణపతి హోమాలను ఘనంగా నిర్వహించారు. [5]
శ్రీ దుర్గా కోటేశ్వరస్వామివారి ఆలయం
మార్చుఈ గ్రామములో కృష్ణా కరకట్టపై, ఒక కోటి రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2017,ఫిబ్రవరి-20వతేదీ సోమవారం నుండి 24వ తెదీ శుక్రవారం వరకు నిర్వహించారు. ప్రతిష్ఠించనున్న శ్రీ గణపతి, శ్రీ దుర్గా, శ్రీ కోటేశ్వరస్వామి, నందీశ్వరుడు, నవగ్రహ దేవతా విగ్రహాలకు, తొలిరోజైన, 20వతేదీ సోమవారంనాడు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. నూతన ఆలయంలో, సోమవారంనాడు, పూజలు ప్రారంభించారు. ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు, 21వతేదీ మంగళవారంనాడు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. పలు ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 22వతేదీ బుధవారంనాడు, ఉదయం 10-26 కి శ్రీ దుర్గా, కోటేశ్వరస్వామివారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. [13]
నూతనంగా ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని స్వామివారికి, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు (మహాశివరాత్రి ముందురోజున) కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆలయంలో 24వతేదీ శుక్రవారం రాత్రి, దాతల సహకారంతో స్వామివారి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. 25వతేదీ శనివారం ఉదయం స్వామివరికి రథోత్సవం నిర్వహించారు. [13]
శ్రీ అంకమ్మ తల్లి ఆలయం
మార్చుఈ గ్రామంలో ఈ ఆలయం, కృష్ణా నదీతీరాన, బి.సి.కాలనీలో ఉంది. ఈ ఆలయంలో అంకమ్మ దేవర ఉత్సవాలు మూడు సంవత్సరాలకొకసారి, వైశాఖమాసంలో, వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ అభయంజనేయస్వామివారి అలయం
మార్చుఈ ఆలయం స్థానిక కృష్ణా కరకట్ట వద్ద ఉంది.
గ్రామ విశేషాలు
మార్చు- అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట మంత్రి శ్రీ చివుకుల ఉపేంద్ర, 2015,మే నెల-15వ తేదీనాడు, ఈ గ్రామములో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, చెరువు పూడికతీత పనుల కార్యక్రమాలలో పాల్గొని, నీటిని నిలువ చేసుకొనవలసిన అవశ్యకతను, గ్రామస్థులకు వివరించారు. [8]
- ఈ గ్రామములో మత్తి హరిశంకర్, అరటి చెట్ల పీచు నుండి నార తీసి ఎగుమతి చేసే ఒక నూతన పరిశ్రమ (బనానా ఫైబర్ ఇండస్ట్రీ) ను, 2015,డిసెంబరు-6వ తేదీనాడు ప్రారంభించారు. [9]
- ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగాభివృద్ధి చేయుటకై, ఈ గ్రామాన్ని అవనిగడ్డ సి.ఐ. శ్రీ మూర్తి దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీరు ఈ గ్రామంలో 100% మరుగుదొడ్లు ఏర్పాటుచేసెదరు. [14]
మూలాలు
మార్చువెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013,అక్టోబరు-28; 3వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జనవరి-9; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-26; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-3; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-15; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-15; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చి-28; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే నెల-16వతేదీ; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-7; 40వపేజీ. [10] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-21; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-13; 2వపేజీ. [12] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-17; 2వపేజీ. [13] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఫిబ్రవరి-22,24&26; 2వపేజీ. [14] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఆగస్టు-23; 2వపేజీ.