కారంచేడు వెంకట రమణాచారి మాజీ ఐఏయస్ అధికారి, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు.[1] దేవాదాయ శాఖ కమిషనర్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా, దేవాదాయ శాఖలో ఉన్న ఈ మూడు ఉన్నతపదవులను నిర్వహించారు. 2012 డిసెంబర్‌లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పరిపాలనా రంగంలోనే కాకుండా, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగంలో వారికున్న ప్రతిభ అందరికీ తెలిసిందే. ఆయన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ (TBSP) అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు.

కె.వి. రమణాచారి
కె.వి. రమణాచారి
జననం
కె.వి. రమణాచారి

ఫిబ్రవరి 8
వృత్తిదేవాదాయ శాఖ కమిషనర్‌
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి
దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్, సాహితీకారుడు,
రాజకీయ పార్టీతెలంగాణా రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిలత
పిల్లలుముగ్గురు పిల్లలు
తల్లిదండ్రులు
  • రాఘవాచారి పండితులు (తండ్రి)
కె.వి. రమణాచారి ని సన్మానం చేస్తున్న వేదగిరి రాంబాబు, సంధ్యారాణి

కుటుంబ వివరాలు

మార్చు

ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా, నారాయణపురం. ఆయన తండ్రి రాఘవాచారి సంస్కృత, ఆంధ్ర, తమిళ భాషల్లో పండితుడు. ఊరి రామాలయంలో అర్చకులుగా ఉండేవారు. యజ్ఞయాగాదులు నిర్వహించేవారు.[1] ఆయన ఏడో తరగతి చదువుకున్న తన శ్రీమతి నుంచి ఆంగ్ల భాష నేర్చుకుని అధ్యాపకుడిగా కూడా పనిచేశాడు. రమణాచారి గారికి ముగ్గురు చెళ్లెళ్లు, ఒక తమ్ముడు. రమణాచారి గారి శ్రీమతి లత. హైదరాబాద్ లోని మాసాబ్‌టాంక్‌లో నివాసం ఉంటున్నారు. కె.వి.రమణాచారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి వీణ ఎమ్‌ఎస్సీ చేసి పుణేలో రీసెర్చి చేస్తోంది. రెండో అమ్మాయి ప్రవీణ అమెరికాలో ఉన్నతోద్యోగంలో ఉంది. అబ్బాయి కిరణానంద్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాడు.

పదవులు

మార్చు

కె.వి.రమణాచారి 1982 ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ కేడర్ కి చెందిన ఐ.ఏ.యస్. అధికారిగా నియమించబడ్డారు. 1986లో గోదావరి తీవ్రమైన వరదలు వచ్చినప్పుడు రమణాచారి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు.

2012 వరకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డ్, సమాచార శాఖ, తిరుమల తిరుపతి దేవస్ధానం మొదలైన అనేక శాఖలకు ఉన్నత అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. 2013 లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా నియమితులయ్యారు. [2] 2010లో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ నుంచి తెలుగు పద్య కవిత్వం మీద పి.హెచ్.డి పట్టా పొందారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన ప్రభుత్వాధికారిగా వీరికి విశేషమైన గుర్తింపు లభించింది. సాహిత్యం, కళలు, నాటకం మొదలైన అంశాల పట్ల విశేషమైన అభిమానం కల్గి రాష్ట్రంలోని అనేక సాహితీ, కళా సంస్ధలకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పక్షాన నంది నాటకోత్సవాలు నిర్వహించడం రమణాచారి కృషివలనే ప్రారంభమయ్యాయి.

ఇతరములు

మార్చు

21 ఏప్రిల్, 2014న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)లో చేరారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో రమణాచారి విద్యార్థి దశలో ఉండగా 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెడ్‌ఫోర్స్ పేరిట సంస్థను స్థాపించి నెలన్నర రోజుల పాటు జైలుకు కూడా వెళ్లారు..

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 మంజుల రెడ్డి, వాకా. "నాన్నకూ అమ్మే నేర్పింది". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 3 October 2016.
  2. [1] | w/o రమణాచారి. సాక్షి e-paperలో; సంప్రదించిన తేదీ 28 మే, 2013.