కొనింటి మాణిక్‌రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

కొనింటి మాణిక్‌రావు
కె.మాణిక్‌రావు


పదవీ కాలం
2018 - ప్రస్తుతం
నియోజకవర్గం జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1953, జూలై 9
ఝరాసంగం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బాలప్ప, లచ్చమ్మ
జీవిత భాగస్వామి మధులత
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

జననం, విద్య

మార్చు

మాణిక్ రావు 1953, జూలై 9న బాలప్ప, లచ్చమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని ఝరాసంగం గ్రామంలో జన్మించాడు. 1977లో హైదరాబాదు మాసబ్ ట్యాంక్ లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చదివాడు. ఆర్.టి.ఓ.గా పనిచేసి పదవి విరమణ పొందాడు.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

మాణిక్ రావుకు మధులతతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[4]

రాజకీయ విశేషాలు

మార్చు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాణిక్ రావు, ఆ పార్టీ నుండి జహీరాబాద్ నియోజకవర్గానికి ఇంచార్జిగా నియమించబడ్డాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీతారెడ్డి చేతిలో 842 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జె. గీతారెడ్డి పై 34,473 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

మాణిక్‌రావు 2023లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా ఆయనకు 97,205 ఓట్లు, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌కు 84,415 ఓట్లు వచ్చాయి. దింతో ఆయన 12,790 ఓట్ల మెజార్టీతో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[7]

మూలాలు

మార్చు
  1. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-28.
  2. "Koninty Manik Rao(TRS):Constituency- ZAHIRABAD (SC)(SANGAREDDY) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-28.
  3. "Koninty Manik Rao | MLA | Zahirabad | Sangareddy | Telangana | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-01. Retrieved 2021-08-28.
  4. admin (2019-01-09). "Zaheerabad MLA K.Manik Rao". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-28.
  5. "K.manik Rao(TRS):Constituency- ZAHIRABAD(MEDAK) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-28.
  6. "Zahirabad ఎన్నికల ఫలితాలు 2018 | LIVE Zahirabad Election Result 2018, Candidates List, MLA Winner, Telangana". telugu.news18.com. Retrieved 2021-08-28.
  7. Namaste Telangana (4 December 2023). "మూడుచోట్ల ఎగిరిన గులాబీజెండా". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.