కొండ్రు పుష్పలీల

తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి

కొండ్రు పుష్పలీల (జ.1963) తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకురాలు, మాజీ మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించింది.[2][3] మహిళా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.

కొండ్రు పుష్పలీల
కొండ్రు పుష్పలీల


మాజీ మంత్రి

వ్యక్తిగత వివరాలు

జననం 1963 (age 60–61)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి కొండ్రు రాందాస్‌[1]
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

జననం - విద్యాభ్యాసం మార్చు

పుష్పలీల 1963లో హైదరాబాద్ లోని వ్యాపారస్థుల కుటుంబంలో జన్మించింది. పుష్పలీల ఎనిమిది తోబుట్టువుల మధ్య రెండో సంతానం. వివాహం తర్వాత డిగ్రీ పూర్తిచేసింది. 1992లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ., 1994 లో ఎం.ఫిల్ పూర్తిచేసింది.

వివాహం మార్చు

పుష్పలీలకు 1981 లో కొండ్రు రాందాస్ తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

రాజకీయ జీవితం మార్చు

ఈవిడ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కోసం పోరాటం చేసింది. 'ప్రజల వద్దకు పాలన' సమయంలో తెలుగుదేశం పార్టీ లోని చేరింది. 1999లో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, పదిహేను సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పాలనను ఓడించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరింది. ఆ పార్టీలో టికెట్టు రాకపోవడంతో అటుతరువాత భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి, పిసిసి కార్యదర్శి అయింది.[4] 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున వికారాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి ఓడిపోయింది.[5][6] ఆమెను నవంబరు 18న 2023 ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ  కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించింది.[7]

మూలాలు మార్చు

  1. Eenadu (31 May 2022). "మాజీ మంత్రి పుష్పలీల భర్త రాందాస్‌ మృతి". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
  2. Eenadu (16 November 2023). "7 దశాబ్దాలు 10 మందే వనితలు". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  3. Vadde, Babu Mohan renominated; 9 replaced[permanent dead link]The Hindu March 31, 2004
  4. Assurance to small industries Times of India - November 23, 2002
  5. సాక్షి. "'మాజీల పోరు'లో గెలిచేదెవరో." Retrieved 27 February 2017.
  6. ఆంధ్రజ్యోతి. "రంగారెడ్డిలో రాజకీయ పునరేకీకరణ". Archived from the original on 23 అక్టోబరు 2016. Retrieved 27 February 2017.
  7. HMTV (18 November 2023). "కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి కీలక పదవి..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.