కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి (జననం 1982 జూలై 17) ఒక భారతీయ రాజకీయ నాయకుడు ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.[1] ప్రస్తుతం, 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జనసేన పార్టీ నెల్లూరు నగర్ ఇన్చార్జిగా ఉన్నాడు.తరువాత అక్టోబరు 13 2023న జనసేనపర్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కేతం రెడ్డి వినోద్ రెడ్డి
జననం (1982-07-17) 1982 జూలై 17 (వయసు 42)
[[నెల్లూరు], ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
విశ్వవిద్యాలయాలుమద్రాస్ విశ్వవిద్యాలయం
వృత్తిరాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
రాజకీయ పార్టీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ
వెబ్‌సైటు
www.vinodreddy.in

వ్యక్తిగత జీవితం

మార్చు

వినోద్ రెడ్డి 1982 జూలై 17న నెల్లూరు నగరంలో జన్మించారు. ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అతని తండ్రి వాసుదేవ రెడ్డి పోలీస్ కానిస్టేబుల్ [2], అతని తల్లి వాణి గృహిణి.అతని తండ్రి పోలీసు కానిస్టేబుల్ వివిధ ప్రాంతాలకు బదిలీ అయినందున, వినోద్ రెడ్డి తన ప్రాథమిక, మాధ్యమిక విద్యను సూళ్లూరుపేటలో, ఇంటర్మీడియట్ గూడూరులో, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (BCA) చెన్నైలోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో పూర్తి చేశారు. అతని అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అతను 2002 సంవత్సరంలో ఇన్వెంటివ్ యాడ్స్ [3] పేరుతో కార్పొరేట్ ప్రకటనలలో తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు .

రాజకీయ జీవితం

మార్చు

2003-2005లో వినోద్ రెడ్డి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత 2006లో నెల్లూరు సిటీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ వర్కర్స్ కమిటీ మెంబర్‌గా పనిచేశాడు. 2008లో రాహుల్ యువ బాట అనే రాజకీయ పైలట్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 2009లో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. 2012, 2014 సంవత్సరాలలో, అతను వరుసగా ఇండియన్ యూత్ కాంగ్రెస్, నెల్లూరు సిటీ, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 లో, అతను భారత జాతీయ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేశాడు, 2016 లో, అతను ఇండియన్ యూత్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.[1]

2017లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) నుండి పొందిన రుణాలను ప్రశ్నిస్తూ సేవ్ నెల్లూరు పేరుతో రాజకీయ ఉద్యమం చేపట్టారు.[4] ఆ తర్వాత 2018లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీలో చేరి నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఇరిగేషన్ మంత్రి, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పోలుబోయిన మీద పోటీ చేసి ఓడిపోయారు.[5]

పవనన్న ప్రజా బాట

మార్చు

2022 మే 17న నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట పేరుతో ఇంటింటికీ తిరిగి రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించాడు, అంటే "పవన్ కళ్యాణ్ ప్రజా బాట" అని తన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ను ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి. అనే విషయాన్ని వివరిస్తున్నాడు.[6][7][8][9]

ములాలు

మార్చు
  1. 1.0 1.1 "Hudco loan burden: Youth Cong. launches campaign". thehindu.com. Retrieved 27 July 2016.
  2. "Son of constable contests from Jana Sena". thehansindia.com. Retrieved 22 March 2019.
  3. "Inventive Ads - About Us". inventiveads.in.
  4. "Save Nellore". vinodreddy.in. Archived from the original on 2021-08-02. Retrieved 2023-09-15.
  5. "Minister Narayana faces a tough maiden direct election". thehindu.com. Retrieved 5 April 2019.
  6. "Jana Sena to commence Pawananna Porubata from May 17". thehansindia.com. Retrieved 13 May 2022.
  7. "వైసిపి ఓటమి ఖాయం : జనసేన". prajasakti.com. Retrieved 18 May 2022.[permanent dead link]
  8. "క్రొత్త వరవడికి నాంది పవనన్న ప్రజాబాట". telugu.suryaa.com. Retrieved 22 May 2022.
  9. "JSP flays scrapping of AP Dulhan Scheme". thehansindia.com. Retrieved 2 July 2022.