కె.వి.ఆనంద్
కె.వి. ఆనంద్ తమిళనాడుకు చెందిన జర్నలిస్ట్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నటుడు. ఆయన జర్నలిస్టుగా కేరీర్‌ను ప్రారంభించి, పలు సినిమాలకు ఫొటో గ్రాఫర్‌గా కూడా పనిచేశాడు. ఆనంద్ 1994లో సినిమాటోగ్రాఫర్‌గా చేసిన తొలి చిత్రం ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు జాతీయ అవార్డ్ అందుకున్నాడు. ఆయన 2005లో 'కన కందేన్' సినిమాతో దర్శకుడిగా మారాడు.[2][3]
కె. వెంకటేశన్ ఆనంద్ | |
---|---|
![]() | |
జననం | [1] | 1966 అక్టోబరు 30
మరణం | 2021 ఏప్రిల్ 30 చెన్నై, తమిళనాడు రాష్ట్రం, భారతదేశం | (వయసు 54)
మరణ కారణం | గుండె పోటు |
జాతీయత | ![]() |
విద్యాసంస్థ | డిజి వైష్ణవ్ కాలేజీ, అరుంబాక్కం, చెన్నై |
వృత్తి | సినిమాటోగ్రాఫర్,దర్శకుడు, రచయిత , ఫొటోగ్రాఫర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1994–2021 |
పురస్కారాలు | ‘తెన్ మావిన్ కొంబాత్’ సినిమాకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డ్ (1994) |
జననం - విద్యాభ్యాసంసవరించు
ఆనంద్ 1966, అక్టోబరు 30న చెన్నైలో కరిమానాల్ మునుస్వామి వెంకటేశన్, అనసూయ దంపతులకు జన్మించాడు. ఆయన బాల్యమంతా పులికాట్ లో గడిచింది. ఆయన డిజి వైష్ణవ్ కాలేజీ నుండి డిగ్రీ, 1986లో చెన్నై లయోలా కాలేజ్ లో విజువల్ కమ్యూనికేషన్స్ పూర్తిచేశాడు.
ఫొటో జర్నలిస్టుగాసవరించు
కేవీ ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా కెరీర్ ఆరంభించి, కల్కి, ఇండియా టుడే లాంటి పలు పత్రికల్లో పనిచేశాడు.
సినిమాటోగ్రాఫర్‌సవరించు
కేవీ ఆనంద్ తమిళ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1994లో తొలిసారిగా మలయాళ సినిమా 'తెన్మావిన్ కోంబత్'కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసి, తొలి సినిమాతోనే జాతీయ పురస్కారం అందుకున్నాడు. ప్రేమదేశం, ఒకేఒక్కడు, శివాజీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు.[4]
సంవత్సరం | చిత్రం | భాష |
---|---|---|
1994 | తెన్ మావిన్ కొంబాత్ | మలయాళం |
మిన్నరం | మలయాళం | |
1995 | పుణ్యభూమి నాదేశం | తెలుగు |
1996 | కాదల్ దేశం | తమిళం |
1997 | చంద్రలేఖ | మలయాళం |
1997 | నేరుక్కు నేర్ | తమిళం |
1998 | డోలి సాజా కె రఖ్న | హిందీ |
1999 | మూదల్వన్ | తమిళం |
2000 | జోష్ | హిందీ |
2001 | నాయక్: ది రియల్ హీరో | హిందీ |
2002 | విరుంబిగిరెన్ | తమిళం |
ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ | హిందీ | |
2003 | బాయ్స్ | తమిళం |
2004 | చెల్లమే | తమిళం |
2004 | ఖాకీ | హిందీ |
2007 | శివాజీ | తమిళం |
2007 | హీరోవా? జీరోవా? | తమిళం |
దర్శకుడిగాసవరించు
కేవీ ఆనంద్ 2005లో 'కన కందేన్' సినిమాతో దర్శకుడిగా మారాడు. అయాన్, కో, మాట్రాన్, అనేగన్, కవన్, కప్పాన్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
సంవత్సరం | చిత్రం | |
---|---|---|
2005 | కణా కండేన్ | శ్రీకాంత్, గోపిక, పృఃథ్వీరాజ్ సుకుమారన్ |
2009 | అయాన్ | సూర్య, తమన్నా, ప్రభు |
2011 | కో | జీవ, అజ్మల్, కార్తీక నాయర్ |
2012 | కణా కండేన్ | సూర్య, కాజల్ అగర్వాల్ |
2015 | అనేగన్ \ అనేకుడు - తెలుగు | ధనుష్, అమైరా దస్తూర్, కార్తీక్ |
2017 | కవన్ | విజయ్ సేతుపతి, టి. రాజేందర్, విక్రాంత్, మడోన్నా సెబాస్టియన్ |
2019 | కాప్పాన్ | సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, సామ్నా కాసిం |
నటుడిగాసవరించు
- మీరా (1992)
- శివాజీ: ది బాస్ (2007)
- మాట్రాన్ (2012)
- కవన్ (2017)
మరణంసవరించు
ఆనంద్, కోవిడ్-19 వ్యాధికి చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2021, ఏప్రిల్ 20న గుండెపోటుతో మరణించాడు.[5]
మూలాలుసవరించు
- ↑ "Anand K. V. - Profile". TamilNadu Film Directors Association. 2012. Archived from the original on 30 October 2012. Retrieved 30 April 2021.
- ↑ TV9 Telugu (30 April 2021). "K.V. Anand: సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ కే.వీ. ఆనంద్ కన్నుమూత.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. - Director and cinematographer K.V. Anand passes away in chennai". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ Sakshi (30 April 2021). "KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ కన్నుమూత". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.
- ↑ "K.V. Anand - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 30 April 2021.
- ↑ The Indian Express (30 April 2021). "Tamil director-cinematographer KV Anand dies at 54". Archived from the original on 30 ఏప్రిల్ 2021. Retrieved 30 April 2021.