కేతు బుచ్చిరెడ్డి కథా రచయిత, కవి.

కేతు బుచ్చిరెడ్డి
Kethu buccireddy.jpg
కేతు బుచ్చిరెడ్డి
జననంకేతు బుచ్చిరెడ్డి
జూన్ 17, 1942
కడప
వృత్తివైద్యాధికారి, పోలీసు శిక్షణా సంస్థ
ప్రసిద్ధికథా రచయిత, కవి, వ్యాసకర్త
భార్య / భర్తలక్ష్మీకాంతమ్మ
పిల్లలుముగ్గురు కుమారులు

వివరాలుసవరించు

ఇతడు కడపలో 1942, జూన్ 17వ తేదీన జన్మించాడు[1]. వృత్తి రీత్యా అనంతపురంలో స్థిరపడ్డాడు. ఇతడు కడపలోని రామకృష్ణ హైస్కూలులోను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను చదివాడు. పిమ్మట గుంటూరులోని వైద్యకళాశాలలో ఎం.బి.బి.యస్. చదివాడు. ఆ తర్వాత అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో వైద్యాధికారిగా పనిచేశాడు. ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా రచనలు చేయసాగాడు. ఇతనికి భార్య లక్ష్మీకాంతమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు దాదాపు అన్ని పత్రికలలో, ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రచురణ/ప్రసారం అయ్యాయి. ఇతడు తన మిత్రులతో కలిసి కొంతకాలం "కవిత" అనే పత్రికను నడిపాడు[2].

రచనలుసవరించు

ఇతని రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సైనిక్ సమాచార్, పొలికేక, స్రవంతి, అనామిక, ఆంధ్రభూమి, పత్రిక, స్వాతి, చక్రవర్తి తదితర పత్రికలలో ప్రచురించ బడ్డాయి. ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం అయ్యాయి. పోలీసుశాఖ వారి "సురక్ష" పత్రికలో వైద్య, ఆరోగ్యసలహాలు అనే శీర్షికను నిర్వహించాడు.

గ్రంథాలుసవరించు

ఇతని ఈ క్రింది రచనలు పుస్తక రూపంలో వెలువడ్డాయి.

 1. ప్రథమ చికిత్స[3]
 2. ముత్యాలు - రత్నాలు (కథల సంపుటి) [4]
 3. ఇదిగో సూర్యుడు (కథల సంపుటి)
 4. ఆర్కెస్ట్రా (భూషి కృష్ణదాసుతో కలిసి)

కథలుసవరించు

కథానిలయంలో లభ్యమౌతున్న కేతు బుచ్చిరెడ్డి కథల జాబితా[5]:

 1. అసమర్థుని ఆత్మహత్య
 2. ఇడుగో సూర్యుడు
 3. ఊరికి ఊపిరాడకుంది
 4. ఎప్పుడొస్తుంది...
 5. ఏప్రిల్ ఫూల్
 6. కృతజ్ఞత కథ
 7. గంతలేనమ్మకు...
 8. గురువుకు పాఠం
 9. జనప్రళయం
 10. తప్పు
 11. తేనెకోరని తుమ్మెద
 12. నగరంలో అడవి
 13. నీకు మృత్యువుకు మధ్య కన్నీళ్లు
 14. నీళ్లకు మృత్యువుకు...
 15. పన్నీటికల కన్నీటి కథ
 16. పాపం దేవుడు పాపం డాక్టరు
 17. పొగ (రు) మంచు
 18. ప్రకృతి వికృతి
 19. బస్సెక్కుతా
 20. బిల్లుకు చెల్లు
 21. మంచంలో నల్లులు
 22. మంచి అంచున
 23. మంచితనానికా శిక్ష
 24. మంటలు మల్లెలు
 25. మచ్చ
 26. మనసు అద్దంలో
 27. మల్లెదీపం
 28. ముత్యాలు-రత్నాలు
 29. ముళ్లకంచె మీద మల్లెపూవు
 30. రాలినమొగ్గ
 31. రైలు బండి
 32. వినిపంచని కేక
 33. విషవలయం
 34. వృత్తి ప్రవృత్తి
 35. వెండిమంచు నల్లమబ్బు
 36. వెలుగు
 37. శిష్యదక్షిణ
 38. సహకారం
 39. హెచ్చరిక

మూలాలుసవరించు